iDreamPost

TDPకి మాజీ మంత్రి రాజీనామా.. కష్టపడితే అవమానించారని ఆవేదన!

TDP: ఇటీవలే టీడీపీ, జనసేన పార్టీలు తమ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలకు వారి నేతలు గట్టి షాకులు ఇస్తున్నారు. తాజాగా టీడీపీకి ఓ మాజీ మంత్రి రాజీనామా చేశారు.

TDP: ఇటీవలే టీడీపీ, జనసేన పార్టీలు తమ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలకు వారి నేతలు గట్టి షాకులు ఇస్తున్నారు. తాజాగా టీడీపీకి ఓ మాజీ మంత్రి రాజీనామా చేశారు.

TDPకి మాజీ మంత్రి రాజీనామా.. కష్టపడితే అవమానించారని ఆవేదన!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా హీట్ మీద ఉన్నాయి. అలాగే జంపింగ్ ల పర్వం కూడా మొదలైంది. ఎవరు, ఏ పార్టీలోకి ఎప్పుడు దూకేస్తారో చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా ఇప్పటి వరకు వైసీపీలో ఉన్న చిన్న చిన్న అసంతృప్తులను భూతద్దంలో చూపించింది ఎల్లో మీడియా. అయితే తాజాగా జనసేన, టీడీపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితా తరువాత ఆ పార్టీలో అసలు అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజవర్గాల్లో అసంతృప్తు జ్వాలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఈ క్రమంలోనే పలువురు నేతలు జనసేన, టీడీపీలకు రాజీనామా చేస్తుడంగా, మరికొందరు ఆ బాటలోనే వెళ్లేందుకు సిద్ధమయ్యారు. తాజాగా టీడీపీ ఓ మాజీ మంత్రి రాజీనామా చేసి.. భారీ షాకిచ్చారు. కష్టపడితే అవమానించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటీవలే టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ లిస్టు రాకముందే పలువురు టీడీపీ నేతలు చంద్రబాబు తీరు నచ్చక  ఆ పార్టీని వీడిన సంగతి తెలిసిందే. విజయవాడ ఎంపీ కేశినేని నాని, తిరువూరు టీడీపీ ఇన్ ఛార్జీ స్వామిదాస్, నూజివీడు టీడీపీ నేత ముద్దబోయిన వెంకటేశ్వరావులు ఆ పార్టీ రాజీనామా చేశారు. తాజాగా ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించిన తరువాత అసంతృప్తుల సంఖ్య బాగా పెరిగింది. ముఖ్యంగా ఎంతో కాల పార్టీ కోసం పని చేసిన తమను కాదని వేరే వారికి టికెట్లు ఇవ్వడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పెనుగొండ, తంబాళపల్లె, రైల్వేకోడురు, పిఠాపురం వంటి అనేక ప్రాంతాల్లో టీడీపీలో అసంతృప్త జ్వాలు ఉవ్వెత్తున్న ఎగసి పడుతున్నాయి. కొన్ని చోట్ల చంద్రబాబు ప్లెక్సీలను సైతం చించేస్తున్నారు. ఇప్పటికే తమకు టికెట్ దక్కని కొందరు నేతలు, తొలి జాబితలో తమ పేరు లేని మరికొందరు నేతలు అవమానంతో ఆగ్రహంగా ఉన్నారు. టీడీపీకి రాజీనామా చేసే దిశగా వారు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే టీడీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకీ మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు రాజీనామా చేశారు. తాను పార్టీ వీడటానికి గల కారణాలను, తన బాధను వ్యక్తం చేశారు. తన ఆత్మగౌరవాన్ని చంద్రబాబు దెబ్బతీసినందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు గొల్లపల్లి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు.

కష్టకాలంలో పార్టీ కోసం తాను ఎంతగానో పనిచేశానని లేఖలో గొల్లపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. రాజోలులో సీటు ఇవ్వకుండా అవమానించారని ఆయన పేర్కొన్నారు. ఇటీవల టీడీపీ, జనసేన ప్రకటించిన ఉమ్మడి శాసనసభ అభ్యర్థుల జాబితాలో గొల్లపల్లి పేరు లేకపోవడంతో ఆయన తీవ్రంగా కలత చెందారు. పొత్తులో భాగంగా రాజోలు సీటును జనసేనకు టీడీపీ కేటాయించిన సంగతి తెలిసిందే. దీంతో ఇక టికెట్‌ రాదని గొల్లపల్లి సూర్యారావు టీడీపీపని వీడినట్లు తెలుస్తోంది. కాగా, భవిష్యత్‌ కార్యాచరణపై ఆయన త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అధికార వైస్సార్ సీపీ  ఏడు విడతల్లో అభ్యర్థులను ప్రకటించినా టీడీపీ, జనసేన ఉమ్మడి జాబితా ప్రకటన తరువాత వచ్చిన స్థాయిలో అంసతృప్తది సెగలు రాలేదు. మరి..రానున్న రోజుల్లో మరెంత మంది టీడీపీ వీడే అవకాశం ఉందో చూడలి. మరి..టీడీపీకి మాజీ మంత్రి రాజీనామా చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి