iDreamPost

సంక్షేమం – సమర్ధ పాలన – చట్టాలు

సంక్షేమం – సమర్ధ పాలన – చట్టాలు

ప్రజా సంక్షేమం, సమర్ధ పాలనే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్లోని జగన్ సర్కార్ పని చేస్తోంది. అందుకు అనుగుణంగా చట్టాలు చేస్తోంది. తాజాగా అసెంబ్లీ సోమవారం పలు చారిత్రక ఘట్టాలకు వేదికైంది,16 బిల్లులకు ఆమోదం తెలిపింది.

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం బోధన, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకోవడం, మద్యం అక్రమాల్ని అరికట్టడం, ఎస్సీ, ఎస్టీలకు కమిషన్ల ఏర్పాటు వంటి 16 చారిత్రాత్మక బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి బడ్జెట్‌ సమావేశాల్లోనే 19 విప్లవాత్మక బిల్లులను శాసనసభ ఆమోదించింది దీనిద్వారా రికార్డు సృష్టించింది.

ఏపీ ఎడ్యుకేషన్‌ యాక్ట్‌–1982 సవరణ బిల్లుద్వారా వచ్చే విద్యా సంవత్సరం ఒకటి నుంచి ఆరో తరగతి వరకు లక్షలమంది విద్యార్థులకు ఇంగ్లిష్‌ మీడియంలో పాఠ్యాంశాలను బోధించడానికి బాటలు వేసింది. తర్వాత వరుస సంవత్సరాల్లో పదో తరగతివరకూ ఇంగ్లిష్‌ మీడియంలో పాఠ్యాంశాలను బోధించడం ద్వారా మధ్య తరగతి, పేద వర్గాలకు చెందిన లక్షలమంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ఈబిల్లు పనిచేస్తుంది.

ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకునే బిల్లును ఆమోదించడం ద్వారా 51,488 మంది కార్మికుల స్వప్నం సాకారమవుతుంది. ఎస్సీ వర్గాల ప్రజల ప్రయోజనాలను సమర్థవంతంగా పరిరక్షించడం కోసం ఎస్సీ కమిషన్, ఎస్టీ వర్గాల ప్రజల హక్కులను పరిరక్షించడంతోపాటు వారికి మరింతగా ప్రయోజనం చేకూర్చడం కోసం ఎస్టీ కమిషన్‌ ఏర్పాటుకు వీలుగా శాసనసభ బిల్లులను ఆమోదించింది. చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు సాగు చేసే రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం.. ధరలు పెరగకుండా నియంత్రించడంతో ప్రజలందరికీ వాటిని అందుబాటులో ఉంచడం ద్వారా పౌష్టికాహారాన్ని అందించడం కోసం చిరుధాన్యాలు, పప్పుధాన్యాల బోర్డుల ఏర్పాటు చేయడానికి వీలుగా వేర్వేరు బిల్లులను ఆమోదించింది.

1. బిల్లు: ప్రభుత్వ సర్వీసుల్లోకి ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు
లక్ష్యం : ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు దశాబ్దాల స్వప్నాన్ని సాకారం చేయడం.. ఆ సంస్థ ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకునేలా ప్రత్యేకంగా ప్రజా రవాణా విభాగాన్ని ఏర్పాటు చేయడం.

2. బిల్లు : ఏపీ ఎడ్యుకేషన్‌ యాక్ట్‌–1982 సవరణ
లక్ష్యం : ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంలో విద్యార్థులకు భోదన. అన్ని తరగతుల్లోనూ తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేయడం.

3. బిల్లు : ఎస్సీ కమిషన్‌
లక్ష్యం : ఎస్సీ వర్గాల ప్రజల ప్రయోజనాలను పరిరక్షించడం.

4. బిల్లు : ఎస్టీ కమిషన్‌
లక్ష్యం : ఎస్టీ వర్గాల ప్రజల ప్రయోజనాలను పరిరక్షించడం.

5. బిల్లు : చిరుధాన్యాల(మిల్లెట్స్‌) బోర్డు ఏర్పాటు
లక్ష్యం : చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడం.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం. ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చి పౌష్టికాహారాన్ని అందించడం.

6. బిల్లు: పప్పుధాన్యాల(పల్సస్‌) బోర్డు ఏర్పాటు
లక్ష్యం : పప్పుధాన్యాల సాగును ప్రోత్సహించడం. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం. ధరలు పెరగడకుండా నియంత్రించడం. ప్రజలందరికీ అందుబాటులోకి తేవడం. పౌష్టికాహారాన్ని అందించడం.

7. బిల్లు: ఆంధ్రప్రదేశ్‌ మద్యనిషేధ చట్టం–1995కు సవరణ
లక్ష్యం : అక్రమ మద్యం తయారీ, రవాణా, విక్రయాలకు అడ్డుకట్ట వేయడం. అతిక్రమించిన వారికి తొలిసారి రూ.రెండు లక్షల జరిమానా, రెండోసారి నేరానికి పాల్పడితే రూ.5 లక్షల జరిమానా.

8. బిల్లు: ఆంధ్రప్రదేశ్‌ ఆబ్కారీ చట్టం–1968కు సవరణ
లక్ష్యం : బార్‌లలో అక్రమ, సుంకం చెల్లించని మద్యం విక్రయం. సరిహద్దుల నుంచి అక్రమ రవాణా లాంటి నేరాలకు తొలిసారి పాల్పడితే హెచ్చరికతోపాటు లైసెన్స్‌ ఫీజుకు రెండు రెట్లు జరిమానా విధింపు. రెండోసారి పాల్పడితే బార్‌ లైసెన్స్‌ రద్దు, నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు.

9. బిల్లు: కర్నూలులో క్లస్టర్‌ యునివర్సిటీ ఏర్పాటు
లక్ష్యం : కర్నూలులో సిల్వర్‌ జూబ్లీ కాలేజీ, కేవీఆర్‌ ప్రభుత్వ బాలికల డిగ్రీ కాలేజీలను విలీనం చేసి క్లస్టర్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం. విద్యార్థులకు ఉపాధి కల్పన సామర్థ్యాలు, నైపుణ్యాలను పెంచేలా నాణ్యమైన విద్యను అందించడం.

10. బిల్లు: జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్, లలిత కళల విశ్వవిద్యాలయం చట్టం సవరణ
లక్ష్యం : వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్, లలిత కళల విశ్వవిద్యాలయం కడపలో ఏర్పాటు చేయడం.

11. బిల్లు: ఆంధ్రప్రదేశ్‌ విశ్వవిద్యాలయాల చట్టాల సవరణ బిల్లు
లక్ష్యం : విశ్వవిద్యాలయాల పాలక మండళ్లలో ఏపీ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ లేదా ప్రతినిధి ఎక్స్‌–అఫీషియో సభ్యునిగా నియామకం.

12. బిల్లు: ఆంధ్రప్రదేశ్‌ విశ్వవిద్యాలయాల చట్టాల రెండో సవరణ బిల్లు
లక్ష్యం : విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్స్‌లర్‌ (ఉప కులపతులు)ల నియామక నిబంధనల్లో మార్పులు

13. బిల్లు: ఆంధ్రప్రదేశ్‌ సహకార సంఘాల రెండో సవరణ బిల్లు
లక్ష్యం : సహకార సంఘాల పాలక మండలి ఎన్నికల్లో కుష్టు వ్యాధిగ్రస్తులు, మూగ, చెవిటి వారికి పోటీ చేసే అవకాశం కల్పించడం.

14. ఏపీ వృత్తిదారులు, వ్యాపారులు, ఉద్యోగుల వృత్తిపన్ను చట్టం సవరణ బిల్లు–2019

15. ఏపీ జీఎస్టీ సవరణ బిల్లు–2019 .  16. ఏపీ మున్సిపల్‌ చట్టం సవరణ బిల్లు–2019

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి