iDreamPost

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన APSRTC!

దసరా పండగ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) వివిధ రకాల ఆఫర్లతో ప్రయాణికులను ఆకర్షించిన విషయం తెలిసిందే. ఈ పండగలో భాగంగానే ఆర్టీసీకి బాగానే లాభాలు వచ్చినట్లు తెలుస్తుంది.

దసరా పండగ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) వివిధ రకాల ఆఫర్లతో ప్రయాణికులను ఆకర్షించిన విషయం తెలిసిందే. ఈ పండగలో భాగంగానే ఆర్టీసీకి బాగానే లాభాలు వచ్చినట్లు తెలుస్తుంది.

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన APSRTC!

దసరా పండగ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) వివిధ రకాల ఆఫర్లతో ప్రయాణికులను ఆకర్షించిన విషయం తెలిసిందే. ఈ పండగలో భాగంగానే ఆర్టీసీకి బాగానే లాభాలు వచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఈ క్రమంలోనే ప్రయాణికులకు APSRTC మరో శుభవార్త చెప్పింది. వారి సమస్యల పరిష్కారం దిశగా ఇక నుంచి వారికి మరో సుదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణికులకు సహయం చేయడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని ఏపీ ఆర్టీసీ అధికారులు తెలిపారు. తాజా ప్రకటనతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు APSRTC ప్రయాణికులకు చెప్పిన ఆ గుడ్ న్యూస్ ఏంటి? అందుబాటులోకి వచ్చిన ఆ సదుపాయాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇకపై పార్సిల్ సేవలతో పాటు డోర్ డెలవరీ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నామని ఏపీఎస్ఆర్టీసీ సహాయ మేనేజర్ షేక్ అజ్మతుల్లా తాజాగా తెలిపారు. బుక్ చేసిన పార్సిల్ ఏపీలోని 84 ప్రధాన నగరాల్లో, పట్టణాల పరిధిలోని 10 కిలోమీటర్ల వరకు డోర్ డెలవరీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆమె తెలిపారు. హైదరాబాద్ లో 64 బుకింగ్ ఏజెన్సీలు కూడా అందుబాటులో ఉంచామని అన్నారు. ఇంతే కాకుండా అక్టోబర్ 26 నుంచి నవంబర్ 25 వరకు డోర్ డెలవరీ మాసోత్సవాలు కూడా నిర్వహించనున్నట్లు షేక్ అజ్మతుల్లా తెలిపారు. అయితే ఈ క్రమంలోనే డోర్ డెలవరీ ఛార్జీలు కూడా ప్రకటించారు. 1KG పార్సిల్ కు రూ. 15, 6 కిలో వరకు రూ.30. 10 KG వరకు రూ. 36, 25 కిలోల వరకు 48గా నిర్ణియించారు. ఇక 25 కిలోల నుంచి 50 వరకు 59గా నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. కానీ, ఈ సదుపాయం హైదరాబాద్ లో అందుబాటులో లేదని ఆమె తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి