iDreamPost

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెడుతూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెడుతూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

ప్రభుత్వ పాఠశాలలో చదివే తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివించుకోవాలనే తల్లిదండ్రుల ఆకాంక్షను నెరవేరుస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజకీయ కారణాలతో ఆంగ్ల మాధ్యమమును ప్రభుత్వ బడులలో ప్రవేశపెట్టడంపై ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టించినా వాటిని ఎదుర్కొని పేద పిల్లలకు సంక్షేమానికి కట్టుబడి ఇంగ్లీష్ మీడియం అమలుపై కొద్దిసేపటి క్రితం కీలక ఉత్తర్వులు రాష్ట్ర విద్యాశాఖ జారీ చేసింది.

నూతన విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశ పెడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్:15, తేదీ:22.03.2020 జారీ చేసింది. ఈ ఉత్తర్వులలో రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలో 1 నుండి 6 తరగతుల వరకు ఆంగ్ల మాధ్యమమును ప్రవేశ పెడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.

గతంలో శాసనసభ ఆమోదించిన ఆంగ్ల మాధ్యమ బిల్లును శాసనమండలి వెనుకకు తిప్పి పంపిన సంగతి తెలిసిందే.రాష్ట్ర హైకోర్టులో ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరగాలని ఇంగ్లీష్ మీడియంలో బోధన చేయడం విద్యా హక్కు చట్టం-2009కి విరుద్ధమని కొందరు పిటిషన్లు దాఖలు చేశారు.అయితే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం విద్యార్థులకు నచ్చిన మాధ్యమములో చదువుకునే హక్కు ఉందని పేర్కొంది. కానీ ఇంగ్లీష్ మీడియంలో నిర్బంధ బోధన చెయ్యకూడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో జీవో నెంబర్:85, తేదీ:29.11.2019 కు సవరణ చేసిన ఉత్తర్వుల ప్రకారం ప్రతి మండల కేంద్రంలో ఒక తెలుగు మీడియం పాఠశాలను కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

తెలుగు మీడియంలో చదువుకోవాలనే పిల్లల కోసం మండల స్థాయిలో ఒక పాఠశాలను ఏర్పాటు చేసి, ఆ స్కూలుకు వెళ్లే విద్యార్థులకు రవాణా ఖర్చులు ప్రభుత్వం చెల్లించానుంది.ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ఉర్దూ,ఒరియా,కన్నడ,తమిళ మీడియం పాఠశాలలు యధావిధిగా పనిచేస్తాయని రాష్ట్ర ప్రభుత్వం జీవోలో పేర్కొంది.ప్రతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లోనూ తెలుగు బోధనను తప్పనిసరిగా చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి