iDreamPost

కాఫర్‌ డ్యాం కట్టకుండా.. డయాఫ్రమ్ వాల్ కట్టిన ఘనుడు చంద్రబాబు: అంబటి

కాఫర్‌ డ్యాం కట్టకుండా.. డయాఫ్రమ్ వాల్ కట్టిన ఘనుడు చంద్రబాబు: అంబటి

డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదమే పోలవరం ప్రాజెక్ట్ ను శనిలా వెంటాడుతోందని రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు పురగోతిని నాడు- నేడు విధానంలో మంత్రి అంబటి రాంబాబు అధికారులు, పాత్రికేయులకు ప్రాజెక్ట్ సైట్ లో పర్యటించి వివరించారు. తమ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చే సమయానికి పోలవరం పనులు.. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ పనుల ప్రగతిని మంత్రి వివరించారు. తర్వాత మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.

“వైఎస్సార్ హయాంలో వేగవంతమైన పోలవరం పనులను ఆయన కుమారుడు సీఎం జగన్ పూర్తి చేసి జాతికి అంకితం చేస్తారన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పై చంద్రబాబు నాయుడు అసత్యాలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రాజెక్ట్ పనులపై వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మాపై ఉంది. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్, స్పిల్ ఛానెల్, స్పిల్ వే పూర్తి చేయకుండా నది నీరు మళ్లించకుండా   డయాఫ్రమ్ వాల్ నిర్మించడమే చంద్రబాబు నాయుడు చేసిన చారిత్రాత్మకమైన తప్పిదం. దీని కారణంగానే 2019-20లలో వచ్చిన వరదల కారణంగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతినింది.

ఎప్పటి నుంచో చంద్రబాబును నా ప్రశ్నలకు సమాధానం చెప్పమని అడుగుతున్నాను. కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన జాతీయ ప్రాజెక్ట్ ను తాను నిర్మిస్తానని ఎందుకు ఒప్పుకున్నారు? 2018లో పూర్తిచేసి జాతికి అంకితం చేస్తానని ఎందుకు పూర్తి చేయలేక పోయారు? ఎగువ, దిగువ కాఫర్ డాంలు పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ ఎందుకు నిర్మించారు? 2016 సంవత్సంలో 2013-14 రేట్లు ప్రకారం నిర్మిస్తామని ఎందుకు ఒప్పుకున్నారు? చంద్రబాబు నాయుడుకు ప్రాజెక్ట్ లపై, వ్యవసాయంపై చిత్తశుద్ధి లేదు. ఎన్నికల ప్రచారం కోసమే ప్రాజెక్ట్ ల వద్దకు పర్యటిస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ కు 45.72 కాంటూర్ కే నిర్మిస్తాం. 41.15కు తగ్గిస్తామని ప్రచారం నిజం కాదు. మొదటి దశలో 41.15 కాంటూర్ వరకు నిర్మించి నీటి నిల్వ చేసి పరిశీలిస్తాం. ఏమైనా సమస్యలు ఉంటే గుర్తించి సరిచేస్తాం. రెండవ దశలో కూడా అలాగే పరిశీలిస్తాం. చివరిగా 45.72 కాంటూర్ తో ప్రాజెక్ట్ ను నిర్మిస్తాం.

ప్రాజెక్ట్ మొదటి దశలో 41.15 కాంటూర్ వరకు నిర్మాణానికి రూ.19 వేల కోట్లు ఖర్చువుతుంది. భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ నిమిత్తం రూ.7,394 కోట్లు ఖర్చు అవుతుంది. పోలవరం ప్రాజెక్ట్ పనులు ఎక్కడా ఆగలేదు. గత ప్రభుత్వం అసంపూర్తిగా చేసిన పనులను స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్ప్రోచ్ ఛానల్, స్పిల్ వే, గేట్లు, ఎగువ, దిగువ కాఫర్ డాంలను పూర్తి చేశాం. మేము పూర్తి చేసిన స్పిల్ వేపై చంద్రబాబు నడిచి వెళ్లి.. మా ప్రభుత్వాన్నే విమర్శిస్తున్నారు. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించడమే అవుతుంది. గత ప్రభుత్వం ప్రాజెక్ట్ నిర్మాణంపై దృష్టి పెట్టకుండా కేవలం ప్రచారానికి, బస్సు యాత్రలకు, భోజనాలకు, భజనలకే ప్రాధాన్యత ఇచ్చింది” అంటూ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి