iDreamPost

దేశానికి ఆదర్శంగా :- నాడు 108 – నేడు టెలీ మెడిసిన్

దేశానికి ఆదర్శంగా :- నాడు 108 – నేడు టెలీ మెడిసిన్

మేమంతా యువకులం మీకన్నా బాగానే పాలన చేయగలం అని జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పలికిన మాటలు ఇప్పుడు అధికారంలోకి రాగానే నిజం చేస్తున్నారు. ఇప్పటికే దేశంలో ఏ రాష్ట్రం లో కూడా చేపట్టని సంక్షేమ పదకాలు జగన్ గెలిచిన ఏడాదిలోనే ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశ పెట్టి పాలనలో తాను ఎంత సమర్ధుడినో నిరూపించుకున్నారు. అనుభవం లేని జగన్ లోటు బడ్జట్ లో ఉన్న రాష్ట్రాన్ని ఎలా నడిపించగలుగుతారు అని అనుమాన పడ్డ వారికి సైతం నేడు ముఖ్యమంత్రిగా జగన్ పరిపాలన చూసి వారికి ఒక నిర్ధిష్ట అవగాహన వచ్చి ఉంటుంది.

ఎప్పుడైతే ఒక వ్యక్తి సంక్షోభ సమయాన్ని సమర్ధవంతంగా ఎదుర్కుంటాడో అప్పుడే అతనిలోని పరిపాలనాదక్షత బయటపడుతుంది అని చెబుతారు. ముఖ్యమంత్రి జగన్ ఈ మాటను నిజం చేస్తు ఇప్పటికే కరోనా మహమ్మారిని ఎదుర్కునే విషయంలో దేశానికే ఆదర్శంగా నిలిచారు. కరోనాను గుర్తించడంలో అలాగే కరోన మహమ్మారిని ఎదుర్కుంటూనే కుదేలవుతున్న దేశ ఆర్ధికస్థితిని తిరిగి ఎలా గాడిలో పెట్టాలో ప్రధాని తో సాగిన టెలీ కాన్ఫరెన్స్ లో తన ఆలోచనలను పంచుకున్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్ సూచించిన విధంగానే ప్రధాని మోడి సైతం దేశాన్ని జోన్ల వారిగా విభజించి కరోనా ని ఎదుర్కునే ప్రయత్నం చేసి సత్ఫలితాలను సాదించారు.

ఇక జగన్ రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన పధకాలు , చట్టాలు కూడా దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇప్పటికే దిశ చట్టం, వాలంటీర్ల వ్యవస్థలు పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవగా ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి జగన్ ప్రవేశ పెట్టిన టెలీ మెడిసిన్ వ్యవస్థ కూడా ఆ జాబితాలోకి చేరింది. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి బెంగుళూరు లోని రాజీవ్ గాంధీ యునివర్సిటి ఆఫ్ హెల్త్ సైన్సెస్ 25వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వీడియో సందేశం ఇస్తూ ఆరోగ్య రంగంలో మేకిన్ ఇండియా పరికరాలు తో పాటు టెలీ మెడిసిన్ వ్యవస్థకి కూడా పూర్తి స్థాయిలో ప్రాచుర్యం కలిగించాలని దీని కోసం నూతన విధానాలను రూపొందించాల్సి ఉందని చెప్పుకొచ్చారు.

గతంలో దివంగత ముఖ్యమంత్రి వై.యస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశ పెట్టిన 108 అంబులెన్స్ సేవలును ఎలా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచి ఆయా రాష్ట్రాల్లో ప్రజల ప్రాణాలకి రక్షణ కవచం లా నిలిచాయో నేడు ముఖ్యమంత్రి స్థానంలో జగన్ ప్రవేశ పెట్టిన టెలీ మెడిసిన్ సేవలు సైతం రాబోయే రోజుల్లో దేశ వ్యాప్తంగా అమలు లోకి వచ్చి ప్రజల ఆరోగ్యానికి భరోసా గా నిలవబోతున్నాయి అని చెప్పడం లో సందేహం లేదు. ఏది ఏమైనా జగన్ ప్రవేశ పెట్టిన చట్టాలు, సంక్షేమ పధకాలు దేశానికి ఆదర్శంగా నిలవడం మన రాష్ట్రానికే గర్వకారణం అని చెప్పవచ్చు .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి