iDreamPost

రాష్ట్ర ప్రజలకు భారీ ఊరట.. ఏపీ సర్కార్ ముందస్తు చర్యలు..

  • Published Feb 14, 2024 | 12:30 PMUpdated Feb 14, 2024 | 12:30 PM

గత కొన్ని రోజులుగా ఏపీలో భారీగా విద్యుత్ చార్జీలు పెరగబోతున్నాయని వార్తలు షికార్లు చేస్తున్నాయి.. ఈ నేపథ్యంలోనే ఏపీఈఆర్సీ చైర్మన్ రాష్ట్ర ప్రజలకు ఓ క్లారిటీ ఇచ్చారు.

గత కొన్ని రోజులుగా ఏపీలో భారీగా విద్యుత్ చార్జీలు పెరగబోతున్నాయని వార్తలు షికార్లు చేస్తున్నాయి.. ఈ నేపథ్యంలోనే ఏపీఈఆర్సీ చైర్మన్ రాష్ట్ర ప్రజలకు ఓ క్లారిటీ ఇచ్చారు.

  • Published Feb 14, 2024 | 12:30 PMUpdated Feb 14, 2024 | 12:30 PM
రాష్ట్ర ప్రజలకు భారీ ఊరట.. ఏపీ సర్కార్ ముందస్తు చర్యలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్ అభివృద్ది, సంక్షేమ పథకాలతో అద్భుతమైన పరిపాలన కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా విద్య, వైద్య, ఆరోగ్య, వ్యవసాయ, విద్యుత్ ఇలా అన్ని విషయాల్లోనూ ప్రజలకు మేలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రాభివృద్ది కోసం విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టేదిశగా అడుగులు వేస్తున్నారు.. ఇప్పటికే పలు కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఏపీలో ప్రతి ప్రాంతానికి నాణ్యమైన విద్యుత్ అందించాలనే ప్రభుత్వ లక్ష్యం అని పలు సందర్భాల్లో సీఎం జగన్ అన్నారు. ఇందుకోసం వర్చువల్ విధానంలో పలు జిల్లాల్లో సబ్ స్టేషన్లు ప్రారంభించారు. తాజాగా మరో రాష్ట్ర ప్రజలకు మరో తీపి కబురు అందించారు సీఎం జగన్. వివరాల్లోకి వెళితే..

ఏపీ ప్రజలకు భారీ ఊరట కలిగించే విషయం చెప్పారు సీఎం జగన్. రాబోయే రోజుల్లో ఎలాంటి కరెంట్ కోతలు లేకుండా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కృషి చేస్తున్నామని.. పలు ప్రాంతాల్లో సబ్ స్టేషన్ల ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నామని అన్నారు.. కరెంట్ విషయంలో ప్రతిపక్షాలు ప్రజల్లో అపోహలు కల్పిస్తున్నాయని.. తమ ప్రభుత్వం ప్రజలకు కరెంట్ విషయంలో ఎలాంటి కష్టలు లేకుండా చూసుకుంటుందని అన్నారు. ఇందుకోసం ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.  ఏపీలో విద్యుత్ చార్జీల పెంపు ఆలోచన లేదని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కౌన్సిల్ (ఏపీఈఆర్‌సీ) చైర్మన్ జస్టిస్ నాగార్జున రెడ్డి అన్నారు. విద్యుత్ వినియోగదారుల సమస్యలు, శాఖ పనితీరుపై మంగళవారం తిరుపతిలో రాష్ట్ర విద్యుత్ సలహా మండలి సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా జస్టిస్ నాగార్జున రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏ వర్గానికి సాధారణ విద్యుత్ చార్జీలు పెంచే ప్రసక్తే లేదన్నారు. కరెంట్ ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు.  కాకపోతే రాష్ట్రంలోనే రైల్వే శాఖకు సరఫరా చేసే విద్యుత్ చార్జీలను పెంచే ప్రతిపాదన ఉందన్నారు. దీనిపై ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని తెలిపారు. రాష్ట్ర విద్యుత్ శాఖలో రూ.3 వేల కోట్లతో అభివృద్ధి, విస్తరణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇక విద్యుత్ ఉత్పత్తి, సరఫరా వ్యవహారాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రతి జిల్లాలో జిల్లా విజిలెన్స్ అధికారులను నియమిస్తున్న విషయం తెలిసిందే. సబ్ స్టేషన్లలో ఓవర్‌లోడ్‌ను అధిగమించేందుకు చర్యలు వేగవంతం చేశామన్నారు. వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని వివరించారు. ఈ సమావేశంలో ఏపీఈఆర్సీ సభ్యులు ఠాకూర్ రాంసింగ్, పీవీఆర్ రెడ్డి, డిస్కమ్ అధికారులు పాల్గొన్నారు. మొత్తానికి విద్యుత్ చార్జీలు పెంచే యోచన లేకపోవడంతో రాష్ట్ర ప్రజలకు ఇది పెద్ద ఊరట కలిగించే విషయం అంటున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి