iDreamPost

బాలకృష్ణ తీరుపై అచ్చెన్న ఆవేదన! ఇదేమి మర్యాద?

బాలకృష్ణ తీరుపై అచ్చెన్న ఆవేదన! ఇదేమి మర్యాద?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. మాములుగానే ఏపీ పొలిటికల్ హీట్  ఓ రేంజ్ లో ఉంటుంది. అలాంటిది టీడీపీ అధినేత  చంద్రబాబు నాయుడి అరెస్ట్ తరువాత మరో స్థాయికి ఏపీ రాజకీయం చేరుకుంది. ఇక చంద్రబాబు అరెస్ట్ తరువాత టీడీపీ బాధ్యతలను బాలకృష్ణ చూసుకుంటున్నారు. అన్నితానై పార్టీ వ్యవహారాలను నడిపిస్తున్నారు. గురువారం ప్రారంభమైన అసెంబ్లీలోనూ టీడీపీ తరపున బాలకృష్ణ ముందుండి నడిపించారు. అలానే పార్టీ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే విషయాలను సైతం బాలకృష్ణే డిసైడ్ చేస్తున్నారు.

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చంద్రబాబు జైలుకు వెళ్లడంతో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బాలు జైలుకు వెళ్లడంతో టీడీపీ బాధ్యతలను హిందూపురం ఎమ్మెల్యే నందరమూరి బాలకృష్ణ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న తీరు చూస్తే అదే నిజం అనిపిస్తోంది. ఇక బాలకృష్ణ తీరు.. ఏపీ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి  అచ్చెన్నాయుడికి ఆవేదనను కలిగిస్తోందని టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి చంద్రబాబు అరెస్ట్ తో  పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడే కీలక బాధ్యతలు నిర్వహించాలి.

కానీ అలాంటి దాఖాలు ఎక్కడ కనిపించలేదు. అన్నీ తానై నందమూరి బాలకృష్ణ పార్టీ విషయాలను చూసుకుంటున్నాడు. ఇలా బాలకృష్ణ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అచ్చెన్నాయుడు.. తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు టాక్. అసెంబ్లీలో చంద్రబాబు తరువాత టీడీపీ పక్ష నాయకుడు అచ్చెన్నాయుడే. అయితే అలాంటి ఆయనకు తెలియకుండానే అసెంబ్లీలో టీడీపీ సభ్యులు వివిధ చర్యలకు దిగడం ఆయనకు ఆగ్రహం తెప్పించిదంట. తనకు తెలియకుండానే బాలయ్య తొడ కొట్టడం, మీసాలు తిప్పడం, విజిల్స్ వేయడం వంటి వాటితో అచ్చెన్న గుర్రగా ఉన్నారని కొందరు అంటున్నారు. అయితే మీడియా ముందు మాత్రం బాలయ్యను వెనకేసుకొచ్చినట్లుగా అచ్చెన్న బిహేవియర్ చేస్తున్నారని టాక్. అలానే అసెంబ్లీలో ఎలాంటి నిరసనల కార్యక్రమాలు చేపట్టాల్లో కూడా బాలయ్యే దిశానిర్దేశం చేయడం ఏంటని అచ్చెన్నాయుడు ఆవేదన చెందినట్లు రాజకీయ విశ్లేషకు అంటున్నారు.

ఇదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు కూడా తమ నాయకుడు బాలకృష్ణే అన్నట్లు అచ్చెన్నాయుడిని పట్టించుకోవడంలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో బయట నుంచి వచ్చే స్లిప్పులు అచ్చెన్నాయుడికి కాకుండా  నేరుగా బాలకృష్ణకే ఇవ్వడంపై అచ్చెన్నాయుడు అసంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద కూడా తనతో సంబంధం లేకుండానే లోకేశ్, బాలకృష్ణ, పవన్ కల్యాణ్ మీడియా ముందుకు రావడం అచ్చెన్నాయుడికి ఆగ్రహం తెప్పించదని టాక్ వినిపిస్తోంది. టీడీపీ కేంద్ర కార్యాలయంలో అధ్యక్షుడి సీట్లో బాలయ్య కూర్చోవడం, అలాగే కార్యకర్తలతో బాలకృష్ణ.. తానున్నానని ప్రకటించడం చూస్తే.. రాష్ట్ర అధ్యక్షుడైన తనను పక్కన పడేయడమే అని భావన, బాధ అచ్చెన్నాయుడిలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి.. బాలయ్య తీరుతో అచ్చెన్నాయుడు ఆవేదనగా ఉన్నట్లు వస్తోన్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి