iDreamPost

బిగ్ బాస్ లేడీ కంటెస్టెంట్ పై అట్రాసిటీ కేసు!

బుల్లితెరపై వస్తున్న బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ మంచి రేటింగ్ తో దూసుకువెళ్తుంది. తెలుగు లో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7 నడుస్తుంది. ఇక్కడ అంతా ఉల్టా.. ఫల్టా అంటూ ప్రతివారం నాగార్జున సందడి చేస్తున్నారు. తమిళంలో కమల్ హాసన్, కన్నడలో కిచ్చా సుదీప్ హూస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

బుల్లితెరపై వస్తున్న బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ మంచి రేటింగ్ తో దూసుకువెళ్తుంది. తెలుగు లో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7 నడుస్తుంది. ఇక్కడ అంతా ఉల్టా.. ఫల్టా అంటూ ప్రతివారం నాగార్జున సందడి చేస్తున్నారు. తమిళంలో కమల్ హాసన్, కన్నడలో కిచ్చా సుదీప్ హూస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

బిగ్ బాస్ లేడీ కంటెస్టెంట్ పై అట్రాసిటీ కేసు!

బాలీవుడ్ లో బిగ్ బాస్ రియాల్టీ షోకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. సల్మాన్ ఖాన్ హూస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ బిగ్ బాస్ తెలుగు తో పాటు కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది. బిగ్ బాస్ ఫ్లాట్ ఫామ్ తో ఎంతోమంది సెలబ్రెటీలు అయ్యారు. ఇండస్ట్రీలో మంచి ఆఫర్లు దక్కించుకున్నారు. బిగ్ బాస్ అంటే ఒకే ఇంట్లో కొన్ని నియమనిబంధనలకు కట్టుబడి ఉండాలి. తోటి కంటెస్టెంట్లతో అసభ్యంగా, వ్యక్తిగా విషయాలు మాట్లాడకూడదు. ఒకరిపై ఒకరు దాడి చేయకూడదు, తమను తాము హింసించుకోకూడదు. అయితే కొన్నిసార్లు బిగ్ బాస్ లో హౌజ్ లో ఇంటి సభ్యుల మధ్య గొడవలు తారా స్థాయికి చేరుకొని ఒకరినొకరు దూషించుకునే వరకు వెళ్తాయి.. కొన్నిసార్లు మ్యాన్ హ్యాండిలింగ్ కూడా జరుగుతుంది. వీక్ ఎండ్ లో హూస్ట్ వచ్చి వారికి క్లాస్ తీసుకోవడమే… ఇంటి నుంచి పంపించడమో జరుగుతుంది. తోటి ఇంటి సభ్యుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిందని లేడీ బిగ్ బాస్ కంటెస్టెంట్ పై అట్రాసిటి కేసు నమోదు అయ్యింది. వివరాల్లోకి వెళితే..

బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షో కి మంచి ఆదరణ లభిస్తుంది. ప్రస్తుతం హిందీతో పాటు పలు భాషల్లో బిగ్ బాస్ రియాల్టీ షో సందడి చేస్తుంది. తెలుగు లో బిగ్ బాస్ షోకి కింగ్ నాగార్జున, తమిళంలో కమల్ హాసన్, కన్నడంలో కిచ్చా సుదీప్, మలయాళంలో మోహన్ లాల్ హూస్ట్ గా వ్యవహరిస్తున్నారు. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎన్నో కండీషన్లు ఉంటాయి. టాస్కులు ఆడాల్సి ఉంటుంది. ఇక ఎలిమినేషన్ సమయంలో ఇంటి సభ్యులు మధ్య ఒక యుద్ద వాతావరణం ఉంటుంది. కొన్నిసమయాల్లో హద్దులు దాటి మాట్లాడుకోవడం జరుగుతుంది. అలా కన్నడ బిగ్ బాస్ షోలో ఓ లేడీ కంటెస్టెంట్ నోరు జారి మాట్లాడినందుకు ఆమెపై అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. ప్రస్తుతం కన్నడ బిగ్ బాస్ సీజన్ – 10 నడుస్తుంది. ఈ షో లో నటి తనీషా కుప్పండ కంటెస్టెంట్ గా పాల్గొంది.

ఇన్‌స్టాగ్రామ్ లో ఎంతో యాక్టీవ్ గా ఉండే తనిషా కుప్పండ కన్నడ ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో నటించింది. ఇటీవల సాండ్రితార్ అనే తమిళ మూవీలో కూడా కనిపించింది. ఉండేనామా అనే కన్నడ మూవీలో కీలక పాత్రలో నటించింది. ఈ అమ్మడికి బిగ్ బాస్ సీజన్ 10 లో ఛాన్స్ వచ్చింది. తన గ్లామర్ తో అలరిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్న తనిషా తన తోటి సభ్యులతో కాస్త దురుసుగానే ప్రవర్తిస్తుందని టాక్ వినిపిస్తుంది. నవంబర్ 8న ప్రసారంమైన ఎపిసోడ్ లో తోటి కంటెస్టెంట్ డ్రోన్ ప్రతాప్ ను ‘వడ్డా’ అని పిలిచింది. దీంతో అఖిల కర్ణాటక రాష్ట్ర అధ్యక్షురాలు భోవి సమాజ్ పి పద్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే బెంగుళూరు శివార్లలోని కుంబళగోడు పోలీస్ స్టేషన్ లో తనిషాపై ఫిర్యాదు చేశారు. తనిషాతో పాటు మరోక టీవీ ఛానల్ పై కూడా కేసు పెట్టారు. వడ్డా అనేది షెడ్యూల్డ్ కులాల విభాగంలోకి వచ్చే భోవి సంఘంలో భాగం. షో సందర్భంగా తనిషా భోవి వర్గాన్ని కించపరిచేలా మాట్లాడటం ఇది రెండోసారి అంటూ పద్మ అన్నారు. గత సీజన్ లో నటుడు సిహి కహి చంద్రూ ఇదే పదాన్ని వాడి తర్వాత క్షమాపణలు కోరినట్లు ఆమె తెలిపారు. పద్మ ఫిర్యాదు మేరకు పోలీసులు తనిషా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టం కింద కేసు నమోదు చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి