iDreamPost

సంక్రాంతికి ఊరెళ్లేవారికి APSRTC బంపరాఫర్.. బస్ టికెట్లపై డిస్కౌంట్!

  • Published Jan 06, 2024 | 9:25 AMUpdated Jan 06, 2024 | 10:56 AM

సంక్రాతి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెబుతుంది. బస్ టికెట్ల మీద డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు..

సంక్రాతి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెబుతుంది. బస్ టికెట్ల మీద డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు..

  • Published Jan 06, 2024 | 9:25 AMUpdated Jan 06, 2024 | 10:56 AM
సంక్రాంతికి ఊరెళ్లేవారికి APSRTC బంపరాఫర్.. బస్ టికెట్లపై డిస్కౌంట్!

త్వరలోనే సంక్రాంతి పండుగ రాబోతుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది చాలా పెద్ద పండుగ. ఎక్కడెక్కడో ఉన్న వారు సైతం సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్తారు. దాంతో నెలల ముందు నుంచే బస్సులు, ట్రైన్ టికెట్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇక సంక్రాంతి సందర్భంగా బస్సులు, రైళ్లు ఎంత రద్దీగా ఉంటాయో చెప్పాల్సిన పని లేదు. కాలు పెట్టే సందు కూడా లేకుండా ఫుల్ రష్ గా ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని పండుగ సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది. అయినా సరే.. రద్దీ మాత్రం అలానే ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా ఏపీఎస్ఆర్టీసీ బంపరాఫర్ ప్రకటించింది. బస్ టికెట్లపై డిస్కౌంట్ ఇస్తుంది. ఆ వివరాలు..

సంక్రాంతికి ఊరెళ్లేవారికి ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా ఉండే రద్దీని దృష్టి పెట్టుకుని.. ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు, హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైతో పాటు ఇతర నగరాల నుంచి సంక్రాంతికి సొంతూళ్లకు వచ్చే వారికోసం రెగ్యూలర్ సర్వీసులతో పాటు.. అదనంగా 6,795 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. అంతేకాక ప్రత్యేక బస్సుల్లో కూడా సాధారణ ఛార్జీలే తీసుకోనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఈ నెల 6 అనగా నేటి నుంచి నుంచి జనవరి 14 వరకు 3,570 బస్సులు.. తిరుగు ప్రయాణాల కోసం జనవరి 16 నుంచి 18 వరకు 3,225 బస్సులు నడుపుతున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.

apsrtc bumper offer

పండుగ సందర్భంగా ఏర్పాటు చేస్తోన్న ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీల భారం లేకుండా సాధారణ చార్జీలతోనే నడుస్తాయి అని ఆర్టీసీ అధికారులు తెలిపారు. అలాగే ఛార్జీలకు చిల్లర సమస్య లేకుండా ఉండేందుకు యూటీఎస్‌ మెషిన్ల ద్వారా టికెట్ల జారీ విధానాన్ని ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులు ఫోన్‌పే, గూగుల్‌ పే, క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయడం ద్వారా టికెట్లు తీసుకోవచ్చు అని వెల్లడించారు. మరోవైపు ఈ ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ సదుపాయం కూడా కల్పించింది. ఒకేసారి రానూపోనూ టికెట్లు రిజర్వేషన్‌ చేసుకుంటే 10 శాతం రాయితీ ఇస్తోంది ఆర్టీసీ. దీంతో సాధారణ చార్జీల కంటే తక్కువతోనే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. దీనిపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పండుగ వేళ.. ప్రయాణికులపై అదనపు భారం పడకూడదనే ఉద్దేశంతోనే.. సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం వరుసగా నాలుగో ఏడాది నిర్ణయించిందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. సంక్రాంతి ప్రత్యేక బస్సుల ద్వారా ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సేవలు అందించేందుకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందని.. ఆర్టీసీ ప్రత్యేక బస్సుల సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ బస్సుల సమాచారంకోసం, ఏవైనా సమస్యలు ఉన్నా కాల్‌ సెంటర్‌ నంబరు 149కి గానీ, 0866-2570005 నంబరుకు ప్రయాణికులు ఎప్పుడైనా ఫోన్‌ చేయొచ్చని తెలిపారు. అంతేకాకుండా బస్సులకు జీపీఎస్‌ ట్రాకింగ్, 24 గంటలు సేవలు అందించే సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి