iDreamPost

ఏప్రిల్ లో అసెంబ్లీ ఎన్నికలు.. క్లారిటీ ఇచ్చిన ఎన్నికల కమీషన్!

  • Published Jan 23, 2024 | 10:22 PMUpdated Jan 23, 2024 | 10:22 PM

ఇటీవల దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాలకు సార్వత్రిక ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. త్వరలో అసెంబ్లీ, మరికొన్ని రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల జరగబోతున్నాయి.

ఇటీవల దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాలకు సార్వత్రిక ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. త్వరలో అసెంబ్లీ, మరికొన్ని రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల జరగబోతున్నాయి.

  • Published Jan 23, 2024 | 10:22 PMUpdated Jan 23, 2024 | 10:22 PM
ఏప్రిల్ లో అసెంబ్లీ ఎన్నికలు.. క్లారిటీ ఇచ్చిన ఎన్నికల కమీషన్!

దేశంలో మరోసారి ఎన్నికల సందడి మొదలు కాబోతుంది. ఇటీవల తెలంగాణ, మిజోరాం, ఛత్తీస్ గఢ్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలో సార్వత్రిక ఎన్నికల జరిగిన విషయం తెలిసిందే. మరికొన్ని రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు, కొన్ని రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. అయితే ఏప్రిల్ 16 నుంచి లోక్ సభ ఎన్నికలు అంటూ ఇటీవల సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలకు రాజకీయ నేతలు సైతం తమ పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశాలు జరుపుతున్నారు. ఈ సారి ఎన్నికల్లో తమ బలా బలాలు తేల్చుకునేందుకు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ లో సార్వత్రిక ఎన్నికలపై ఎన్నికల కమీషన్ క్లారిటీ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే..

భారత దేశంలో ఇటీవల ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యత సంపాదించింది. త్వరలో అసెంబ్లీ, మరికొన్ని రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 16 నుంచి లోక్ సభ ఎన్నికలు అంటూ వార్తలు వస్తున్నాయి. పలువురు అధికారులను ఉద్దేశించి.. 2024 లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్ 16 నుంచి ప్రారంభమవుతాయని ఆ లెటర్ లో ఉన్న సారాంశం. ఈ అంశంపై ఎన్నికల కమీషన్ ఓ క్లారిటీ ఇచ్చింది. ఏప్రిల్ 16 అనేది లోక్ సభ ఎన్నికల తేదీ కాదని.. లోక్ సభ ఎన్నికలకు ముందే ఎన్నికలకు సంబంధించిన కార్యకలాపాలను ప్లాన్ చేసే వాటిని సకాలంలో పూర్తి చేయాలని సూచించే గడువు తేదీ మాత్రమే అని ఈసీ క్లారిటీ ఇచ్చింది.

ఈ తేదీ లోపు ఎన్నికల ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేయాలన్నదే తమ లక్ష్యం అని సీఈవొ కార్యాలయం తెలిపింది. ఈ మేరకు ఆయా వర్గాలకు ఈ నెల 19న అధికారికంగా ఓ లెటర్ ను జారీ చేశామని ఈసీ వెల్లడించింది. అంతేకాదు.. లోక్ సభ ఎన్నికలను ఏ తేదీ నుంచి వాయిదా వేయవొచ్చు అనేదానిపై కూడా చర్చలు నడుస్తున్నాయని ఈసీ తెలిపింది. మరోవైపు ఎన్నికల తేదీలపై కూడా చర్చలు కొనసాగుతున్నాయని.. ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటిస్తుందని సీఈవో కార్యాలయం తెలియజేసింది. మొత్తానికి ఈసీ ఇచ్చిన క్లారిటీతో ఎన్నికల తేదీకి సంబంధం లేదని సోషల్ మీడియాలో వస్తున్న జర్చలకు తెరపడుతుందని ఎన్నికల కమీషన్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి