iDreamPost

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. నేడే వారి ఖాతాల్లో డబ్బులు జమ!

ఏపీ విద్యార్థులకు  గుడ్ న్యూస్.. నేడే వారి ఖాతాల్లో డబ్బులు జమ!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యార్థులు, యువత కోసం ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టారు. పేద విద్యార్థులకు ఉచిత విద్యాను అందించేందుకు అమ్మ ఒడి, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన వంటి ఎన్నో పథకాలు విద్యార్థుల కోసం యువత కోసం ప్రవేశా పెట్టారు. ఈ పథకాల యువతకు, విద్యార్థులకు నగదు జమ చేస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలు వివిధ పథకాల కింద నగదును విడుదల  చేస్తున్నారు. వరుసగా నాలుగో ఏడాదీ 2023-23 విద్యా సంవత్సారానికి సంబంధించి ‘ జగనన్న అమ్మ ఒడి’ కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేశారు.

2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి ‘జగనన్న అమ్మ ఒడి’ అమలు కార్యక్రమానికి సీఎం జగన్ నేడు శ్రీకారం చుట్టారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పది రోజులపాటు పండుగ వాతావరణంలో నిర్వహించి 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లు జమ చేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఒకటో తరగతి నుంచి ఇంటర్ చదివే 83.15 లక్షల మంది  విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జగన్ బటన్ నొక్కి అమ్మ ఒడి నిధులు జమ చేశారు.

తాజాగా విడుదల చేసిన డబ్బులతో కలిపితే ఇప్పటివరకు ఒక్క జగనన్న అమ్మఒడి ద్వారానే రూ. 26.28 కోట్ల మేర ప్రయోజనాన్ని చేకూరుస్తున్నారు.  విద్యార్థుల భవిష్యత్తుకు అత్యంత ప్రాధాన్యమిస్తసూ సీఎం జగన్ కీలక సంస్కరణలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నాలుగేళ్ల కాలంలో విద్యా రంగంపై రూ.66,722.36 కోట్లను వెచ్చించారు. పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థీ చదువులకు దూరం కాకుడదనే సంకల్పంతో పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తున్నారు. పాఠశాలలో డ్రాప్ అవుట్స్ ను గణనీయంగా తగ్గించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ  పథకానికి కనీసం హాజరు ఉండేలా నిబంధన అమలు చేస్తున్నారు.

పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపి… కనీసం 75 శాతం హాజరు ఉండేలా తల్లులు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది.నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను సర్వాంగ సుందరంగా మార్చి ప్రైవేట్‌ స్కూళ్లే సర్కారు విద్యాసంస్థలతో పోటీ పడేలా చేశారు. విద్యార్థుల చేరికలను ప్రోత్సహిస్తూ జీఈఆర్‌ శాతాన్ని మరింత మెరుగుపర్చేందుకు పదో, ఇంటర్‌లో ఉత్తీర్ణులు కాకపోయినా తిరిగి తరగతులకు హాజరైతే వారికి కూడా అమ్మ ఒడిని వర్తింపచేయాలని నిర్ణయించారు. మరి.. విద్యార్థుల విషయంలో సీఎం జగన్ తీసుకుంటున్నా నిర్ణయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి