iDreamPost

ప్రియుడితో కలిసి NRI భర్తను చంపిన భార్య.. పట్టించిన తొమ్మిదేళ్ల బాలుడు

ప్రియుడితో కలిసి NRI భర్తను చంపిన భార్య.. పట్టించిన తొమ్మిదేళ్ల బాలుడు

నిజం నిలకడ మీద తెలుస్తుందనేది సామెత. ఆమె విషయంలో అదే రుజువు అయ్యింది. తప్పు చేసి తప్పించుకుని తిరుగుదామని ప్రయత్నించింది. కానీ ఆమె ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. తప్పు చేస్తే ఎప్పటికైనా శిక్ష అనుభవించక తప్పదు. కొన్నాళ్ల క్రితం జరిగిన ఎన్నారైను చంపిన హత్య కేసులో అతడి భార్యే నేరస్థురాలని తేలింది. ఈ హత్య కేసును చేధించడంలో ముఖ్య పాత్ర పోషించాడు.. తొమ్మిదేళ్ల బాలుడు. ఎన్నారై చనిపోయిన ఏడేళ్లకు.. ఆ హత్య కేసులో భార్య, ఆమె ప్రియుడు దోషులుగా నిర్ధారించింది కోర్టు. ఇంతకు ఈ హత్య ఎందుకు, ఎప్పుడు, ఎలా జరిగిందనేది పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్ పూర్‌కి చెందిన సుఖ జీత్ సింగ్, రమణ్ దీప్ కౌర్ మాన్ భార్యా భర్తలు. వీరు బ్రిటన్‌లో స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు పిల్లలు. 2016లో ఆగస్టులో సెలవుల నిమిత్తం ఆ కుటుంబం ఇండియాకు రాగా, సెప్టెంబర్ 2, 2016లో సుఖజీత్ సింగ్ హత్యకు గురయ్యారు. ఇప్పుడు ఆ కేసులో భార్య అసలు నేరస్థురాలు అని తేలింది. పర్యటన రావడానికి ముందే భర్తను చంపేందుకు తన ప్రియుడితో కలిసి పన్నాగం పన్నింది. పంజాబ్‌లోని కపుర్తలాలో ఉన్న తన ప్రియుడు గుర్ ప్రీత్ సింగ్‌కు ప్లాన్ చెప్పింది. షాజహాన్ పూర్‌కు వచ్చిన తర్వాత.. తినే ఆహారంలో విషం కలిపి కుటుంబానికి వడ్డించింది. వీరి తొమ్మిదేళ్ల కుమారుడు, ఆమె మినహా.. మిగిలిన వారంతా విషాహారాన్ని తిన్నారు.

కొడుకు మ్యాగీ కావాలని పట్టుబడటంతో ప్రాణాల నుండి బయటపడ్డాడు. తన స్నేహితుడితో కలిసి, తన భర్త గొంతు కోసి చంపింది. ఈ మొత్తం అకృత్యాన్ని కుమారుడు కళ్లారా చూశాడు. దీంతో అతడు ప్రత్యక్ష సాక్షి అయ్యాడు. తన తండ్రి చాలా గొప్ప వాడని, తన తల్లి ముఖం తిరిగి తాను చూడాలనుకోవడం లేదని, తన ముఖాన్ని దిండులో కప్పి, గుర్ ప్రీత్‌ను తన తండ్రిని చంపమని చెప్పిందని వాంగూల్మం ఇచ్చాడు. సుదీర్ఘ విచారణలో రమణ్ దీప్ కౌర్, ఆమె ప్రియుడు గుర్ ప్రీత్ ను దోషులుగా కోర్టు నిర్దారించింది. శనివారం ఈ కేసులో కోర్టు తుది తీర్పునివ్వనుంది. ఇలా ఎట్టకేలకు ఏడేళ్లకు ఈ కేసు ఓ కొలిక్కి వచ్చింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి