iDreamPost

Virat Kohli: RCBకి మద్దతుగా స్పెషల్ గెస్ట్! అతన్ని చూస్తే.. కోహ్లీని ఆపడం కష్టమే!

రాజస్తాన్ తో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ లో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది బెంగళూరు. ఈ క్రమంలో ఆర్సీబీకి మద్ధతు తెలిపేందుకు స్పెషల్ గెస్ట్ వచ్చాడు. అతడిని చూస్తే.. ఇక కోహ్లీని ఆపడం కష్టమే అంటున్నారు ఫ్యాన్స్. మరి ఆ అతిథి ఎవరు? ఆ వివరాల్లోకి వెళితే..

రాజస్తాన్ తో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ లో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది బెంగళూరు. ఈ క్రమంలో ఆర్సీబీకి మద్ధతు తెలిపేందుకు స్పెషల్ గెస్ట్ వచ్చాడు. అతడిని చూస్తే.. ఇక కోహ్లీని ఆపడం కష్టమే అంటున్నారు ఫ్యాన్స్. మరి ఆ అతిథి ఎవరు? ఆ వివరాల్లోకి వెళితే..

Virat Kohli: RCBకి మద్దతుగా స్పెషల్ గెస్ట్! అతన్ని చూస్తే.. కోహ్లీని ఆపడం కష్టమే!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఈ ఐపీఎల్ సీజన్ లో ఇంటికి వెళ్లే మెుదటి జట్టు ఇదే అంటూ చాలా మంది అనుకున్నారు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో ఆడిన 8 మ్యాచ్ ల్లో కేవలం ఒకే విజయంతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. దాంతో అందరూ పై విధంగా భావించారు. కానీ ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న ఆర్సీబీ.. ఎవ్వరూ ఊహించని విధంగా ప్లే ఆఫ్స్ కు చేరుకుని అందరిని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. ఇక ఒంటి చేత్తో టీమ్ ను ప్లే ఆఫ్స్ కు చేర్చాడు కింగ్ విరాట్ కోహ్లీ. ఇక రాజస్తాన్ తో ఎలిమినేటర్ మ్యాచ్ లో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఆర్సీబీకి మద్ధతు తెలిపేందుకు స్పెషల్ గెస్ట్ వచ్చాడు. అతడిని చూస్తే.. ఇక కోహ్లీని ఆపడం కష్టమే అంటున్నారు ఫ్యాన్స్.

ఐపీఎల్ 2024లో భాగంగా మే 22(బుధవారం) నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్ వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ-రాజస్తాన్ జట్లు ఢీకొనబోతున్నాయి. రెండు జట్లు కూడా ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్ లో ఆర్సీబీకి మద్ధతు తెలిపేందుకు ఓ స్పెషల్ గెస్ట్ వచ్చాడు. అతడెవరో కాదు.. విరాట్ చిరకాల మిత్రుడు, సౌతాఫ్రికా దిగ్గజం, మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్. ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆర్సీబీని ఉత్సాహపరచడానికి ఇండియా వచ్చాడు ఏబీడీ. లైవ్ లో అభిమానులతో చిట్ చాట్ చేసిన డివిలియర్స్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. జాయిన్ మీ మిస్టర్ 360 పేరుతో చాట్ చేశాడు.

Kohli

కాగా.. 11 సీజన్ల పాటు ఆర్సీబీకి ఆడాడు డివిలియర్స్. దాంతో విరాట్ కోహ్లీతో మంచి బాండింగ్ ఏర్పడింది. ఇక వీరిద్దరు కలిపి ఏర్పరచిన 229 పరుగుల భాగస్వామ్యం ఇప్పటి వరకు చెక్కుచెదరకుండా ఉంది. ఈ జోడీ బెంగళూరుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించింది. కానీ కప్ ను మాత్రం అందించలేకపోయింది. దాంతో ఆర్సీబీ అభిమానులు గత 16 సీజన్లుగా బాధలోనే ఉన్నారు. అయినప్పటికీ జట్టుకు అండగా నిలుస్తూ.. ఉత్సాహపరుస్తూనే ఉన్నారు. ఇక తన చిరకాల మిత్రుడు ఏబీడీ ఈ మ్యాచ్ కు స్పెషల్ గెస్ట్ గా వస్తే.. కోహ్లీని ఆపడం ఎవ్వరి తరం కూడా కాదని ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు.

గ్రౌండ్ లో తనతో కలిసి 11 సంవత్సరాలు ఆడిన ఏబీడిని చూస్తే.. కోహ్లీకి పూనకాలు రావడం ఖాయం, బౌలర్లకు చుక్కలు చూపించడం ఖాయం. ఇక ఈ సీజన్ లో విరాట్ కోహ్లీ పరుగుల వరదపారిస్తున్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటి వరకు ఆడిన 14 మ్యాచ్ ల్లో 708 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా కొనసాగుతున్నాడు కింగ్ కోహ్లీ. మరి ఇంత భీకర ఫామ్ లో ఉన్న విరాట్.. రాజస్తాన్ తో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ లో ఏబీడీని చూసి ఏ రేంజ్ లో రెచ్చిపోతాడో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి