iDreamPost

గ్రామ స్వరాజ్య స్థాపనలో దేశం కన్నా నాలుగడుగుల ముందంజలో జగన్ .

గ్రామ స్వరాజ్య స్థాపనలో దేశం కన్నా నాలుగడుగుల ముందంజలో జగన్ .

రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ గ్రామాలు ఎలా ఉండాలి అన్న అంశం పై తన కలని ఆవిష్కరించిన జగన్ .

త్వరలో అన్ని గ్రామాల్లో వైఎస్సార్ విలేజ్ క్లినిక్ , వైఎస్సార్ జనతా బజార్ లు కూడా ఏర్పాటు చేయనున్న వైసీపీ ప్రభుత్వం .

ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగా విలేజ్ వలంటీర్ , గ్రామ సచివాలయ వ్యవస్థలను ఏర్పాటు చేసే క్రమంలో విపక్షాలు పలు విధాల అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆరోపణలు చేసినా పట్టించుకోకుండా 1.3 లక్షల మందికి సచివాలయాల్లో , 2.7 లక్షల మందికి వలంటీర్స్ గా ఉద్యోగాలు కల్పించి పలు సంక్షేమ , అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ ఈ వ్యవస్థల ద్వారా సులభతరం చేయడమే కాకుండా , కరోనా వైరస్ కట్టడి చర్యల్లో విలేజ్ వలంటీర్ల అసమాన సేవలతో దేశ విదేశాల్లో ప్రశంసలు పొందిన విషయం విదితమే .

అంతేకాక నాడు నేడు పధకం ద్వారా స్కూల్స్ లో వసతి సౌకర్యాల మెరుగుదల కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా , ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టేందుకు కృషి చేస్తూ మరోవైపు రైతులకు కావాల్సిన విత్తనాలు , ఎరువులు , పురుగు మందులు , వ్యవసాయ పరికరాలు గ్రామంలోనే కల్తీ రహితంగా టెస్ట్ చేసి అధిక ధరల బారిన పడకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరకు రైతులకు అందించే సంకల్పంతో ప్రతి గ్రామానికి ఒకటి చొప్పున 10641 రైతు భరోసా కేంద్రాలు ఈ నెల 30 న ప్రారంభించనున్నారు .

ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ రోజు యాడాది పాలన పై సమీక్ష , సలహా సూచనల కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ త్వరలో సచివాలయాలకు అనుబంధంగా విలేజ్ క్లినిక్ లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు . అలాగే వచ్చే యాడాది చివరికి ప్రతి గ్రామంలో వైఎస్సార్ జనతా బజార్ లు ఏర్పాటు చేస్తామని దాని ద్వారా వ్యవసాయ ఉత్పత్తులతో పాటు డైరీ , పౌల్ట్రీ , ఆక్వా లాంటి అన్ని రకాల వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తులను కూడా రాష్ట్ర సగటు ఉత్పత్తిలో కనీసం ముప్పై శాతం ఈ జనతా బజార్ల ద్వారా గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు .

2000 మంది ఉండే ఒక గ్రామంలో అడుగు పెడితే నాలుగడుగులు వేయగానే విలేజ్ సెక్రటరియేట్ , దగ్గర్లోనే రైతు భరోసా కేంద్రం , మరికొంత దూరం వెళితే , ఇంగ్లీష్ మీడియం స్కూల్ , తర్వాత కొంత దూరానికి విలేజ్ క్లినిక్ , ఆ పక్కనే వైఎస్సార్ జనతా బజార్ లాంటివి గ్రామ ప్రజలకు సేవలందిస్తే చూట్టానికి ఆ దృశ్యం ఎలా ఉంటుందో ఊహించండి అంటూ రాబోయే కాలంలో గ్రామసీమలు ఎలా ఉండాలి అనేదాని పట్ల తన అద్భుత కలని ఆవిష్కరించారు జగన్ .

ఇప్పటివరకూ చెప్పిన ప్రతి హామీని చిత్తశుద్దితో అమలు చేస్తున్న జగన్ ఇవి కూడా అదే చిత్తశుద్ధితో అమలు చేస్తే గ్రామాల రూపురేఖలు మారిపోవడమే కాకుండా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం దేశంలో మొదటిగా ఆంధ్రప్రదేశ్ లో ఆవిష్కృతమవ్వడమే కాకుండా ప్రపంచానికి సరికొత్త దారులు చూపిన ఒక దార్శనికుడిగా జగన్ గుర్తింపు తెచ్చుకొంటాడనడంలో సందేహం లేదు .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి