iDreamPost

వ్యవసాయం, ధాన్యం సేకరణపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష

వ్యవసాయం, ధాన్యం సేకరణపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష

వ్యవసాయం, ధాన్యం సేకరణపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి మంత్రులు కాకాణి గోవర్థన్‌రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఎంఎస్‌పీ కన్నా తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వచ్చిందనే మాట ఎక్కడా రాకూడదని, దీన్ని అధికారులు సవాల్‌గా తీసుకోవాలన్నారు.”ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్ర తీసివేస్తున్నాం. రైతులకు గరిష్ట ప్రయోజనాలు అందించేలా ధాన్యం సేకరణ కొనసాగాలి. ఇ-క్రాపింగ్‌ డేటాను వాడుకుని అత్యంత పటిష్ట విధానంలో సేకరణ కొనసాగాలి.

వ్యవసాయ శాఖతో పౌరసరఫాల శాఖ అనుసంధానమై రైతులకు మంచి జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలి. రబీకి అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని అధికారులకు సీఎం ఆదేశించారు.

ఎరువులు, విత్తనాలు, ఇలా అన్నిరకాలుగా రైతులకు కావాల్సివన్నీ సిద్ధం చేసుకోవాలన్న సీఎం.. ప్రతి ఆర్బీకేలో ఒక డ్రోన్‌ను ఉంచేలా కార్యాచరణ సిద్ధంచేయాలన్నారు. వచ్చే రెండేళ్లలో అన్ని ఆర్బీకేల్లోనూ డ్రోన్స్ ఉండేలా చూడాలని సీఎం అన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి