iDreamPost

YSR EMC: ఆంధ్రప్రదేశ్‌ తలరాతను మార్చేసే ప్రాజెక్ట్‌.. YSR EMC

  • Published Apr 03, 2024 | 11:09 AMUpdated Apr 03, 2024 | 11:09 AM

ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమం ఎలాగైతే పరుగులు పెడుతూ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందో.. అలాగే దీర్ఘకాల ప్రయోజనాలతో అభివృద్ధిపై కూడా సీఎం జగన్‌ అదే స్థాయిలో దృష్టి పెట్టారు. ఏపీకి తలమానికంగా నిలిచే వైఎస్సార్‌ ఈఏంసీ ప్రాజెక్ట్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమం ఎలాగైతే పరుగులు పెడుతూ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందో.. అలాగే దీర్ఘకాల ప్రయోజనాలతో అభివృద్ధిపై కూడా సీఎం జగన్‌ అదే స్థాయిలో దృష్టి పెట్టారు. ఏపీకి తలమానికంగా నిలిచే వైఎస్సార్‌ ఈఏంసీ ప్రాజెక్ట్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Apr 03, 2024 | 11:09 AMUpdated Apr 03, 2024 | 11:09 AM
YSR EMC: ఆంధ్రప్రదేశ్‌ తలరాతను మార్చేసే ప్రాజెక్ట్‌.. YSR EMC

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలనను సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే భారీ లక్ష్యంతో, ఏపీ తలరాతనే మార్చేసే ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశారు. ఆ ప్రాజెక్టే.. వైఎస్సార్‌ ఈఎంసీ(ఎలాక్ట్రానిక్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌). ఈ ప్రాజెక్ట్‌ను కడప జిల్లాలోని కొప్పర్తి గ్రామ సమీపంలో నిర్మిస్తున్నారు. 2020లో ఈ ప్రాజెక్ట్‌ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్‌.. ఏపీ యువతకు ఉద్యోగ కల్పన, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ లక్ష్యంగా ప్రాజెక్ట్‌పై ప్రత్యేక దృష్టి సారించి.. యుద్ధప్రాతిపదకన పనులు చేయించారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ఇప్పటికే పలు కంపెనీలకు ఈ క్లస్టర్‌లో స్థలం, ఫ్యాక్టరీలు కేటాయించి.. పనులు కూడా మొదలుపెట్టించారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కడపలో ఒక పెద్ద ఇండస్ట్రీయల్‌ ఏరియా ఏర్పాటు చేయాలని పలు ప్రణాళికలు రూపొందించారు. ఆయన కన్న కలను ఇప్పుడు ఆయన కుమారుడు సీఎం జగన్‌ పూర్తి చేస్తున్నారు.

తొలుత 540 ఎకారాల్లో ప్రారంభమైన ఈ ఈఎంసీ.. 801 ఎకరాలకు విస్తరించింది. ఏ ప్రాజెక్ట్‌కు అయినా మౌలిక వసతుల కల్పన ఎంతో ముఖ్యం. భూమి, నీరు, విద్యుత్‌ ఈ మూడు సమకూర్చితే.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడతాయి. ఈ పాయింట్‌ పట్టుకున్న సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.. ఏపీలో ఈ ఎలాక్ట్రానిక్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌కు భూమి కేటాయించి, నీటి సౌకార్యం కల్పించి, విద్యుత్‌ అందుబాటులో ఉంచి, రోడ్డు, రైలు, విమాన, సముద్ర మార్గాలకు కనెక్ట్‌ చేస్తూ ఈ ప్రాజెక్ట్‌ను అద్భుతంగా రూపొందించారు. ఈ ప్రాజెక్ట్‌కు నేషనల్‌ హైవే 67 కేవలం 5.7 కిలో మీటర్ల దూరంలోనే ఉంది. అలాగే.. కృష్ణాపురం రైల్వేస్టేషన్ 4.9 కి.మీ, కడప రైల్వే స్టేషన్-10.8 కి.మీల దూరంలో ఉన్నారు. ఈ ప్రాజెక్ట్‌ కడప పట్టణానికి 8 కిలో మీటర్ల దూరంలో, బెంగళూరుకు 264, చెన్నై​కి 271, హైదరాబాద్‌కు 416 కిలో మీటర్ల దూరంలోనే ఉంది.

కడప ఎయిర్‌ పోర్ట్‌, తిరుపతి, బెంగళూరు ఎయిర్‌పోర్టులు, కృష్ణపట్నం పోర్టుల, చెన్నై పోర్టుల, దుర్గరాజ పట్నం పోర్టులకు సమీపంలోనే ఉండటంతో రవాణా చాలా వేగంగా జరిగే అవకాశం ఉంది. ఈ క్లస్టర్‌లో ఎలక్ట్రానిక్ భాగాలు, మొబైల్ హ్యాండ్‌సెట్‌ల తయారీ, మొబైల్ సబ్ అసెంబుల్స్, కాంపోనెంట్స్, యాక్సెసరీస్, ఛార్జర్‌లు, బ్యాటరీలు, కెమెరాలు, దాని ఉపభాగాలు మొదలైనవి తయారు చేయనున్నారు. వీటితో పాటు బీఓఎస్‌తో ఇంటిగ్రేటెడ్ పీవీ సెల్స్, మాడ్యూల్స్, మెడికల్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు తయారు చేయనున్నారు. ఇప్పటికే డిక్సన్ వంటి కంపెనీలు ఇక్కడ ఉత్పత్తి ప్రారంభించాయి. అలాగే పలు అంతర్జాతీయ కంపెనీలకు కూడా ఇక్కడ స్థలం కేటాయించారు. మొత్తం 10 వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యం సీఎం జగన్‌ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే దాదాపు 30 వేల మంది ఏపీ యువతకు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఏపీలో ఒక అద్భుతమైన ఇండస్ట్రీయల్‌ హబ్‌ తయారు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఇక కమిట్‌మెంట్‌తో పనిచేస్తోంది అనేందుకు ఈ ప్రాజెక్ట్‌ మంచి ఉదాహరణ.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి