iDreamPost

మహిళలకు గుడ్ న్యూస్.. అంగన్ వాడీల్లో ఉద్యోగాలు

మహిళలకు మరో గుడ్ న్యూస్. ఆ జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్ వాడీ పోస్టులు భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్ ను విడుదల చేశారు.

మహిళలకు మరో గుడ్ న్యూస్. ఆ జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్ వాడీ పోస్టులు భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్ ను విడుదల చేశారు.

మహిళలకు గుడ్ న్యూస్.. అంగన్ వాడీల్లో ఉద్యోగాలు

జిల్లా స్త్రీ, శిశు అభివృద్ధి అధికారులు మహిళలకు ఓ మంచి గుడ్ న్యూస్ ను చెప్పారు. ఖాళీగా ఉన్న అంగన్ వాడీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రకటనతో స్థానిక వివాహిత మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, దీనికి సంబంధించిన ప్రకటన కూడా ఇటీవల వెలువడింది. అసలు ఇందులో ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఏ కేటగిరికి చెందిన ఉద్యోగాలు ఉన్నాయి? ఇంతకు జిల్లాలోని ఏ ఏ ప్రాంతాల్లో ఈ ఖాళీలు ఉన్నాయనే పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.

గ్రామాల్లో అంగన్ వాడీ కార్యకర్తల పాత్ర ఎంతో కీలకమైనది. చిన్న పిల్లలను పోషకాహారం అందించడంతో పాటు గర్భిణీ మహిళలకు అందిస్తుంటారు. వారిని ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడుతుంటారు. ఇదిలా ఉంటే.. అనకాపల్లి డివిజన్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న అంగన్ వాడీ పోస్టులను భర్తీ చేస్తున్నామని ప్రకటించారు జిల్లా స్త్రీ, శిశు అభివృద్ది అధికారి కె. అనంత లక్ష్మి. దీనికి సంబంధించి అధికారిక ప్రకటనను ఆమె గురువారం వెల్లడించారు. ఇకపోతే, జిల్లాలోని వివిధ గ్రామాల్లో అంగన్ వాడీ, మినీ అంగన్ వాడీ, సహాయకురాలు పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఇక పైన తెలిపిన పోస్టులకు అర్హులైన మహిళలు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.

పోస్టుల వివరాలు:

నర్సీపట్నం డివిజన్: ఆయాలు-17, కార్యకర్త పోస్టులు-6, మినీ కార్యకర్త-1తో కలిపి 24 పోస్టులు ఉన్నాయి.

అనకాపల్లి డివిజన్: ఆయాలు -37, కార్యకర్త పోస్టులు-3, మినీ కార్యకర్త-8తో కలిపి 48 ఖాళీలు ఉన్నాయని ఆమె సూచించారు.

ఇక పైన తెలిపిన పోస్టులకు అప్లయ్ చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఈ ఏడాది జూలై 1 నాటికి 21 ఏళ్లు నిండి, 35 ఏళ్ల వయసులోపు ఉండాలని తెలిపారు. వీళ్లు 10వ తరగతి పాస్ అయి ఉండాలి. స్థానికులైన వివాహితలు ఈ పోస్టులకు అర్హులు. దరఖాస్తు చేసుకోవాలనే అభ్యర్థులు ఈ నెల 24 నుంచి డిసెంబర్ 4 వరకు అప్లయ్ చేసుకోవాలని తెలిపారు. మరో విషయం ఏంటంటే? ఆ రోజు సాయంత్రం 5 గంటల్లోగా శిశు అభివద్ది పథకం అధికారి కార్యాలయానికి నేరుగా లేదా రిజిస్టర్ ద్వారా దరఖాస్తులు పంపాలని అధికారులు సూచించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి