iDreamPost

ఆ హీరో అన్న మాటలు విని ఎంతో బాధపడ్డా.. అందుకే ‘బేబీ’ని ఇలా తీశా: సాయి రాజేష్!

  • Author singhj Published - 08:46 PM, Wed - 19 July 23
  • Author singhj Published - 08:46 PM, Wed - 19 July 23
ఆ హీరో అన్న మాటలు విని ఎంతో బాధపడ్డా.. అందుకే ‘బేబీ’ని ఇలా తీశా: సాయి రాజేష్!

చిన్న చిత్రాలను ఆదరించడానికి ప్రేక్షకులు ఎప్పుడూ రెడీగా ఉంటారు. ఎన్నో సినిమాల విజయాల ద్వారా ఇది రుజువైంది. అయితే కంటెంట్​లో దమ్ముండాలి. కథ, కథనాలు బాగుంటే మూవీ చిన్నదా, పెద్దదా అనేది ఆడియెన్స్ పెద్దగా పట్టించుకోరు. ఇటీవల రిలీజైన ‘బేబీ’ చిత్రం ద్వారా ఇది మరోమారు ప్రూవ్ అయింది. ‘హృదయ కాలేయం’ ఫేమ్ సాయి రాజేష్ తెరకెక్కించిన ఈ ఫిల్మ్​లో ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించారు. బిగ్ స్టార్స్ లేకపోయినా ఈ మూవీకి ఆడియెన్స్​లో మంచి బజ్ నెలకొంది. ‘ఆ రెండు మేఘాలిలా..’ పాట సూపర్ హిట్టవ్వడం, ప్రమోషన్స్​ కూడా బాగా చేయడంతో ‘బేబీ’పై అంచనాలు పెరిగిపోయాయి.

ప్రీమియర్‌‌ షోస్​కు పాజిటివ్ టాక్ రావడంతో ‘బేబీ’ రిలీజ్​ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూశారు. విడుదలైనప్పటి నుంచి సినిమా బాక్సాఫీస్​ను షేక్ చేస్తోంది. రిలీజైన మూడ్రోజుల్లోనే బ్రేక్ ఈవెన్​ను పూర్తి చేసి లాభాల బాట పట్టింది. ఈ నేపథ్యంలో మూవీ యూనిట్ నిర్వహించిన సక్సెస్​ మీట్​లో ‘బేబీ’ దర్శకుడు సాయి రాజేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా కథను ఒక హీరో దగ్గరకు వెళ్లి చెబితే.. ఆయనను భరించలేనని అర్థం చేసుకొని వెనక్కి వచ్చేశారట. మరో హీరోకు ప్రొడక్షన్ హౌజ్ నుంచి కాల్ వెళ్లిందట. కానీ ‘హృదయ కాలేయం’ దర్శకుడు అని చెప్పగానే స్టోరీ కూడా వినను అని ఆ హీరో అన్నారట.

ఆ హీరో మాటలు విని తానెంతో బాధపడ్డానని సాయి రాజేష్ చెప్పుకొచ్చారు. ఆ మాటలతో రాత్రి నిద్రపట్టలేదని తెలిపారు. ఆ హీరో మాటలు విని ‘బేబీ’ రైటింగ్​ స్టైల్​ను పూర్తిగా మార్చేశానని పేర్కొన్నారు. అయితే ఆ హీరో ఎవరనేది మాత్రం ఆయన వెల్లడించలేదు. ‘బేబీ’కి కలెక్షన్లు బ్రహ్మండంగా వస్తున్నా.. అదే టైమ్​లో సినిమాపై మిక్స్​డ్ టాక్ కూడా వినిపిస్తోంది. దీని పైనా సాయి రాజేష్ స్పందించారు. ఈ చిత్రం విషయంలో కొన్ని తప్పులు జరిగాయని.. అందుకే సక్సెస్​ను పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోతున్నానని వ్యాఖ్యానించారు. తనకు మిక్స్​డ్ ఎమోషన్స్ ఉన్నాయన్నారు. మరి.. ‘బేబీ’ మూవీని మీరు చూశారా? ఒకవేళ చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి