iDreamPost

పాత రిలీజులకు ప్రేక్షకుల పట్టం

పాత రిలీజులకు ప్రేక్షకుల పట్టం

ఏ ముహూర్తంలో మొదలయ్యిందో కానీ పాత బ్లాక్ బస్టర్ల రీ రిలీజుల పర్వం కొత్త పుంతలు తొక్కుతోంది. నిన్న మొన్న బాలకృష్ణ చెన్నకేశవరెడ్డికి జరిగిన హంగామా సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. అంతకు ముందు పోకిరి, జల్సా రికార్డుల గురించి ఫ్యాన్స్ మాట్లాడుకుంటూనే ఉంటారు. ఘరానా మొగుడు కొన్ని చోట్ల హౌస్ ఫుల్ చేసుకోవడం గుర్తే. వచ్చే జనవరిలో 20వ యానివర్సరీ సందర్భంగా ఒక్కడు స్పెషల్ ఎడిషన్ ని 4కెతో సిద్ధం చేయబోతున్నారు. ఈ ఏడాది చివరిలో డిసెంబర్ 31న పవన్ కళ్యాణ్ ఖుషిని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని నిర్మాత ఏఎం రత్నం ఇటీవలే ప్రకటించారు. అక్టోబర్ లో ప్రభాస్ బిల్లా, వర్షంలు రాబోతున్నాయి.

ఇవే కాదు హాలీవుడ్ క్లాసిక్స్ కి సైతం ఇదే ట్రీట్మెంట్ దక్కుతోంది. మూడు రోజుల క్రితం వచ్చిన అవతార్ కు ఏ సెంటర్స్ లో సూపర్బ్ రెస్పాన్స్ దక్కింది. ఎంతలేదన్నా పది కోట్ల దాకా వసూళ్లు వచ్చాయని ట్రేడ్ టాక్. దాన్ని థియేటర్లో మిస్ చేసుకున్న న్యూ జనరేషన్ యూత్, కిడ్స్ త్రీడిలో చూసేందుకు పరిగెడుతున్నారు. ఇక్కడ చెప్పిన సినిమాలన్నీ ఆన్ లైన్ లో దొరుకుతున్నవే. మంచి హెచ్డిలోనే ఉన్నాయి. అయినా కూడా బిగ్ స్క్రీన్ మీద చూసే అనుభూతి కోసం హౌస్ ఫుల్స్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఆదిని ఇంకా భారీగా తీసుకొస్తామని మొన్నే ఓ ఇంటర్వ్యూలో బెల్లంకొండ సురేష్ చెప్పడం తారక్ ఫ్యాన్స్ కి కొత్త జోష్ ఇచ్చింది. దానికీ ఓ రేంజ్ రచ్చ ఉంటుంది.

ఇకపై ఎంతకాలం ఈ ట్రెండ్ కొనసాగుతుందని చెప్పలేం కానీ ఇప్పట్లో ఆగే సూచనలు మాత్రం కనిపించడం లేదు. ఇలా పాత సినిమాలు బంగారు బాతుల్లా మారడంతో ఇప్పటిదాకా థర్డ్ పార్టీ ద్వారా జరిగిన విడుదలలు ఇకపై నేరుగా ప్రొడ్యూసర్ల వైపు నుంచి జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఎల్లుండి వైజాగ్ లో మగధీర స్పెషల్ షో ప్లాన్ చేశారు. త్వరలో వెంకటేష్ బొబ్బిలి రాజా లేదా జయం మనదదేరా రెండింటిలో ఒకదాన్ని పంపిణి చేసే ఆలోచనలో సురేష్ సంస్థ ఉన్నట్టు తెలిసింది. యుట్యూబ్ కోసమని వీటిని ఎప్పుడో రీ మాస్టర్ చేసి ఉంచారు. సో కంటెంట్ ఉన్న వాటికి కాలదోషం ఉండదని మళ్ళీ మళ్ళీ చాటుతున్న ఈ ధోరణి ఇంకెంత కాలం ఉంటుందో చూడాలి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి