iDreamPost

పతంజలి తప్పుడు యాడ్స్ ఆపేయాలి. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!

Patanjali Should Stop False Ads: తప్పుడు ప్రచారాలు చేస్తూన్నారంటూ ప్రముఖ ఆయుర్వేద సంస్థ పతంజలి పై సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. అంతేకదు బాబా రామ్ దేవ్, ఆచార్య బాలకృష్ణ కోర్టు షాక్ ఇచ్చింది.

Patanjali Should Stop False Ads: తప్పుడు ప్రచారాలు చేస్తూన్నారంటూ ప్రముఖ ఆయుర్వేద సంస్థ పతంజలి పై సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. అంతేకదు బాబా రామ్ దేవ్, ఆచార్య బాలకృష్ణ కోర్టు షాక్ ఇచ్చింది.

పతంజలి తప్పుడు యాడ్స్ ఆపేయాలి. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!

యోగా గురు రామ్‌దేవ్ బాబా గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. దేశ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు ఉన్నారు. ఆ మధ్య రామ్ దేవ్ బాబా ప్రముఖ ఆయుర్వేద సంస్థ పతంజలి ఉత్పత్తులకు సంబంధించిన యాడ్స్ లో ఊదరగొట్టారు. తాజాగా తప్పుడు ప్రకటనలు చేసినందుకు పతంజలి ఉత్పత్తుల యాడ్స్ పై సుప్రీం కోర్లు పూర్తిగా నిషేదం విధించింది. గతంలో ఆదేశాలు ఇచ్చినప్పటికీ మళ్లీ అలాంటి యాడ్స్ పునరావృతం చేయడంపై మండిపడింది. ఈ మేరకు పతంజలి వ్యవస్థాపకులు బాబా రామ్ దేవ్, పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణలకు దిక్కార నోటీసులను పంపించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

తమ ఆయుర్వేద ఉత్పత్తులు కరోనా వైరస్ లాంటి భయంకరమైన వ్యాధులను నయం చేస్తుందంటూ గతంలో పతంజలి ప్రకటించిన విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం ఈ యాడ్ తెగ హల్ చల్ చేసింది. ఈ యాడ్స్ పై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎలాంటి శాస్త్రీయత రుజువులు లేకుండా ప్రచారం చేయడంపై ఐఎంఏ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. రామ్ దేవ్ పై ఐపీసీ లోని 188,269,504 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ అంశంపై జస్టిస్ హిమ కోహ్లీ, జస్టిస్ ఎహ్సానుద్దిన్ అమానుల్లాతో ధర్మాసనం విచారణ చేపట్టింది.. ఈ క్రమంలోనే మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఇకపై పతంజలి ఆయుర్వేద్ ఉత్తత్తుల యాడ్స్ తక్షణమే నిషేదించాలని ఆదేశించారు.

ఇకపై పతంజలి యాజమాన్యం తమ ప్రాడెక్ట్స్ కి సంబంధించిన యాడ్స్ మార్కెటింగ్ ప్రచారం చేయకూడదని ఆదేశించింది. అంతేకాదు పతంజలి గ్రూప్ సంస్థల వ్యవస్థాపకుడు బాబా రామ్ దేవ్, ఆచార్య బాలకృష్ణలకు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు మంగళవారం ఫిబ్రవరి 27 ఇరువురికి దిక్కార నోటీసులు పంపించింది. తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టిన కారణంగా యాజమాన్యానికి కోటి రూపాయలు జరిమానా ఎందుకు విధించకూడదంటూ ప్రశ్నించింది. ఇలాంటి యాడ్స్ చట్టాలను ఉల్లంఘించినట్లు అవుతుందని.. అయినా కూడా కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహించింది. మళ్లీ కోర్టు అనుమతించే వరకు పతంజలి ప్రకటనలపై పూర్తిగా నిషేదం విధిస్తున్నట్లు వెల్లడించింది. తదుపరి విచారణ ఉంటుందని.. మార్చి 15కు వాయిదా వేసింది. ఇప్పటి వరకు పతంజలి మెడిసన్, హెయిర్ ఆయిల్, ఫేష్ వాష్, టూత్ పేస్ట్, కండీషనర్, మరికొన్ని నిత్యావసర సరుకులు అమ్ముతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి