iDreamPost

Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరంలో బాలరాముడినే ఎందుకు ప్రతిష్టిస్తున్నారు?

  • Published Jan 22, 2024 | 9:19 AMUpdated Jan 22, 2024 | 2:38 PM

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం కోసం కోట్లాది మంది హిందువులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో మరి ఆలయంలో బాలరాముడి విగ్రహాన్నే ఎందుకు ప్రతిష్టుస్తాన్నారు అంటే..

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం కోసం కోట్లాది మంది హిందువులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో మరి ఆలయంలో బాలరాముడి విగ్రహాన్నే ఎందుకు ప్రతిష్టుస్తాన్నారు అంటే..

  • Published Jan 22, 2024 | 9:19 AMUpdated Jan 22, 2024 | 2:38 PM
Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరంలో బాలరాముడినే ఎందుకు ప్రతిష్టిస్తున్నారు?

సుమారు ఐదు శతాబ్దాల హిందువుల నిరీక్షణకు నేడు తెర పడింది. ఎన్నో పోరాటాలు, కేసుల తర్వాత అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం ప్రారంభం అయ్యింది. నేడు అనగా జనవరి 22, సోమవారం మధ్యాహ్నం సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆలయంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఈ అపురూప ఘట్టాన్ని స్వయంగా వీక్షించడం కోసం కోట్లాది మంది హిందువులు ఎంతో భక్తిగా ఎదురు చూస్తున్నారు. రాముడు నడయాడిన అయోధ్యా పురిలో నేడు.. ఆ స్వామి కొలువు అయ్యారు. అయోధ్య భవ్య మందిర ప్రారంభోత్సవం సందర్భంగా దేశమంతా పండగ వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా రామ నామమే వినిపిస్తోంది. మీడియా, సోషల్‌ మీడియా ఎక్కడ చూసినా అయోధ్యాపురి వార్తలే దర్శనం ఇస్తున్నాయి.

అయోధ్య మందిర ప్రారంభోత్సవం సంధర్భంగా నేడు గర్భగుడిలో బాలరాముడి విగ్రహానికి నరేంద్రమోదీ ప్రాణ ప్రతిష్ట చేశారు. అయితే ఆలయంలో ఎందుకు బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నారు.. కారణాల ఏంటి అంటే.. అయోధ్య అంటే రాముడు జన్మించిన ప్రాంతం. ఆయన జన్మించింది.. బాలుడిగా నడయాడిన ప్రాంతం అయోధ్యాపురే. అంతేకాక మొదటి నుంచి కూడా ఇక్కడ బాలరాముడి విగ్రహాలే వెలశాయి.

Why is Bala Ram worshipped

అయోధ్యలో బాలరాముడి విగ్రహాన్ని పూజించడం పరంపరగా వస్తోంది. అందుకే నేడు అయోధ్య ఆలయంలో కూడా బాలరాముడి విగ్రహాన్నే ప్రాణప్రతిష్ట చేయనున్నారు. అంటే పెళ్లి కానీ రాముడి విగ్రహం అన్న మాట. అందుకే నేడు అయోధ్యలో బాలరాముడి విగ్రహాన్నే ప్రతి‍ష్టించారు. అలానే అయోధ్య ప్రాంతంలో చిన్న పిల్లలను లల్లా అంటారు. ఇక్కడ బాలరాముడినే పూజిస్తారు కనుక.. అయోధ్య రాముడుని కూడా రామ్‌ లల్లా అంటారు.

ఇక అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం కార్యక్రమం నేడు జరిగింది. కానీ జనవరి 15 నుంచి 22 వరకు అనేక క్రతువులు నిర్వహించారు. అలానే నేడు మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి హిందువు ఐదు దీపాలు వెలిగించాలని విశ్వహిందూ పరిషత్‌ కోరింది. ఆ తర్వాత అయోధ్య నుంచి వచ్చిన ఆక్షితలను కుటుంబ సభ్యులందరూ తలపై వేసుకుని ఆశిర్వచనం చేసుకోవాలని సూచించారు. ఇక అయోధ్యలో పెట్టబోయే ప్రసాదం ఇలాచీ దాణా.

ఇక అయోధ్యకు దేశ, విదేశాల నుంచి భారీ ఎత్తున కానుకలు వస్తున్నాయి. ఇక అయోధ్య మందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం కోసం దేశ విదేశాల నుంచి భారీ ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం శ్రీరామ జన్మభూమి క్షేత్ర తీర్థ ట్రస్ట్‌.. సుమారు 8 వేల మంది అతిరథ, మహరథులను ఆహ్వానించింది. ఇక రామ మందిర నిర్మాణం కోసం జనాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భారీ ఎత్తున్న విరాళాలు సమర్పించారు. వాటితోనే ఆలయ నిర్మాణం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి