iDreamPost

RTC ఉద్యోగులుకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్.. ఈ నెల నుంచి జీతంతో పాటు ఆ డబ్బులు కూడా

  • Published Feb 02, 2024 | 7:52 AMUpdated Feb 02, 2024 | 8:06 AM

APSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న పలు అంశాల అమలుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఆ వివరాలు..

APSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న పలు అంశాల అమలుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఆ వివరాలు..

  • Published Feb 02, 2024 | 7:52 AMUpdated Feb 02, 2024 | 8:06 AM
RTC ఉద్యోగులుకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్.. ఈ నెల నుంచి జీతంతో పాటు ఆ డబ్బులు కూడా

కేవలం ప్రజా సంక్షేమం మాత్రమే కాక.. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అంశాల్లో కూడా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.. ఆలోచన ఒకే విధంగా ఉంటుంది. వారికి లభించే సౌకర్యాలన్నింటిని కచ్చితంగా అమలు చేసినప్పుడే ఉద్యోగులు కూడా సరిగా పని చేస్తారని భావిస్తారు. వారు సంతృప్తిగా ఉన్నప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తారని నమ్ముతారు. అందుకే వారి సంక్షేమానికి కూడా అధిక ప్రధాన్యత ఇస్తారు. ప్రభుత్వం నుంచి వారికి అందాల్సిన వాటన్నింటిని కచ్చితంగా అమలు చేస్తారు. ఈ క్రమంలో తాజాగా జగన్‌ సర్కార్‌ ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న పలు అంశాల అమలుకు ప్రభుత్వం తాజాగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.  ఫిబ్రవరి నుంచి వాటిని కచ్చితంగా అమలు చేసేందుకు రెడీ అయ్యింది. ఆ వివరాలు..

ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. వారికి డే ఔట్‌, నైట్‌ ఔట్‌ భత్యాల (టీఏ) కింద రోజుకు రూ.150-400 చొప్పున ఈ నెల నుంచి అమలుచేసేందుకు రెడీ అయ్యింది. అంతేకాక ఈ మొత్తాన్ని.. మార్చి ఒకటో తేదీన ఇచ్చే జీతంలో కలిపి.. వారి అకౌంట్‌లో వేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల (ఈడీల) కమిటీ అంగీకరించినట్లు ఎన్‌ఎంయూఏ (నేషనల్‌ మజ్దూర్‌ యూనిటీ అసోసియేషన్‌) వెల్లడించింది. ఈడీల కమిటీతో ఈ సంఘం నేతలు రెండు రోజులపాటు జరిపిన చర్చల్లో వివిధ సమస్యల పరిష్కారానికి అధికారులు అంగీకారం తెలిపినట్లు వారు తెలియజేశారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

good news for tsrtc employees

ఆర్టీసీ ఉద్యోగుల ప్రమోషన్స్‌కు సంబంధించి కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వారు ఆర్టీసీ సంస్థలో ఉద్యోగాల్లో చేరినప్పుడు ఉండే విద్యార్హతల ఆధారంగా ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీమ్‌ (ఏఏఎస్‌) అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాక ఆర్టీసీ వైద్యుడితోపాటు ప్రభుత్వ వైద్యుడు ఇచ్చిన సిక్‌ లీవును కూడా పరిగణనలోకి తీసుకోవడానికి ఈ సందర్భంగా అంగీకరించారు.

తగిన విద్యార్హతలు లేని డ్రైవర్లను టిమ్‌ సర్వీసుల్లో విధులకు పంపబోమని తెలిపారు. అంతేకాక డ్రైవర్‌లకు యూనిఫామ్‌, సీట్‌ వంటి అన్ని భత్యాలూ ఇచ్చేందుకు అధికారులు అంగీకరించారు. అలానే అంతర్‌ జిల్లాల బదిలీలు చేపట్టేందుకు ఈడీల కమిటీ అంగీకరించినట్లు ఎన్‌ఎంయూఏ తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగన్‌ సర్కార్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి