iDreamPost

Alpha Male: ఆల్ఫా మేల్స్‌.. యానిమల్‌లో చెప్పింది ఇలాంటి మగాళ్ల గురించే..

పురుషులందు పుణ్య పురుషులు వేరయా? అన్నట్లుగానే.. మగాళ్లలో ఆల్ఫా మగాళ్లు వేరయా అని చెప్పొచ్చు. యానిమల్‌ సినిమాలో చెప్పినట్లు ఆల్ఫా మేల్స్‌ మిగిలిన వారికంటే ప్రత్యేకమైన వాళ్లు..

పురుషులందు పుణ్య పురుషులు వేరయా? అన్నట్లుగానే.. మగాళ్లలో ఆల్ఫా మగాళ్లు వేరయా అని చెప్పొచ్చు. యానిమల్‌ సినిమాలో చెప్పినట్లు ఆల్ఫా మేల్స్‌ మిగిలిన వారికంటే ప్రత్యేకమైన వాళ్లు..

Alpha Male: ఆల్ఫా మేల్స్‌.. యానిమల్‌లో చెప్పింది ఇలాంటి మగాళ్ల గురించే..

ఒప్పుకున్నా… ఒప్పుకోకపోయినా సినిమాల ప్రభావం ప్రేక్షకుల మీద చాలా ఉంటుంది. మూవీ జోనర్‌ని బట్టి ప్రేక్షకుల మూడ్ మారిపోతూ ఉంటుంది. వారు చూసిన సినిమాలోని హీరో, హీరోయిన్‌లా ఉండేవాళ్లు నిజ జీవితంలో కూడా ఉంటే బావుంటుందని భావించేవాళ్లు చాలామంది ఉన్నారు. ఇక, తమ అభిమాన హీరోలా బాడీ బిల్డ్ చేయాలనీ కొంతమంది.. తమకు ఇష్టమైన హీరోయిన్ లా డ్రెస్సింగ్ చేసుకోవాలని ఇంకొంతమంది అనుకుంటూ ఉంటారు. ఇదే తరహాలో లేటెస్ట్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘యానిమల్’ చిత్రంలో సందీప్ రెడ్డి వంగా ఓ కొత్త థియరీతో హీరో క్యారెక్టర్ ను డిజైన్ చేశాడు.

అదే ఆల్ఫా మేల్ థియరీ. ఈ చిత్రంలోని ఓ సన్నివేశంలో హీరో తనకు ఉన్న ఆల్ఫా మేల్ థియరీ చెప్పి హీరోయిన్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకునేలా చేస్తాడు. అసలు యానిమల్ మూవీలో సందీప్ రెడ్డి చెప్పిన ఈ ఆల్ఫా మేల్ థియరీ ఏంటి ? ఎందుకు అది అంత అవసరం ? ఆ లక్షణాలు ఉన్నవారిని గుర్తించడం ఎలా ? వీటి గురించి తెలుసుకుందాం. ఆల్ఫా మేల్స్​ అంటే ఉత్తమ పురుషుడు అని అర్ధం. ఈ ఉత్తమ పురుష లక్షణాలు కలిగిన అబ్బాయిలు.. సాధారణ అబ్బాయిలకంటే డిఫరెంట్​గా ఉంటారు.

ఆల్ఫా మేల్స్​కు ప్రతి విషయం మీద స్పష్టమైన క్లారిటీ ఉంటుంది. వీరు ప్రతి సందర్భంలోనూ సెల్ఫ్ కాన్ఫిడెంట్‌గా, తెలివిగా మసలుకుంటారు. ఈ ఆల్ఫా మేల్స్ కు ఉండాల్సిన ముఖ్య లక్షణాలు ఏంటి ? ఆ లక్షణాలను యానిమల్ మూవీలో హీరో క్యారక్టర్‌కు ఎలా సింక్ చేశారు? వీటి గురించి చూద్దాం.. ఆల్ఫా మేల్స్ కు ఉండాల్సిన అతి ముఖ్యమైన లక్షణాలు ఏవంటే..

నాయకత్వ లక్షణం :

‘యానిమల్’ చిత్రంలో ఈ లీడర్ షిప్ క్వాలిటీని చాలా బాగా చూపించాడు సందీప్ రెడ్డి వంగా. హీరో తన తండ్రిని రక్షించుకోవడం కోసం అతనిని ప్రొటెక్ట్ చేయడానికి ఆయన చుట్టూ ఓ టీమ్ ను ఏర్పాటు చేస్తాడు. తన తండ్రి బాధ్యతతో పాటు ఆ టీమ్ బాధ్యత కూడా హీరోనే వహిస్తాడు. ఇది ఆల్ఫా మేల్స్ కు ఉండాల్సిన ముఖ్య లక్షణం. లీడర్ షిప్ క్వాలిటీస్ కేవలం రాజకీయ నాయకులకు మాత్రమే ఉంటుంది అనుకుంటే పొరపాటే. అందరితో పని చేయించుకోడంతో పాటు.. వారిని ప్రోత్సహిస్తూ.. వారికీ మార్గదర్శకంగా నిలిచేవాడే.. ఉత్తమ నాయకుడు అనిపించుకుంటాడు.

స్వీయ అవగాహన:

ప్రతి వ్యక్తి సెల్ఫ్ అవేర్​నెస్ కలిగి ఉండాలి. మన చుట్టూ ఏం జరుగుతుంది. ఏ సందర్బాల్లో ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది తెల్సుకుని ఉండాలి. ఈ చిత్రంలో కూడా ఒకానొక సన్నివేశం తర్వాత హీరో వినికిడి శక్తిని కోల్పోతాడు. అలాగే యాక్సిడెంట్ వలన బరువు పెరుగుతాడు. కానీ అక్కడితో ఆగిపోకుండా వాటిని అర్థంచేసుకుని. తనకు తగిన విధంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తాడు. అలానే ఆల్ఫా మెల్ లా ఉండాలి అనుకునే వ్యక్తి ఇటువంటి సెల్ఫ్ అవేర్​నెస్ కలిగి ఉండాలి.

ఇతరుల గురించి ఆలోచించడం: 

అలానే “ఇతరుల గురించి ఆలోచించడం” కూడా ఈ లక్షణాలలో భాగమే.. ఈ చిత్రంలోని కొన్ని సందర్భరాలలో హీరో తన తండ్రికి రక్షణ కలిపించే ప్రయత్నంలో.. ఎప్పుడో విడిపోయిన తన అన్నదమ్ములతో మాటలు కలుపుతాడు. వారిని ఇంట్లోనుంచి పంపమని చెప్పినా.. తనని నమ్మి వచ్చిన వారిని వదలడు. ఇక మరో సన్నివేశంలో ఫుల్ క్లారిటీగా ఉంటాడు హీరో. హీరోయిన్ ను పెళ్ళికి ఒప్పించే ప్రయత్నంలో.. తన ప్రాణాలకు ముప్పు ఉన్నా సరే .. తండ్రిని రక్షించుకునే ప్రయత్నంలో హీరో కచ్చితమైన నిర్ణయాలు తీసుకున్నాడు.

ఇలా ‘యానిమల్’ సినిమాలో ప్రతి సన్నివేశంలోనూ హీరో క్యారక్టర్ ను ఒక గుణవంతునిగా తీర్చి దిద్దాడు దర్శకుడు. ఈ చిత్రం చూసిన కొందరు రణ్ బీర్ క్యారక్టర్ కు, అతని నటనకు బాగా కనెక్ట్ అయిపోతారు. కొందరికి అర్థంకాకపోవచ్చు. అటువంటి వారు ఈ ఆల్ఫా మెన్ థియరీ గురించి తెలుసుకుని ఉంటే.. సందీప్ దర్శకత్వానికి ఫిదా అయిపోవడం ఖాయం. ఏదేమైనా ‘యానిమల్’ చిత్రంతో దర్శకుడు ఆల్ఫా మెన్ కు ఉండవసిన లక్షణాలను.. హీరో క్యారక్టర్ రూపంలో స్పష్టంగా కనబరిచాడు. మరి, ఆల్ఫా మేల్స్‌ లక్షణాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి