iDreamPost

చంపే హక్కు ఎవరిచ్చారు? సరూర్‌నగర్ పరువు హత్యపై స్పందించిన ఒవైసీ..

చంపే హక్కు ఎవరిచ్చారు? సరూర్‌నగర్ పరువు హత్యపై స్పందించిన ఒవైసీ..

రెండు రోజుల క్రితం హైదరాబాద్ సరూర్ నగర్ లో జరిగిన పరువు హత్య సంచలనం సృష్టించింది. ఆశ్రీన్ అనే ఓ ముస్లిం అమ్మాయి, నాగరాజు అనే ఓ దళిత హిందూ అబ్బాయి గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకొని ఆశ్రీన్ ఇంట్లో ఒప్పుకోకపోవడంతో పెళ్లి చేసుకొని హైదరాబాద్ కి వచ్చి జీవితం గడుపుతుండగా అమ్మాయి సోదరుడు మతాంతర వివాహం చేసుకుందని పగబట్టి రెక్కీ నిర్వహించి మరీ ఆ యువకుడిని మరికొంతమందితో కలిసి నడిరోడ్డు మీదే చంపేశాడు. ఈ పరువు హత్య రాజకీయాల్లో కూడా కలకలం సృష్టిస్తుంది.

దేశంలో ఎక్కడ ముస్లింలపై దాడులు జరిగినా స్పందించే ఒవైసీ సరూర్ నగర్ ఘటనపై మాత్రం ఎందుకు స్పందించట్లేదని పలువురు బీజేపీ నేతలు ప్రశ్నించారు. తాజాగా ఈ పరువు హత్య ఘటనని ఖండిస్తూ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. హైదరాబాద్ దారుస్సలాంలో నిర్వహించిన ఈద్ మిలాప్ కార్యక్రమంలో ఒవైసీ దీనిపై మాట్లాడారు.

ఒవైసీ మాట్లాడుతూ.. సరూర్‌నగర్‌లో జరిగిన పరువు హత్య ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆమె(ఆశ్రిన్ సుల్తానా) ప్రేమించి ఇష్టంగానే ఆ వ్యక్తిని (నాగరాజు) పెళ్లి చేసుకుంది. అది తప్పేం కాదు. కానీ సుల్తాన్ సోదరుడికి ఆమె భర్తను చంపే హక్కు ఎవరిచ్చారు? రాజ్యాంగం ప్రకారం హత్య చేయడం దారుణమైన నేరం. ఇస్లాం ప్రకారం కూడా హత్య చేయడం చాలా తప్పు. ఈ హత్య ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మేము హంతకుల పక్షాన నిలబడేవాళ్లం కాదు అని అన్నారు.

 

.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి