iDreamPost

కల్కి టీమ్ బిగ్ సర్ ప్రైజ్.. విడుదలకు ముందే OTTలో స్పెషల్ వీడియో?

Big Surprise For Prabhas Fans From Kalki: డార్లింగ్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ నుంచి బిగ్ సర్ ప్రైజ్ రాబోతోంది. నిజానికి ఇండియన్ సినిమాలో ఇలాంటి ప్రమోషన్స్ ఎక్కడా చూసుండరు.

Big Surprise For Prabhas Fans From Kalki: డార్లింగ్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ నుంచి బిగ్ సర్ ప్రైజ్ రాబోతోంది. నిజానికి ఇండియన్ సినిమాలో ఇలాంటి ప్రమోషన్స్ ఎక్కడా చూసుండరు.

కల్కి టీమ్ బిగ్ సర్ ప్రైజ్.. విడుదలకు ముందే OTTలో స్పెషల్ వీడియో?

ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా ఉన్న సినిమా లవర్స్ ఎదురుచూస్తున్న సినిమాల్లో కల్కి 2898 ఏడీ కూడా ఒకటి. ఈ మూవీ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాని నాగ్ అశ్విన్ పాన్ వరల్డ్ స్థాయిలో సూపర్ హీరో కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పురాణ ఇతిహాసాల నేపథ్యంలో ప్యూచర్ టెక్నాలజీతో ఈ మూవీ అయితే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మూవీపై చాలానే అంచనాలు ఉన్నాయి. హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతోందని ఇప్పటికే మేకర్స్ కూడా ఇన్ డైరెక్ట్ గా సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి బిగ్ సర్ ప్రైజ్ ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన న్యూస్ అయితే నెట్టింట వైరల్ అవుతోంది.

కల్కి సినిమాకి సంబంధించి ఇప్పటికే చాలానే అప్ డేట్స్ వచ్చాయి. పోస్టర్స్, గ్లింప్స్, ప్రభాస్ నేమ్ రివీల్ అంటూ ఆడియన్స్ ని చాలానే అలరించారు. ఇప్పుడు అన్నింటి కంటే బిగ్ సర్ ప్రైజ్ తో వస్తున్నట్లు చెప్తున్నారు. అసలు కథ మొత్తం సినిమా విడుదలకి ముందే చెప్తారంటూ వార్తలు వస్తున్నాయి. నాగ్ అశ్విన్ ప్లాన్ విని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటివరకు తెలుగు సినిమాలో ఇలాంటి ప్లాన్ చూడలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. మూవీ హాలీవుడ్ రేంజ్ లో ఉంటడం కాదు.. ప్రమోషన్స్ కూడా అదే రేంజ్ లో చేస్తున్నారు అంటూ చెబుతున్నారు. నిజానికి ఈ ఐడియా వరల్డ్ వైడ్ గా కల్కి 2898 ఏడీ మూవీపై అంచనాలను అమాంతం పెంచేస్తుంది అంటున్నారు.

Kalki update

విషయం ఏంటంటే.. కల్కి సినిమాకి సంబంధించి ఒక వీడియో విడుదల చేయబోతున్నారు అంటున్నారు. కల్కి సినిమా కథ ఏంటి? కల్కి వరల్డ్ ఎలా ఉండబోతోంది? కల్కి 2898 ఏడీ సినిమాలో ఉండే పాత్రలు ఏవి? ఆ పాత్రలకు ఉండే ప్రాధాన్యత, వాటి బ్యాగ్ డ్రాప్.. ఇలా మొత్తం విషయాలను వివరిస్తూ ఒక యానిమేటెడ్ వీడియో విడుదల చేయబోతున్నారు అని పాన్ ఇండియా లెవల్లో టాక్ స్టార్ట్ అయ్యింది. ఇప్పటికే ప్రభాస్ తన భైరవ పాత్రకు డబ్బింగ్ కూడా పూర్తి చేశాడు అంటున్నారు. ఈ యానిమేటెడ్ ప్లీలూడ్ వీడియో ఓటీటీలో విడుదలవుతుందట. అది కూడా నెట్ ఫ్లిక్స్ విడుదల అయ్యే అవకాశం ఉంటుంది అంటున్నారు.

ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఈ యానిమేటెడ్ వీడియో గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. నాగ్ అశ్విన్ ప్లాన్ నెక్ట్స లెవల్ అంటున్నారు. కల్కి సినిమా వాయిదా పడింది అంటూ వస్తున్న వార్తలు చూసి డార్లింగ్ ఫ్యాన్స్ డల్ అయిన విషయం తెలిసిందే. కానీ, ఈ యానిమేటెడ్ ప్రీలూడ్ వీడియో అనగానే అంతా ఎగ్జైట్ అయిపోతున్నారు. అసు కల్కి సినిమా ఎలా ఉటుందో తెలుసుకుని థియేటర్ కి వెళ్తే ఆ కిక్కే వేరు అంటున్నారు. ఇలాంటి ప్రమోషన్స్ ఇప్పటివరకు చూడలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ యానిమేటెడ్ వీడియో గురించి విన్న తర్వాత వాయిదా వార్తలను మర్చిపోయారు. మరి.. కల్కి మూవీ నుంచి వీడియో రాబోతోంది అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి