iDreamPost

ఆ లెటర్ సంగతి తేల్చండి…!!

ఆ లెటర్ సంగతి తేల్చండి…!!

ఈసీ రాసిన లేఖ పై సీఎం జగన్ సీరియస్

డిజిపి, ఇంటలిజెన్స్ బాస్ తో భేటి…విచారణకు ఆదేశం

రాష్ట్రంలో ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్ కు , మొదలైన జగడం ముదురుపాకాన పడింది. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ రాశారో, లేదో రాసినట్లు చెబుతున్నారో కానీ ఓ లేఖ దుమారం లేపింది. తనకు ఆంధ్రప్రదేశ్ లో రక్షణ లేదని, కేంద్ర బలగాల రక్షణ కావాలని, ఏకగ్రీవం పేరిట అధికార పార్టీ పలు బెదిరింపులకు అక్రమాలకు దిగుతోందని చెబుతూ ఆయన కేంద్రానికి లేఖ రాసారంటూ తెలుగుదేశం అనుకూల మీడియా నేడు భారీగా కవరేజి ఇచ్చింది. అయితే ఈనాడు మాత్రం ఆ వార్త చివర్లో ఆ లేఖ తాను రాసినట్లు ఎన్నికల కమిషనర్ ధృవపర్చడం లేదని పేర్కొంది. దీంతో ఈ లేఖ మీద అనుమానాలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో వైసిపి అనుకూల నెటీజేన్లు రమేష్ కుమార్ ను టార్గెట్ చేశారు. ఈ తరుణంలో అసలు లేఖ ఆయన రాశారా లేదా లేకుంటే ఎవరు పుట్టించారు ..ఎవరి ప్రయోజనాలకోసం పుట్టించారు..దీని వెనుకనున్న కుట్రను ఛేదించాలని ముఖ్యమంత్రి. 

జగన్మోహన్ రెడ్డి డిజిపి గౌతమ్ సవాంగ్, ఇంటలిజెన్స్ డీజీ మనీష్ కుమార్ లతో చర్చించారు . ప్రభుత్వ ప్రతిష్టను, రాష్ట్ర ఇమేజిని దెబ్బతీసే లక్ష్యంతో సాగుతున్న ప్రచారం మూలాలు ఎక్కడున్నాయి వెలికితీసి వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సిందే అని జగన్ కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆ ఇద్దరితో సమావేశమై లేఖ వెనుక నున్న కథ,దాన్ని ఎవరు నడిపించారు, వారి ఉద్దేశాలు ఏమిటన్నవి వెలికి తీసే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇదిలా ఉండగా ఈ లేఖ ఆధారంగా నిన్న రోజంతా టిడిపి అనుకూల చానెళ్లు కథనాలు ప్రసారం చేసి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ అటు ఎన్నికల కమిషనర్ పట్ల సానుభూతి చూపించాయి…ఇప్పుడు పోలీసుల రంగ ప్రవేశంతో లేఖ వెనుకనున్న అసలు సూత్రధారులు ఎవరన్నది తేలుతుందని భావిస్తున్నారు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి