iDreamPost

ఏ సాయం కావాలన్న కాల్‌ చేయండి.. మొబైల్‌ నంబర్‌ షేర్‌ చేసిన రష్మి!

  • Published Jul 22, 2023 | 12:06 PMUpdated Jul 22, 2023 | 12:06 PM
  • Published Jul 22, 2023 | 12:06 PMUpdated Jul 22, 2023 | 12:06 PM
ఏ సాయం కావాలన్న కాల్‌ చేయండి.. మొబైల్‌ నంబర్‌ షేర్‌ చేసిన రష్మి!

తెలుగులో స్టార్‌ యాంకర్స్‌ జాబితాలో రష్మి పేరు ముందు వరసలో ఉంటుంది. ఏళ్ల తరబడి బుల్లి తెర మీద యాంకర్‌గా రాణిస్తోంది. ఓవైపు యాంకర్‌గా రాణిస్తూనే.. సినిమాల్లో కూడా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. అడపాదడపా సినిమాలు చేస్తూ.. తన లక్‌ని పరీక్షించుకుంటుంది. తెలుగులో హాట్‌ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న రష్మి.. సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. ఫొటో షూట్లు, వీడియోలు షేర్‌ చేస్తూ.. అభిమానులకు అందుబాటులో ఉంటుంది. ఇక రష్మి యానిమల్‌ లవర్‌ అని అందరికి తెలుసు. మూగ జీవులను బాధ పెడితే ఏమాత్రం తట్టుకోలేదు. ఎక్కడైనా రోడ్డు పక్కన ఏవైనా జంతువులు గాయాలతో కనిపిస్తే.. వాటిని అ‍క్కున చేర్చుకుని ఆదరిస్తుంది.

గాయపడిన జంతువులకు చికిత్స అందించి.. కోలుకునే వరకు వాటి రక్షణని తనే చూస్తుంది. అంతేకాక విదేశీ సంతతి కుక్కలను పెంచుకోవద్దని.. లోకల్‌ బ్రీడ్స్‌ను పెంచుకోమని పెట్‌ లవర్స్‌కి సలహాలు ఇస్తుంటుంది. అయితే హైదరాబాద్‌లో వీధి కుక్కల కారణంగా చిన్నారి ప్రదీప్‌ మృతి చెందిన సమయంలో.. చాలా మంది రష్మిని ట్రోల్‌ చేశారు. ఇదిలా ఉండగా తాజాగా రష్మి చేసిన ఓ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. సాయం కావాలంటే కాల్‌ చేయండి అంటూ ఫోన్‌ నంబర్‌ షేర్‌ చేసింది రష్మి. ప్రస్తుతం ఇది వైరలుతోంది. ఆ వివరాలు..

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. ఇక హైదరాబాద్‌లో అయితే నాలుగు రోజుల పాటు ఎడతెరపి లేకుండా వర్షాలు కురిసాయి. ఈ వర్షాల వల్ల మూగ జీవులు తీవ్ర ఇబ్బందులు ఎదర్కొంటున్నాయి అంటూ రష్మి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో రష్మి మూగ జీవులు గురించి ఆలోచించి వాటిని కూడా ఆదుకోవాలని సూచించింది. మూగ జీవులకు సాయం చేయడం కోసం కాల్‌ చేయమంటూ ఒక మొబైల్‌ నంబర్‌ని షేర్‌ చేసింది.

Rashmi gautham share her personel number in instagram story

రష్మి తన ఇన్‌స్టాగ్రం స్టోరీలో మూగజీవుల గురించి తన ఆవేదనను వ్యక్తం చేసింది. అసలే ఇప్పుడు వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి.. వరదలు వస్తున్నాయ్.. ఇలాంటి టైంలో జనాలను సురక్షిత ప్రాంతాలకు ప్రభుత్వాలు తరలిస్తుంటాయి.. కానీ జంతువుల గురించి అంతగా పట్టించుకోవు. ఇలాంటి వరదల సమయంలో జంతువుల గురించి కూడా కాస్త ఆలోచించండి.. వదిలేయకండి. మీరు ప్రయాణాలు చేసే ఆలోచనలో ఉంటే వాటిని కట్టేసి ఉంచకండి. ఒక వేళ వరదలు వస్తే.. బయటకు వెళ్లేందుకు వాటికి దారి ఉండదు. అందుకే వాటిని ఫ్రీగా వదిలేయండి. మీకు ఎలాంటి సలహాలు, సాయం కావాలన్నా రెస్క్యూ టీం అందుబాటులో ఉంటుంది.. వారి నంబర్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను అంటూ ఓ నంబర్‌ను చూపించింది రష్మీ. జంతువుల ప్రాణాలను కాపాడండి అంటూ రష్మీ వేడుకుంది. ప్రస్తుతం రష్మి చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి