iDreamPost

వీడియో: ‘బ్రా’ వేసుకున్న బాబర్ ఆజం.. పాకిస్థాన్​ కెప్టెన్​పై ట్రోలింగ్!

  • Author singhj Published - 09:44 PM, Sat - 29 July 23
  • Author singhj Published - 09:44 PM, Sat - 29 July 23
వీడియో: ‘బ్రా’ వేసుకున్న బాబర్ ఆజం.. పాకిస్థాన్​ కెప్టెన్​పై ట్రోలింగ్!

క్రికెట్​ ఫీల్డ్​లో అప్పుడప్పుడూ కొన్ని సరదా ఘటనలు చోటుచేసుకుంటాయి. ప్లేయర్ల మధ్య జరిగే ఫన్నీ ఇన్సిడెంట్స్​కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. మైదానం లోపలే కాదు వెలుపల కూడా సరదా ఘటనలు జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పడు పాకిస్థాన్ జట్టు సారథి బాబర్ ఆజంకు సంబంధించిన అలాంటి ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అసలేం జరిగిందంటే.. ఒక అభిమాని బాబర్​ను తన జెర్సీ అడిగారు. దీంతో కాదనకుండా షర్ట్ తీసేసి గిఫ్ట్​గా ఇచ్చేశాడు పాక్ కెప్టెన్. అయితే బాబర్ ఇచ్చిన గిఫ్ట్ కంటే కూడా అతడు వేసుకున్న ఇన్నర్​వేర్​ను చూసి అందరూ కంగుతిన్నారు.

సాధారణంగా మేల్ ప్లేయర్స్ షర్ట్ లోపల బనియన్ వేసుకుంటారు. అయితే స్త్రీలు ధరించే బ్రాను బాబర్ ఆజం ధరించడం ఏంటని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ బాబర్​ను ట్రోల్ చేస్తున్నారు. స్త్రీలు వేసుకునే బ్రాను ధరించాడంటూ అతడిపై కామెంట్స్ చేస్తున్నారు. అయితే నిజానికి బాబర్ వేసుకున్నది ఓ అథ్లెటిక్ జాకెట్. హార్ట్ రేట్ మానిటరింగ్ కోసం కొన్ని సందర్భాల్లో ప్లేయర్లు ఇలాంటి జాకెట్లను ధరిస్తుంటారు. చాలా మంది అథ్లెట్లు ఈ తరహా జాకెట్లను వాడుతున్నారు. బాబర్ ఆజం మాత్రం బహిరంగంగా జెర్సీ విప్పడంతో లోపల ఉన్న జాకెట్ అందరికీ కనిపించింది. ఇది అచ్చం బ్రాను పోలి ఉండటమే అతడు ట్రోలింగ్​కు గురవ్వడానికి కారణంగా చెప్పొచ్చు.

ఎప్పుడూ ఏదో ఒక విషయంలో బాబర్ ఆజం ట్రోలింగ్​కు గురవ్వడం కామనే. ఈసారి కూడా అలాగే జెర్సీ విప్పి ట్రోలర్లకు మరో ఛాన్స్ ఇచ్చాడు. కానీ ఇందులో అతడి తప్పేమీ లేదు. కాగా, బాబర్ ఆజం వేసుకున్న జాకెట్​ చాలా తేలికగా ఉంటుంది. ఇది ప్లేయర్లు వేసుకున్నా గుర్తించలేనంత తేలిగ్గా ఉంటుంది. ఇందులో ఓ జీపీఎస్ ట్రాకర్ ఉంటుంది. ఆటగాళ్లు తమ రన్నింగ్ స్పీడ్​తో పాటు హార్ట్ రేట్ మానిటరింగ్ కోసం దీన్ని వాడుతుంటారు. గైరోస్కోప్, మాగ్నెటోమీటర్ కూడా దీంట్లో ఉన్నాయి. ప్లేయర్ల కదలికలను 3డీలో కొలుస్తూ.. వారి స్థానాలను ఇది ట్రాక్ చేస్తుంది. దీంట్లోని సమాచారాన్ని పరిశీలన చేసి ఆటగాళ్ల ఫిట్​నెస్​ను అంచనా వేస్తారు. భారత ఆటగాళ్లు కూడా వీటిని వినియోగిస్తున్నారు. టీమిండియా కండిషనింగ్ కోచ్ శంకర్ బసు 2018లో దీనిని మన జట్టులోకి తీసుకొచ్చారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి