iDreamPost

టెస్టులు పెరిగినందుకే కేసులు పెరిగాయి – కేంద్ర క్యాబినేట్ కార్యదర్శి రాజీవ్ గౌబా

టెస్టులు పెరిగినందుకే కేసులు పెరిగాయి – కేంద్ర క్యాబినేట్ కార్యదర్శి రాజీవ్ గౌబా

కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన కేంద్ర క్యాబినేట్ కార్యదర్శి రాజీవ్ గౌబ కీలక వాఖ్యలు చేశారు. కొన్ని రాష్ట్రాల్లో అధికంగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఏమి ఆందోళన చెందనవసరం లేదని, ఆయా రాష్ట్రాలు టెస్టులు ఎక్కువ చేయడం వలనే సంఖ్య పెరుగుతుందని పేర్కొన్నారు. రెడ్ జోన్లు, కంటైన్మెంట్ ప్రాంతాల్లో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని, నిత్యవసరాల కోసం బయటికి వస్తున ప్రజలకు బౌతిక దూరం పాటించేలా అవగాహన కల్పించాలని కోరారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు 8వేల మందికి పరీక్షలు చేస్తున్నామని, ఈ సంఖ్యను పది వేలకు తీసుకువెళ్ళేందుకు కృషి చేస్తునట్టు,దక్షిణ కొరియా నుండి దిగుమతి చేసుకున్న కిట్లతోనే ఎక్కువ టెస్టులు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. దేశంలో పాజిటివ్ కేసుల శాతం 4.21 ఉండగా రాష్ట్రంలో అది 1.6 గా ఉన్న విషయం తెలిసిందే. ఆదివారం సాయంత్రం నాటికి రాష్ట్రంలో 68,034 మందికి టెస్టులు చెయగా 1097 మందికి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి