iDreamPost

Bachchan Paandey Report : బచ్చన్ పాండే రిపోర్ట్

Bachchan Paandey Report : బచ్చన్ పాండే రిపోర్ట్

మంచి అంచనాలతో మొన్న శుక్రవారం విడుదలైన బాలీవుడ్ మూవీ బచ్చన్ పాండే. అక్షయ్ కుమార్ హీరో కావడం, ట్రైలర్ లో మంచి మాస్ మసాలా కంటెంట్ ఉన్నట్టు చూపించడంతో బిజినెస్ కూడా బాగానే జరిగింది. అయితే ది కాశ్మీర్ ఫైల్స్ ప్రభంజనంలో దాని పోటీగా వచ్చిన బచ్చన్ పాండే ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద గట్టి పోరాటమే చేస్తోంది. ఎనిమిదేళ్ల క్రితం తమిళంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ జిగర్ తండా రీమేక్ ఇది. దీన్నే తెలుగులో వరుణ్ తేజ్ తో గద్దల కొండ గణేష్ గా తీశారు దర్శకులు హరీష్ శంకర్. బాగానే ఆడింది కూడా. అదే ఫలితం హిందీలోనూ దక్కుతుందన్న నమ్మకంతో దర్శకుడు ఫర్హద్ సాంజి సాహసం చేశారు. రిపోర్ట్ ఏంటో చూద్దాం.

ఇది మనకు తెలిసిన చూసిన కథే. కాకపోతే ఒక కీలక మార్పు చేశారు. భగ్వాలో పేరు మోసిన గ్యాంగ్ స్టర్ బచ్చన్ పాండే(అక్షయ్ కుమార్). జాలి దయ ఏ కోశానా లేని అతని మీద ఒక డాక్యుమెంటరీ సినిమా తీయాలనే లక్ష్యంతో ఆ ఊరికి వస్తుంది మైరా(కృతి సనన్). ఆమెతో పాటు నటుడు కావాలని తహతహలాడుతున్న విష్ణు(అర్షద్ వార్సీ)కూడా తోడుగా ఉంటాడు. మొదట్లో వీళ్ళను వ్యతిరేకించిన బచ్చన్ పాండే ఆ తర్వాత అసలు ఉద్దేశాన్ని అర్థం చేసుకుని సహకరించడం మొదలుపెడతాడు. అయితే మైరా అనుకున్నంత సులభంగా వ్యవహారం ఉండదు. ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు తలెత్తుతాయి. అవేంటో తెరమీద చూడాల్సిందే.

మంచి పాయింట్ ఉన్న కథను టిపికల్ బాలీవుడ్ స్టైల్ లో తీయడానికి వెళ్లి ఫర్హద్ సాంజి మొత్తం ఖంగాళీ చేశారు. అవసరానికి మించిన నిడివితో అవుట్ డేటెడ్ కామెడీతో ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్లాక్ వరకు చాలా ల్యాగ్ తో నెట్టుకొచ్చాడు. సెకండ్ హాఫ్ మొదలయ్యాక పంకజ్ త్రిపాఠి లాంటి బలమైన క్యాస్టింగ్ ఉన్నప్పటికీ వీక్ రైటింగ్ వల్ల అది పూర్తి స్థాయిలో ఉపయోగపడలేదు. పైగా కామెడీ ఫోర్స్డ్ గా ఉండటం మరో మైనస్. ఒరిజినల్ వెర్షన్ లో ఉన్న మగ ఫిలిం మేకర్ క్యారెక్టర్ ని ఇందులో హీరోయిన్ గా మార్చడం ప్రధాన మైనస్. ఓ మోస్తరు ఎంటర్ టైన్మెంట్  తప్ప మరీ ఎక్కువ ఎగ్జైట్మెంట్ అనిపించే కంటెంట్ అయితే బచ్చన్ పాండేలో పెద్దగా లేదు

Also Read : Virata Parvam : ఇంతకీ రానా సినిమాను తీసుకొస్తారా లేదా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి