iDreamPost

చిత్తూరు బరిలో నాగబాబు.. అసలేం జరుగుతోందంటూ టీడీపీలో అయోమయం

  • Published Nov 05, 2023 | 4:31 PMUpdated Nov 05, 2023 | 4:31 PM

పొత్తుల గురించి ప్రకటన వెలువడి నాటి నుంచి ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాకే టికెట్‌ అంటే మాకే అని ఇరు పార్టీల నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అనూహ్యంగా నాగబాబు చిత్తూరు నుంచి పోటీ చేస్తారనే టాక్‌ వినిపిస్తోంది. ఆ వివరాలు..

పొత్తుల గురించి ప్రకటన వెలువడి నాటి నుంచి ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాకే టికెట్‌ అంటే మాకే అని ఇరు పార్టీల నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అనూహ్యంగా నాగబాబు చిత్తూరు నుంచి పోటీ చేస్తారనే టాక్‌ వినిపిస్తోంది. ఆ వివరాలు..

  • Published Nov 05, 2023 | 4:31 PMUpdated Nov 05, 2023 | 4:31 PM
చిత్తూరు బరిలో నాగబాబు.. అసలేం జరుగుతోందంటూ టీడీపీలో అయోమయం

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో.. రాజకీయ వాతావరణం హీటెక్కింది. పార్టీలన్ని ఎన్నికల కోసం ఇప్పటి నుంచే రంగంలోకి. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. త్వరలోనే ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే దాని గురించి ఓ క్లారిటీ రానుంది. సీట్ల సంగతి ఏమో కానీ.. పొత్తు ప్రకటన వెలువడి నాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో పరిస్థితిలు తారుమారవుతున్నాయని తెలుస్తోంది. ఏ పార్టీ ఎక్కడ నుంచి పోటీ చేస్తుంది అనే దాని మీద క్లారిటీ లేకపోయినా.. పొత్తు ప్రకటన తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం టీడీపీ, జనసేన నేతల మధ్య విభేదాలు వెలుగు చూస్తున్నాయట.

కొన్ని జిల్లాల్లో అయితే ఇరు పార్టీల నేతలు.. ఎవరికి వారే సీట్లు ప్రకటించుకుంటున్నారట. ఈ క్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పోటీ చేయబోయే అభ్యర్థుల గురించి ఆస​క్తికర వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. నాగబాబు చిత్తూరు నుంచి పోటీ చేయబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ వివరాలు..

చిత్తూరు జిల్లాలో టీడీపీ, జనసేన మధ్య సీట్ల పంపిణీ వ్యవహారం వివాదం రాజేస్తుంది. ఈ జిల్లాలో ప్రజాబలం లేకపోవడం, అభ్యర్థుల కొరత రెండు పార్టీలను పీడిస్తోందట. టీడీపీ-జనసేన మధ్య పొత్తు ఉంటుందని ప్రకటన వెలువడిన నేపథ్యంలో.. ఇరు పార్టీల నేతలు ఎవరికి వారే.. తామే పోటీ చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలో తిరుపతి నుంచి జనసేన అభ్యర్థి తామేనంటూ హరి ప్రసాద్‌, కిరణ్‌ రాయల్‌ ప్రకటించుకున్నారు. మరోవైపు టీడీపీ నేతలు చిత్తూరులో తామే పోటీ చేయబోతున్నామంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతల మధ్య విబేధాలు మొదలయ్యాని అంటున్నారు నియోజకవర్గ ప్రజలు.

ఈ క్రమంలో విభేదాలను పరిష్కరించడం కోసం ఓ ప్రతిపాదన తీసుకు వచ్చారట. దీనిలో భాగంగా పవన్‌ లేదా నాగబాబు ఇక్కడ నుంచి పోటీ చేస్తే.. తాము టికెట్‌ త్యాగం చేస్తామని టీడీపీ నేతలు కొందరు చేబుతున్నారట. అయితే ఈ ప్రతిపాదనను కొందరు టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా మాజీ చైర్మన్‌ నరసింహయాదవ్‌ మాత్రం ఈ ప్రతిపాదనకు అంగీకరించడం లేదని తెలుస్తోంది.

ఇన్నాళ్లు పార్టీని నమ్ముకుని.. కష్టపడుతున్న తమను కాదని.. పొత్తంటూ వచ్చిన జనసేనకు టికెట్‌ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారట. జనసేనకు టికెట్‌ ఇస్తే అంగీకరించబోమని స్పష్టం చేశారు. మరి ముందు ముందు ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో చూడాలి అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి