iDreamPost

అందాల షోలో హద్దులు దాటిపోయిన అమలాపాల్! వీడియో వైరల్!

  • Author ajaykrishna Published - 01:26 PM, Sat - 7 October 23
  • Author ajaykrishna Published - 01:26 PM, Sat - 7 October 23
అందాల షోలో హద్దులు దాటిపోయిన అమలాపాల్! వీడియో వైరల్!

కెరీర్ ఆరంభంలో నేచురల్ బ్యూటీస్ అనిపించుకొని.. డిగ్లామర్ రోల్స్ చేసి సూపర్ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. స్టార్టింగ్ లో హిట్స్ పడి ఓ స్టేజ్ కి వెళ్లిన తర్వాత.. వరుసగా ప్లాప్స్ పడేసరికి సంధిగ్ధంలో పడిపోతారు. కట్ చేస్తే.. గ్లామర్ పరంగా పెట్టుకున్న హద్దులన్నీ చెరిపేసి.. ఓ రేంజ్ లో గ్లామర్ రోల్స్ పండించేస్తుంటారు. అలా లైఫ్ లో ఫేస్ చేసిన పరిస్థితులు కూడా హీరోయిన్స్ డిగ్లామర్ నుండి గ్లామర్ కి మారడానికి కారణాలు అవుతుంటాయి. తెలుగు ప్రేక్షకులకు గ్లామర్ బ్యూటీ అమలాపాల్ గురించి పరిచయం అవసరం లేదు. తెలుగులో అల్లు అర్జున్, రామ్ చరణ్, నాగచైతన్యలతో సినిమాలు చేసి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

సరే కెరీర్ లో మెల్లగా ఓ రేంజ్ కి వెళ్తోంది.. అనుకున్న తరుణంలో పెళ్లి చేసుకొని అందరిని షాక్ కి గురిచేసింది. ఇంకేముంది.. పెళ్ళైందిగా అంతా అయిపోయింది అని అనుకున్నారు ఫ్యాన్స్. కట్ చేస్తే.. కొన్నాళ్ళకు భర్తతో విడిపోయి.. విడాకులు తీసుకొని మళ్ళీ సినిమాలు స్టార్ట్ చేసింది. ఇంకా అప్పటినుండి ఏం ఫిక్స్ అయ్యిందో గానీ.. అమలాపాల్ గ్లామర్ షో విషయంలో అసలు తగ్గట్లేదు. ఎందుకనే కారణాలు పక్కన పెడితే.. అమలా గ్లామర్ ని చూసి ఎంజాయ్ చేసే ఫ్యాన్స్ ఎక్కువ. నిజానికి ఏ హీరోయిన్ ని ఎందుకు సడన్ గా గ్లామర్ రోల్స్ చేస్తున్నవ్ అని అడిగితే.. ఎవరైనా క్యారెక్టర్ డిమాండ్ చేసిందని చెబుతుంటారు.

అమలా కూడా అంతే. క్యారెక్టర్ అవసరం బట్టి ఎంత చేయాలో అంత చేస్తోంది. కాకపోతే.. కొద్దీ కాలంగా పూర్తిగా గ్లామర్ రోల్స్ మాత్రమే చేయడం లేదా.. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేయడం. ఇవేవి కుదరకపోతే సోషల్ మీడియాలో విపరీతంగా అందాలను షో చేయడం చేస్తోంది. ఇప్పటికి చాలా సార్లు బికినీ షో చేసి ఫ్యాన్స్ ని రెచ్చగొట్టిన ఈ భామ.. తాజాగా మరోసారి బికినీలో స్విమ్మింగ్ వీడియో పోస్ట్ చేసి షాక్ ఇచ్చింది. అమలా ఆల్రెడీ ఈ మధ్య చాలా బోల్డ్ గా పోస్టులు పెట్టడమే కాకుండా.. లైఫ్ లో కూడా చాలా బోల్డ్ గా ఉంటోందని సమాచారం. మొన్నటిదాకా సోషల్ మీడియా నుండి బ్రేక్ తీసుకున్నట్లు అనిపించినా.. అదిరిపోయే ట్రీట్ తో రీఎంట్రీ ఇవ్వడం విశేషం. ప్రస్తుతం అమలాపాల్ బికినీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి అమల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Amala Paul (@amalapaul)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి