iDreamPost

‘బ్రూమ్‌బ్రెల్లా ఫీల్డింగ్’ అంటే తెలుసా? బెన్ స్టోక్స్ వ్యూహం.. చూసి నేర్చుకో అంటూ రోహిత్ కి కౌంటర్..

  • Author Soma Sekhar Published - 01:24 PM, Tue - 20 June 23
  • Author Soma Sekhar Published - 01:24 PM, Tue - 20 June 23
‘బ్రూమ్‌బ్రెల్లా ఫీల్డింగ్’ అంటే తెలుసా? బెన్ స్టోక్స్ వ్యూహం.. చూసి నేర్చుకో అంటూ రోహిత్ కి కౌంటర్..

యాషెస్.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఈ సిరీస్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఇక ఈ సిరీస్ కోసం ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా జట్లు హోరాహోరిగా పోటీపడుతుంటాయి. నువ్వా నేనా అన్నట్లు సాగే ఈ సమరంలో.. కొన్ని సార్లు ఇంగ్లాండ్ ది పై చేయి అయితే.. మరికొన్ని సార్లు ఆసిస్ పై చేయి సాధిస్తుంది. తాజాగా ఈ సిరీస్ ప్రారంభం అయ్యింది. తొలి టెస్ట్ హోరాహోరిగా సాగుతోంది. తన బజ్ బాల్ స్ట్రాటజీని మరోసారి చూపించింది ఇంగ్లాండ్ జట్టు. ఇక ఈ టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ‘బ్రూమ్‌బ్రెల్లా ఫీల్డింగ్’తో ఉస్మాన్ ఖవాజాను బోల్తా కొట్టించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో.. అందరు బ్రూమ్ బ్రెల్లా ఫీల్డింగ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ ఫీల్డింగ్ గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

యాషెస్ 2023 సమరం స్టార్ట్ అయ్యింది. తొలి టెస్ట్ హోరాహోరిగా సాగుతోంది. విజయం రెండు జట్లతో దోబూచులాడుతోంది. ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఉస్మాన్ ఖవాజాను బెన్ స్టోక్స్ అవుట్ చేసిన తీరు అద్భుతమనే చెప్పాలి. సూపర్ సెంచరీతో దూసుకుపోతున్న ఖవాజాను వెరైటీ ఫీల్డ్ సెటప్ తో అవుట్ చేశాడు. ఆ ఫీల్డ్ సెటప్ పేరే బ్రూమ్ బ్రెల్లా ఫీల్డింగ్. క్రికెట్ లో చాలా అరుదుగా ఈ ఫీల్డింగ్ సెటప్ ను వాడుతుంటారు. ఈ ఫీల్డింగ్ సెటప్ లో బ్యాటర్ చుట్టూ కేవలం 16 మీటర్ల దూరంలోనే ఫీల్డర్లను మోహరిస్తారు. దాంతో బ్యాటర్ బంతిని డిఫెన్స్ చేసినా గానీ ఫీల్డర్ చేతిలో పడుతుందేమో అన్న భయం పుడుతుంది. ఆ భయమే ఖవాజాను అవుట్ అయ్యేలా చేసింది. రాబిన్సన్ బౌలింగ్ లో ఖవాజా బౌల్డ్ అయ్యాడు. దాంతో ఒక్కసారిగా బ్రూమ్ బ్రెల్లా ఫీల్డింగ్ వీడియో వైరల్ గా మారింది.

1981-2000 కాలంలో దీనికి బ్రూమ్ బ్రెల్లా ఫీల్డింగ్ గా పేరుపెట్టారు. అప్పటి నుంచి ఈ ఫీల్డింగ్ సెటప్ వాడుకలోకి వచ్చింది. ఇక ఈ ఫీల్డింగ్ సెటప్ ను చూసి.. టీమిండియా కెప్టెన్ కు చురకలు అంటిస్తున్నారు. బెన్ స్టోక్స్ ను చూసి నేర్చుకో రోహిత్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.  ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 8 వికెట్లకు 393 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 273 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఇక ఆసిస్ తొలి ఇన్నింగ్స్ లో 386 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. ఆసిస్ విజయానికి ఐదో రోజు 174 పరుగులు అవసరం ఉంది. ఇంగ్లాండ్ విజయం సాధించాలి అంటే 7 వికెట్లను తీసుకోవాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి