iDreamPost

న్యాయస్థానానికి చంద్రబాబు అతీతం కాదు! నిరూపించిన జగన్!

  • Author singhj Published - 07:45 PM, Sun - 10 September 23
  • Author singhj Published - 07:45 PM, Sun - 10 September 23
న్యాయస్థానానికి చంద్రబాబు అతీతం కాదు! నిరూపించిన జగన్!

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్​మెంట్ స్కామ్ కేసులో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. రూ.371 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఏపీ సీఐడీ ప్రాథమిక ఆధారాలతో చంద్రబాబును అరెస్ట్ చేసింది. అరెస్ట్ అనంతరం చంద్రబాబును విజయవాడలోని ఏసీబీ కోర్టులో ఆదివారం ఉదయం ప్రవేశపెట్టారు. న్యాయస్థానంలో సీఐడీ తరఫు లాయర్లకు, చంద్రబాబు తరఫు లాయర్లకు మధ్య వాడీవేడీగా వాదనలు జరిగాయి. వాదనల తర్వాత ఈ కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

కోర్టులో వాదనల సమయంలో చంద్రబాబు న్యాయస్థానంలోనే ఉంటానని న్యాయమూర్తిని కోరారు. దీంతో కోర్టు హాల్​లోనే ఉంటారా? అని బాబును న్యాయమూర్తి అడిగారు. తనపై రాజకీయ కుట్ర నేపథ్యంలోనే అక్రమంగా కేసు పెట్టారని చంద్రబాబు వాదనలు వినిపించారు. టీడీపీ అధినేత వాదనలను న్యాయమూర్తి రికార్డు చేశారు. ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారాన్ని రాబట్టడం కోసం చంద్రబాబును 15 రోజుల కస్టడీకి కోర్టును కోరారు సీఐడీ పోలీసులు. గత రెండ్రోజులుగా జరుగుతున్న పరిణామాలతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

చంద్రబాబు గురించి అందరికీ తెలిసిందే. ఆయనది 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. మాజీ సీఎం ఎన్టీఆర్​ను పదవిచ్యుతుడ్ని చేసి తెలుగుదేశం పార్టీలో ఆయన ఏకఛత్రాధిపత్యాన్ని నడిపిస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన చెప్పిందే శాసనం అనేలా ఉండేది. పవర్​లో ఉన్నప్పుడు అన్ని వ్యవస్థలను తన గుప్పిట్లో ఉంచుకున్న బాబుపై గతంలోనూ పలు ఆరోపణలు వచ్చాయి. కొన్ని కేసుల్లోనైతే సుప్రీం కోర్టులోనూ మేనేజ్ చేసి.. కోర్టు మెట్లు ఎక్కకుండా తప్పించుకున్నారు బాబు.

అలాంటి చంద్రబాబు అరెస్ట్ దేశవ్యాప్తంగా రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఏనాడూ జైలుకు వెళ్లని బాబుకు ఏపీ స్కిల్ డెవలప్​మెంట్ స్కామ్​లో తొలిసారి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దీంతో ఎంత మేనేజ్ చేసినా చివరకు న్యాయమే గెలుస్తుందని నిరూపితమైంది. చంద్రబాబు అరెస్ట్​తో న్యాయస్థానానికి ఎవరూ అతీతం కాదని మరోసారు ప్రూవ్ చేశారు ఏపీ సీఎం జగన్. అలాగే నేరం చేసినవాళ్లు కోర్టుల్లో స్టే తెచ్చుకొని బతికిపోవడం సాధ్యం కాదని చేసి చూపించారు.

ఇదీ చదవండి: ట్రెండింగ్​లో ‘అవినీతి చక్రవర్తి బాబు’

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి