iDreamPost

విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం!

విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ ను అందించింది. ఇప్పటికే పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఉదయం అల్పాహారం పంపిణీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరో గుడ్ న్యూస్ ను అందించింది.

విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ ను అందించింది. ఇప్పటికే పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఉదయం అల్పాహారం పంపిణీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. మంత్రులు ఇటీవల ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ మేనూలో భాగంగా విద్యార్థులకు పూరీ, మిల్లెట్, ఇడ్లీ, ఉప్మా, ఇడ్లీ, పోహా, పొంగల్, వెజిటబుల్ పులావ్, కిచ్డీ లను అందించనున్నారు. ఇక ఈ పథకం కింద 27,147 పాఠశాలల్లోని 23 లక్షల మంది విద్యార్థులకు వర్తిస్తుందని విద్యాశాఖ అధికారులు అన్నారు.

అయితే దీంతో పాటు ఆ మెనూలో సాయంత్రం రాగి జావను జత చేయాలని విద్యా శాఖ తాజాగా నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. విద్యార్థులు పాఠశాల నుంచి తిరిగి వెళ్లే సమయంలో వారికి రాగి జావను అందజేయనున్నట్లు తెలిపారు. దీన్ని కూడా ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే విద్యార్థుల రక్తహీనతను అరికట్టేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు మేనులో రాగి జావను చేర్చడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి