iDreamPost

Animal: యానిమల్ OTT స్ట్రీమింగ్ లో ట్విస్ట్! కోర్టుకు నిర్మాత..!

యానిమల్ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు సినిమా ప్రేక్షకులు. ఇలాంటి వారికి ఊహించని షాక్ తగిలింది. ఓటీటీ స్ట్రీమింగ్ ను నిలిపివేసేందుకు స్టే ఇవ్వాలని కోర్టుకెక్కాడు సహ నిర్మాత. పూర్తి వివరాల్లోకి వెళితే..

యానిమల్ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు సినిమా ప్రేక్షకులు. ఇలాంటి వారికి ఊహించని షాక్ తగిలింది. ఓటీటీ స్ట్రీమింగ్ ను నిలిపివేసేందుకు స్టే ఇవ్వాలని కోర్టుకెక్కాడు సహ నిర్మాత. పూర్తి వివరాల్లోకి వెళితే..

Animal: యానిమల్ OTT స్ట్రీమింగ్ లో ట్విస్ట్! కోర్టుకు నిర్మాత..!

‘యానిమల్’ రణ్ బీర్ కపూర్-సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ.. ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వరల్డ్ వైడ్ గా భారీ కలెక్షన్లు సాధించి.. రికార్డులు నెలకొల్పింది. ఇక ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు అభిమానులు. థియేటర్లలో చూసినా సరే.. ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎంతో ఆత్రుతగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో జనవరి 26న స్ట్రీమింగ్ చేసేందుకు మేకర్స్ సిద్దమౌతున్నారు. ఇలాంటి టైమ్ లో ఫ్యాన్స్ కు ఊహించని షాక్ తగిలింది. యానిమల్ స్ట్రీమింగ్ నిలిపివేస్తూ స్టే ఇవ్వాలని నిర్మాత కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

యానిమల్ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 1న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తో విజయం సాధించింది. దీంతో ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్. ఇక యానిమల్ ను జనవరి 26న స్ట్రీమింగ్ చేసేందుకు మేకర్స్ సిద్దమవుతున్నారు. ఇలాంటి టైమ్ లో ఫ్యాన్స్ తో పాటు, మేకర్స్ కు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు సినీ వన్ స్టూడియోస్ ఓనర్. వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా యానిమల్ సినిమాకు సినీ వన్ స్టూడియోస్ వ్యవహరించింది. అసలు విషయం ఏంటంటే?

మ్యూజిక్ కంపెనీ టి సిరీస్ తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించిందని, యానిమల్ మూవీలో 35 శాతం ఫ్రాఫిట్ షేర్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఉన్నాయని ఈ విషయంలో అగ్రిమెంట్ ఉల్లంఘన జరిగిందని కోర్టుకు ఎక్కింది సినీ వన్ స్టూడియోస్. మా డబ్బులు మాకు తిరిగి ఇచ్చే వరకు యానిమల్ ఓటీటీ స్ట్రీమింగ్ ను నిలిపివేస్తూ.. స్టే ఇవ్వాలని కోర్టును కోరింది. టి సిరీస్ తో తమకు ఎప్పటి నుంచో మంచి సంబంధాలు ఉన్నాయని, వాటిని గౌరవించే ఇన్ని రోజులు కోర్టుకు రాలేదని చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయంపై సినీ వన్ స్టూడియోస్ సంస్థ రూ. 2.2 కోట్లకు వదులుకుందని, ఇందుకు సంబంధించిన అగ్రిమెంట్ పేపర్ ను టి సిరీస్ న్యాయవాది అమిత్ సిబల్ కోర్ట్ కు సమర్పించారు. ఈ విషయాన్ని సదరు నిర్మాత దాచిపెట్టాడని కోర్టుకు తెలపగా.. ఇరువురి వాదనలు విన్న కోర్టు విచారణను జనవరి 18కు వాయిదా వేసింది. దీంతో జనవరి 26న స్ట్రీమింగ్ అవుతుందా? కాదా? అన్నది ఇప్పడు ప్రశ్నార్థకంగా మారింది.

ఇదిలా ఉండగా.. థియేటర్లలో కట్ అయిన కొన్ని సీన్స్ ను ఓటీటీలో యాడ్ అవుతాయని తెగ ప్రచారం జరిగింది. అదీకాక కట్ చేయని ప్రింట్ ను ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తామని గతంలో ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చెప్పాడు. దీంతో ఫ్యాన్స్ తెగ ఖుషీ అయ్యారు. కానీ ఫ్యాన్స్ కు ఊహించని షాక్ తగిలింది. కేవలం సెన్సార్ అప్రూవ్ చేసిన వెర్షన్ నే స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించుకుందట నెట్ ఫ్లిక్స్. దీంతో అన్ కట్ వెర్షన్ చూడాలని ఎదురుచూస్తున్న మూవీ లవర్స్ కు భారీ షాక్ తగిలేలా ఉంది. మరి స్ట్రీమింగ్ విషయంలో నిర్మాత కోర్టుకు ఎక్కడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి