iDreamPost

పెగాసస్‌ పై భిన్నవాదనలు.. బాబును గోరంట్ల బుక్‌ చేస్తున్నారా..?

పెగాసస్‌ పై భిన్నవాదనలు.. బాబును గోరంట్ల బుక్‌ చేస్తున్నారా..?

పెగాసస్‌ స్పైవేర్‌ కొనుగోలు అంశంపై ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ దద్దరిల్లింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పెగాసస్‌ స్పైవేర్‌ను కొనుగోలు చేశారని ఇటీవల పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించడంతో ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. అధికార వైసీపీ, టీడీపీల మధ్య వాడివేడిగా మాటల తూటాలు పేలుతున్నాయి. తమపై నిఘా పెట్టారని, తమ ఫోన్లను ట్యాప్‌ చేస్తున్నారంటూ ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ ఫిర్యాదులు చేసింది. ఇప్పుడు స్వయంగా పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతనే.. బాబు బండారం బయటపెట్టడంతో నాడు వైసీపీ నేతలు చేసిన ఫిర్యాదులు వాస్తవమని తేలిపోయింది.

ఈ అంశంపై ఈ రోజు అసెంబ్లీలో చర్చ జరిగింది. అయితే ఈ చర్చను అడ్డుకునేందుకు టీడీపీ సభ్యులు యత్నించారు. పెగాసస్‌ పై చర్చ జరిగితే తమ అధినేత చంద్రబాబుకు ఎక్కడ చిక్కులు వస్తాయోనన్న ఆందోళనతో టీడీపీ ఎమ్మెల్యేలు ఎప్పటిమాదిరిగానే సభను అడ్డుకున్నారు. వారించినా వినకపోవడంతో వారిని స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు. సభలో ఉండి, చర్చలో పాల్గొంటే పెగాసస్‌పై సమాధానం చెప్పాల్సి వస్తుందనే భయంతోనే టీడీపీ సభ్యులు సస్పెండ్‌ అవడం ద్వారా బయటకు వెళ్లాలనే ఎత్తుగడ వేసినట్లు అధికార పార్టీ సభ్యులు విమర్శలు చేస్తున్నారు.

అసెంబ్లీలో జరిగిన చర్చలో పాల్గొనకుండా సస్పెండ్‌ అయి బయటకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు.. మీడియా ముందు చంద్రబాబును సమర్థించేందుకు, పెగాసస్‌ స్పైవేర్‌ను తమ ప్రభుత్వ హయాంలో కొనుగోలు చేయలేదని చెప్పేందుకు నానా తంటాలు పడ్డారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు పొంతనలేని వ్యాఖ్యలు చేస్తూ చంద్రబాబును అడ్డంగా బుక్‌ చేస్తున్నారు. పెగాసస్‌ను చంద్రబాబు కొనుగోలు చేయించారని మమతా బెనర్జీ చేత చెప్పించారంటూ టీడీపీ ఏపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అచ్చెం నాయుడు పొంతనలేని వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ చేత మమత ద్వారా తమ పార్టీ అధినేత పేరు చెప్పించారని అచ్చెం నాయుడు అనడం విడ్డూరంగా ఉంది. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, జాతీయ స్థాయిలో పేరున్న మమతా బెనర్జీ.. అకారణంగా, వాస్తవ విరుద్ధంగా చంద్రబాబుపై ఆరోపణలు చేయాల్సిన అవసరం ఏముంటుందనే ప్రాథమిక ప్రశ్న సామాన్యుల్లో వస్తుందనే విషయాన్ని మరచిన అచ్చెం నాయుడు తమ అధ్యక్షుడిని వెనకేసుకొచ్చేందుకు తంటాలు పడ్డారు.

ఇక టీడీపీ సీనియర్‌నేత, టీడీపీ శాసనసభపక్ష ఉప నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా బాబును వెనకేసుకొచ్చే క్రమంలో అచ్చెం నాయుడుచేసిన వ్యాఖ్యలకు భిన్నంగా స్పందించారు. అధికారులను చెప్పుచేతల్లో పెట్టుకుని పెగాసస్‌ వ్యవహారాన్ని తమ పార్టీ అధినేత చంద్రబాబు మెడకు చుట్టాలని వైసీపీ ప్రయత్నిస్తోందంటూ ఆరోపణలు చేశారు. పెగాసస్‌ వ్యవహారాన్ని బయటపెట్టిన వ్యక్తి మమతా బెనర్జీ కాగా.. బుచ్చయ్య చౌదరి అధికారులను, వైసీపీ ప్రభుత్వాన్ని నిందించడం గమనార్హం. పెగాసస్‌ స్పైవేర్‌ను కొనుగోలు చేయాలని చంద్రబాబు తనకు సూచించగా.. అది సరైన విధానం కాదని తిరస్కరించానని, చంద్రబాబు మాత్రం కొనుగోలు చేశారని మమతా బెనర్జీ స్పష్టంగా చెప్పారు. అసలు విషయం బయటపెట్టిన మమతా బెనర్జీపై ఎలాంటి వ్యాఖ్యలు చేయని టీడీపీ నేతలు.. వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తుండడంతో అసలు బండారం బయటపడుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి