iDreamPost

దంపతుల దారుణం.. మా మీద మాకు అసహ్యం వేస్తుంది.. పిల్లలు జాగ్రత్త.. అంటూ

  • Published Dec 13, 2023 | 9:53 AMUpdated Dec 13, 2023 | 9:53 AM

మా మీద మాకు అసహ్యం పుట్టి చనిపోతున్నాం. పిల్లలు జాగ్రత్త అంటూ భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. వారు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే..

మా మీద మాకు అసహ్యం పుట్టి చనిపోతున్నాం. పిల్లలు జాగ్రత్త అంటూ భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. వారు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే..

  • Published Dec 13, 2023 | 9:53 AMUpdated Dec 13, 2023 | 9:53 AM
దంపతుల దారుణం.. మా మీద మాకు అసహ్యం వేస్తుంది.. పిల్లలు జాగ్రత్త.. అంటూ

నిండు నూరేళ్లు కలిసి జీవిస్తామని బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి ప్రమాణాలు చేసుకుని.. వివాహ బంధంలోకి ప్రవేశించారు. పెళ్లైన నాటి నుంచి సంతోషంగానే ఉన్నారు. వారి అన్యోన్యతకు గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. అయితే ఎంతో సంతోషంగా సాగిపోతున్న వారిని చూసి విధికి కన్ను కుట్టుంది. వారి పరిస్థితిని తలకిందులు చేసింది. బిడ్డలతో కలిసి నిండూ నూరేళ్లు సంతోషంగా బతకాల్సిన వాళ్లు.. కన్న ప్రేమను కూడా మర్చిపోయి దారుణ నిర్ణయం తీసుకున్నారు. ఆ దంపతులు చేసిన పనితో పిల్లలు తలీదండ్రలు లేని అనాథలుగా మారగా.. కన్న వారి కడుపు కోత గురించి వర్ణించడానికి మాటలు రావడం లేదు. మరి ఇందరిని బాధపెట్టేలా వారు అంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే..

దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన దారుణం..  పశ్చిమ గోదావరి జిల్లా, ముదినేపల్లి మండలం పెదగొన్నూరు శివారు విశ్వనాద్రిపాలెంలో మంగళవారం సాయంత్రం జరిగింది. అప్పులు యమపాశంగా మారి వారి జీవితాలను బలి తీసుకున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన పరసా మాతనాగబాబు(30)కు తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన అనూష(28)కు 2015లో వివాహం జరిగింది. వీరికి ఆరేళ్ల కుమారుడు, నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు. మరి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో పైకప్పుకు రెండు చీరలతో ఉరేసుకుని దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు.

ఈ క్రమంలో పక్క ఇంట్లోనే నివాసం ఉంటున్న నాగబాబు తల్లి వెంకటరమణ కూలిపనికి వెళ్లి వచ్చి.. మంగళవారం సాయంత్రం పని మీద కుమారుడి ఇంటికి వెళ్లి చూడగా భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకుని.. వేలాడుతూ కనిపించారు. వెంటనే తేరుకున్న ఆమె ఇరుగుపొరుగు వారి సాయంతో.. ఆసుపత్రికి తరలించడానికి యత్నించగా అప్పటికే వారు మృతి చెందారు. సాయంత్రం పిల్లలు పాఠశాలనుంచి వచ్చేసరికి వారికి విగతజీవులుగా పడి ఉన్న తల్లిదండ్రులు కనిపించారు. ఏం జరిగిందో అర్థం చేసుకున్నా ఆ చిన్నారులు.. అమానాన్న ఇక లేరని తెలిసి గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. వారిని ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు.

రొయ్యలసాగుతో నష్టాలు..

నాగబాబు గ్రామంలోనే రొయ్యలు సాగు చేశాడు. ఈ ఏడాది జూన్‌తో చెరువు లీజు పూర్తవగా సుమారు రూ.10 లక్షల మేర అప్పులపాలయ్యారు. దీంతో భార్య నగలు సైతం తాకట్టు పెట్టారు. తండ్రి కొంత అప్పు తీర్చినా మరికొంత మిగిలే ఉంది. రొయ్యల సాగుతో నష్టపోయిన నాగబాబు, దాన్ని వదిలేసి సింగరాయపాలెంలోని ప్రైవేటు పరిశ్రమలో ఎలక్ట్రికల్‌ విభాగంలో పనిచేస్తున్నాడు. మరో పక్క మూడు నెలల క్రితం భార్యతో ఇంటి వద్దే సోడా బండి పెట్టించారు. త్వరలోనే అప్పులన్ని తీరుతాయనే అనుకుంటుండగా.. ఇంత దారుణం చోటు చేసుకుంది అంటున్నారు నాగబాబు తల్లిదండ్రులు.

మా మీద మాకు అసహ్యం పుట్టి..

ఆత్మహత్య చేసుకోవడానికి ముందు వారు రాసిన లేఖ నాగబాబు దంపతుల గదిలో లభ్యమయ్యింది. దానిలో ‘అమ్మా, నాన్నా క్షమించండి, మాకు బతకడం ఇష్టం లేదు. అప్పు తీర్చాక చనిపోదాం అనుకున్నాం. మా మీద మాకు అసహ్యం పుట్టి చనిపోతున్నాం. పిల్లలు జాగ్రత్త. మా ఇద్దరి కిడ్నీలు ఎవరికైనా పనికొస్తే ఇవ్వండి. మేలు చేసినట్లు అవుతుంది’ అని లేఖలో రాశారు. అంతేకాక మా వల్ల ఎవరూ గొడవ పడకండి, మా అంతట మేమే చనిపోతున్నాం. ఎవరి మీదా కోపంతో ఈ పని చేయడం లేదని దానిలో వివరించారు. బంధువులకు ఇవ్వాల్సిన రూ.5 వేల బాకీ, బీరువాలో ఉన్న రూ.50 వేల సొమ్ము, మూడు నెలల్లో పూర్తవుతున్న బండి ఈఎంఐ, బ్యాంకు ఖాతాలో ఉన్న సొమ్ము తదితరాల గురించి ఆ లేఖలో పేర్కొన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి