iDreamPost

AP హైకోర్టులో చంద్రబాబుకి చుక్కెదురు! క్వాష్ పిటిషన్ కొట్టివేత!

AP హైకోర్టులో చంద్రబాబుకి చుక్కెదురు! క్వాష్ పిటిషన్ కొట్టివేత!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి హైకోర్టులో ఊరట దక్కలేదు. ఎంతో ఆశగా వేసిన క్వాష్ పిటిషన్ విషయంలో చంద్రబాబుకు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన వేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. సీఐడీ తరపు న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన కోర్టు చంద్రబాబు క్యాష్ పిటిషన్ ను కొట్టేసింది. క్వాష్ పిటిషన్ ను ఏక వ్యాఖ్యంతో హైకోర్టు కొట్టేసింది. స్కీల్ డెవలప్మెంట్ స్కాం కేసులో ఇప్పటికే రిమాండ్ ఖైదీగా చంద్రబాబు ఉన్నారు. అయితే  ఈ కేసుతో తనకు సంబంధం లేదంటూ చంద్రబాబు తరపు న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షలా వాదనలు విన్న న్యాయస్థానం చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను కొట్టేసింది.

స్కిల్‌ డెవలప్‌మెంట్ కుంభకోణంలో అరెస్టైన చంద్రబాబు హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు. తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌, దాని ఆధారంగా ఏసీబీ కోర్టు జారీ చేసిన రిమాండ్‌ ఉత్తర్వులను సవాలు చేస్తూ చంద్రబాబు నాయుడు ఈ  క్వాష్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈనెల 19న ఈ పిటిషన్‌పై చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాదులు హరీశ్‌ సాల్వే, సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. శుక్రవారం తీర్పు వెలువరించింది. క్వాష్ పిటిషన్ ను కొట్టేస్తున్నట్లు హైకోర్టు ఏకవ్యాకంతో తీర్పు ఇచ్చింది. మరి.. చంద్రబాబు నాయుడి క్వాష్ పిటిషన్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి