iDreamPost

పదో తరగతి పరీక్షలు.. ఆ పని చేస్తే రూ.10 వేలు ఫైన్‌, 6 నెలలు జైలు!

  • Published Mar 15, 2024 | 2:33 PMUpdated Mar 15, 2024 | 2:33 PM

SSC Exams 2024: పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు కీలక సూచనలు జారీ చేశారు. ఆ పని చేస్తే రూ.10 వేలు ఫైన్‌, 6 నెలలు జైలు శిక్ష విధిస్తామని వెల్లడించారు. ఆ వివరాలు..

SSC Exams 2024: పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు కీలక సూచనలు జారీ చేశారు. ఆ పని చేస్తే రూ.10 వేలు ఫైన్‌, 6 నెలలు జైలు శిక్ష విధిస్తామని వెల్లడించారు. ఆ వివరాలు..

  • Published Mar 15, 2024 | 2:33 PMUpdated Mar 15, 2024 | 2:33 PM
పదో తరగతి పరీక్షలు.. ఆ పని చేస్తే రూ.10 వేలు ఫైన్‌, 6 నెలలు జైలు!

రెండు తెలుగు రాష్ట్రాల్లో పరీక్షల సీజన్‌ నడుస్తోంది. ఇప్పటికే ఇంటర్‌ ఎగ్జామ్స్‌ పూర్తి అయ్యాయి. ఇక త్వరలోనే పదో తరగతి పరీక్షలు మొదలు కాబోతున్నాయి. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా వీటిపై ఫోకస్‌పెట్టారు. ఇప్పటికే హాల్‌ టికెట్లు డౌన్‌ లోడ్‌ చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో డీఈఓ ఒకరు కీలక ఆదేశాలు జారీ చేశారు. పదో తరగతి పరీక్షలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. ప్రభుత్వం విధించిన నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ఆ వివరాలు..

పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విశాఖపట్నం డీఈవో చంద్రకళ మాట్లాడుతూ.. ఎగ్జామ్స్‌కు సంబంధించి కీలక ఆదేశాలు, సూచనలు జారీ చేశారు. పరీక్షలు రాయబోయే విద్యార్థులు ముందుగానే అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలని.. అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుని పరీక్ష కేంద్రాల వద్దకు రావాలని సూచించారు. ఈనెల 18 నుంచి 30 వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయి అన్నారు.

10th class exams

పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విశాఖ జిల్లాలో 138 కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. అన్ని సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. పదో తరగతి పరీక్ష రాసే విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని సూచించారు. ఇందుకోసం వారు ఆర్టీసీ బస్సు ఎక్కాక తమ హాల్ టికెట్ చూపించాలి అన్నారు. అర గంట గ్రీస్ పీరియడ్ ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ సారి పదో తరగతి పరీక్షల్లో పేపర్లు ఆరు నుంచి ఏడుకి పెరిగాయి. ప్రశ్న పత్రం మీద క్యు ఆర్ కోడ్ ముద్రించి వుంటుంది. అలానే పరీక్షా కేంద్రాల వద్ద నో మొబైల్ జోన్ ప్రకటించారు. పోలీసులు, ఏఎన్‌ఎంలు కూడా సెల్‌ ఫోన్లు వాడడం నిషేధం అన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే పది వేల రూపాయల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష వుంటుంది అని హెచ్చరించారు.

విద్యార్థులు ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని.. ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా పిల్లల మీద ఒత్తిడి పెట్టకుండా.. వారు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా చూడాలన్నారు. ఎగ్జామ్స్‌ను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు పోషకాహారం తీసుకోవాలని.. తగినంత నిద్ర పోవాలని సూచించారు. అలానే పరీక్షా కేంద్రాల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో ఎండ ఎక్కువగా ఉంటుందని.. అందుకోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి