iDreamPost

చంటి పిల్లలు ఉన్న తల్లుల కోసం స్పెషల్ బర్త్ లు.. త్వరలో అన్ని రైళ్లలో..

చంటి పిల్లలు ఉన్న తల్లుల కోసం స్పెషల్ బర్త్ లు.. త్వరలో అన్ని రైళ్లలో..

రైల్వే శాఖ రైళ్లలో ప్రయాణికుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త సౌకర్యాలని అందించడానికి ప్రయత్నిస్తుంది. అయితే భారతీయ రైళ్లలో పెద్ద సంఖ్యలో బాలింతలు, చంటిపిల్లలు ఉన్న తల్లలు కూడా ప్రయాణిస్తుంటారు. వీరి కోసం ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు లేవు. ఇందులో భాగంగానే వీరి కోసం ఈ సౌకర్యం తీసుకొచ్చింది రైల్వే శాఖ. రైలులో ప్రయాణించే సమయంలో చంటిబిడ్డలున్న తల్లులకు ఇబ్బంది లేకుండా ఉండేలా ప్రత్యేకంగా సీటును తయారు చేశారు. వీటిని బేబీ బెర్త్‌ల పేరుతో అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

మొదట ప్రయోగాత్మకంగా నార్తర్న్‌ రైల్వే డివిజన్‌ అధికారులు ఇంజనీర్లతో కలిసి లోయర్‌ బెర్త్‌లో కొన్ని అదనపు మార్పులు చేసి బేబీ బెర్త్‌ను రూపొందించారు. ప్రస్తుతం తొలిసారిగా ఈ సౌకర్యాన్ని లక్నో మెయిల్‌లో ప్రవేశపెట్టారు. దీనికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభిస్తే ఇతర రైళ్లలో కూడా ప్రవేశపెడతామన్నారు.

మాతృ దినోత్సవ శుభాకాంక్షలతో లక్నో మెయిల్‌లోని కోచ్ నెం 194129/ B4, బెర్త్ నం 12 & 60లో బేబీ బెర్త్ అమర్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు రైల్వే మినిస్ట్రీ ట్విట్టర్ లో షేర్ చేసి ఈ బేబీ బర్త్ లను ప్రయోగాత్మకంగా మొదలు పెట్టినట్టు తెలిపారు. వీటికి మంచి స్పందన వస్తే మరిన్ని రైళ్లలో ప్రవేశపెట్టనున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి