iDreamPost

Ather నుంచి స్మార్ట్ హెల్మెట్.. దీంతో ప్రమాదాలకు చెక్ చెప్పచ్చు..

Ather Halo Smart Helmet: ఏథర్ ఎనర్జీ కంపెనీ ఎలక్ట్రిక్ బైక్స్ మాత్రమే కాకుండా ఇప్పుడు స్మార్ట్ హెల్మెట్స్ కూడా తయారు చేస్తోంది. ఇటీవల ఏథర్ కంపెనీ తమ రెండు స్మార్ట్ హెల్మెట్స్ ని విడుదల చేసింది.

Ather Halo Smart Helmet: ఏథర్ ఎనర్జీ కంపెనీ ఎలక్ట్రిక్ బైక్స్ మాత్రమే కాకుండా ఇప్పుడు స్మార్ట్ హెల్మెట్స్ కూడా తయారు చేస్తోంది. ఇటీవల ఏథర్ కంపెనీ తమ రెండు స్మార్ట్ హెల్మెట్స్ ని విడుదల చేసింది.

Ather నుంచి స్మార్ట్ హెల్మెట్.. దీంతో ప్రమాదాలకు చెక్ చెప్పచ్చు..

రోడ్డు ప్రమాదాలు మనుషుల జీవితాలను తలకిందులు చేసేస్తాయి. ముఖ్యంగా హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే టూ వీలర్స్ కి సంబంధించి హెల్మెట్ ధరించక పోవడానికి చాలానే కారణాలు, సాకులు చెప్తారు. జుట్టు ఊడిపోతుందని, చెమట పట్టేస్తోందని, హెల్మెట్ అంత కంఫర్ట్ గా లేదని చెప్తుంటారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే స్మార్ట్ హెల్మెట్ ని మీరు తీసేయడానికి సాకులు వెతుక్కోవాలి. ఎందుకంటే ఇది ఎంతో స్టైలిష్, స్టన్నింగ్ లుక్స్, కంఫర్టబుల్, పైగా స్మార్ట్ కూడా. పైగా ఈ హెల్మెట్ ని ఏథర్ ఎనర్జీ ఇండియా వాళ్లు తీసుకొస్తున్నారు. మరి.. ఈ స్మార్ట్ హెల్మెట్ స్పెషాలిటీలు ఏంటి? ధర ఎంతో చూద్దాం.

ఏథర్ ఎనర్జీ కంపెనీకి ఇండియాలో మంచి ఆదరణ ఉంది. వీళ్ల ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి డిమాండ్ ఉంది. ఇటీవేల ఏథర్ రిజ్తా అంటూ మరో కొత్త మోడల్ కూడా తీసుకొచ్చారు. అలాగే ఇప్పుడు వీళ్లు స్మార్ట్ హెల్మెట్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇటీవలో ఏథర్ హలో, ఏథర్ బిట్ అని రెండు రకాల హెల్మెట్లను మార్కెట్ లోకి విడుదల చేశారు. ఈ రెండూ మోడల్స్ స్మార్ట్ హెల్మెట్స్. ఈ స్మార్ట్ హెల్మెట్స్ హలో ఫుల్ హెల్మెట్ కాగా.. బిట్ మాత్ర హాఫ్ హెల్మెట్ గా డిజైన్ చేశారు. ఈ స్మార్ట్ హెల్మెట్స్ డిజైన్ పరంగా ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. అంతేకాకుండా వీటిలో అద్భుతమైన ఫీచర్స్ కూడా ఉన్నాయి.

స్మార్ట్ హెల్మెట్ ఫీచర్స్:

ఈ రెండు స్మార్ట్ హెల్మెట్స్ ఇంచు మించు ఒకే రకమైన ఫీచర్స్ ని కలిగి ఉన్నాయి. ఈ హెల్మెట్స్ లో ఇన్ బిల్ట్ సౌండ్ సిస్టమ్ ఉంటుంది. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ హెల్మెట్ ని మీ స్కూటర్ కి, మీ ఫోన్ కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో మీరు డ్రైవింగ్ చేస్తూ మీకు నచ్చిన పాటలను కూడా వినచ్చు. పైగా ఈ హెల్మెట్ ధరించిన తర్వాత కాల్స్ మాట్లాడే సమయంలో ట్రాఫిక్ నాయిస్ చాలా వరకు తగ్గిపోతుంది. మీ కాల్స్ మీకు చాలా స్పష్టంగా వినిపిస్తాయి. ఏథర్ హలో స్మార్ట్ హెల్మెట్ అయితే వైరెల్స్ ఛార్జర్ సిస్టమ్ తో వస్తోంది. రిజ్తా బండి ఉన్న వాళ్లు అయితే డిక్కీలోనే వైర్ లెస్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. రిజ్తా లేనివాళ్లు ఇంట్లో వైర్ లెస్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. హాఫ్ హెల్మెట్ బిట్ మాత్రం టైప్ సీ పోర్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

ఈ స్మార్ట్ హెల్మెట్స్ మీరు ధరించగానే ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతాయి. బండికి ఉండే బటన్ సహాయంతో మీరు మ్యూజిక్, కాల్స్ ని మేనేజ్ చేసుకోవచ్చు. ఈ హెల్మెట్స్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే వారం వరకు వస్తాయని చెప్తున్నారు. వీటి ధరల విషయానికి వస్తే.. హలో హెల్మెట్ ధర రూ.14999గా ఉంది. అయితే ఇంట్రక్షనరీ ఆఫర్ రూ.12,999కే అందిస్తున్నారు. హాఫ్ హెల్మెట్ బిట్ మాత్రం రూ.4,999కే అందిస్తున్నరాు. ఈ స్మార్ట్ హెల్మెట్స్ వల్ల ఫోన్ హెల్మెట్ లో పెట్టుకునే మాట్లాడుతూ రోడ్డుని పట్టించుకోకుండా ప్రమాదాలకు గురయ్యే ప్రమాదం ఉండదని చెప్పచ్చు. ఈ స్మార్ట్ హెల్మెట్స్ వల్ల ప్రమాదాలు కూడా తగ్గే ఆస్కారం ఉందని టెక్ నిపుణులు అంచనాలు వేస్తున్నారు. మరి.. ఏథర్ కంపెనీ స్మార్ట్ హెల్మెట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి