iDreamPost

సరూర్ నగర్ పరువు హత్య కేసు.. కోర్టు సంచలన తీర్పు!

సరూర్ నగర్ పరువు హత్య కేసు.. కోర్టు సంచలన తీర్పు!

నాగరాజు, అశ్రీన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ పెళ్లి యువతి కుటుంబ సభ్యులకు నచ్చేలేదు. దీంతో అశ్రీన్ సోదరులు ఆమె భర్త నాగరాజును నడిరోడ్డుపై అందరు చూస్తుండగానే కత్తులతో పొడిచి పొడిచి అతి దారుణంగా చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు. కాగా, ఇదే కేసులో తాజాగా అనంతపురం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితులకు యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పును ఇచ్చింది. కోర్టు తీర్పుతో మృతుడు నాగరాజు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే?

నాగరాజు, అశ్రీన్ అనే యువతి, యువకుడు కలిసి చదువుకున్నారు. ఈ క్రమంలో వీరి మధ్య ప్రేమ చిగురించి ఏకంగా ఐదేళ్ల పాటు ప్రేమించుకున్నారు. ఇక పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. కానీ, ఇద్దరి మతాలు వేరు కావడంతో వీరి పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీంతో ఈ ప్రేమికులు వారిని ఎదురించి ఓ గుడిలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకుని ఆ యువతి కుటుంబ సభ్యులు నాగరాజుపై కోపంతో రగిలిపోయారు.

అప్పటి నుంచి ఈ ప్రేమికులు హైదరాబాద్ లోని బాలానగర్ లో నివాసం ఉండేవారు. అయితే అశ్రీన్ సోదరులు ఎలాగైన నాగరాజును చంపాలని అనుకున్నారు. ఇక పథకం ప్రకారమే.. బుధవారం మే 4న రాత్రి 9 గంటల సమయంలో అశ్రీన్ సోదరులు కాపుకాచి నడి రోడ్డుపై అశ్రీన్ ముందే ఆమె భర్త నాగరాజును అందరు చూస్తుండగానే కత్తులతో పొడిచి అతి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి