iDreamPost

అల్లూరి భీంల గేరు మార్చాల్సిందే

అల్లూరి భీంల గేరు మార్చాల్సిందే

బాహుబలి లాంటి అల్టిమేట్ వరల్డ్ బ్లాక్ బస్టర్ తరువాత రాజమౌళి ఏకంగా ఇద్దరు స్టార్ హీరోలతో తీస్తున్న ఆర్ఆర్ఆర్ కు బజ్ ఏ స్థాయిలో ఉండాలో ప్రత్యేకంగా చెప్పేదేముంది. కానీ మొన్న రిలీజ్ చేసిన దోస్తీ పాటతో మొదలుపెట్టి ఉక్రెయిన్ వెళ్ళాక చిన్న చిన్న వీడియోలతో సహా ఏవీ అంత ఎగ్జైటింగ్ గా లేవనేది కొందరి కంప్లయింట్. ముఖ్యంగా తమిళంలో అనిరుద్ రవిచందర్ తో పాడించినా లాభం లేకపోయింది. ఇంకా అయిదు మిలియన్ల వ్యూస్ కూడా టచ్ కాలేదు. మలయాళం కన్నడలోనూ సోసోనే. ఎటొచ్చి తెలుగు హిందీ వెర్షన్లకు మాత్రమే రెస్పాన్స్ బాగుంది. దీని కన్నా అసలు సాంగ్ రిలీజ్ కానీ పుష్పకు ఓవర్ హైప్ రావడం గమనార్హం.

ఇక్కడ కొన్ని అంశాలు విశ్లేషించాలి. దోస్తీ పాటనే తీసుకుంటే అది కీరవాణి స్టైల్ లో ఎమోషనల్ గా సిరివెన్నెల రేంజ్ కు తగ్గట్టు గొప్ప సాహిత్యంతో ఉంది కానీ ఇప్పటి జెనరేషన్ కు ఇన్స్ టాన్ట్ గా కనెక్ట్ అయ్యే రిథమ్ మిస్ అయ్యింది. బాహుబలి టైపులో మరీ క్యాచీ ట్యూన్ కాకపోవడం మైనస్ గా నిలిచింది. సరే దీని సంగతి పక్కనపెడితే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అసలు లుక్స్ ని ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో రివీల్ చేయకపోవడం మరో కారణంగా చెప్పాలి. టీజర్ లైతే వదిలారు కానీ అవి పూర్తి సంతృప్తిని ఇవ్వలేకపోయాయి. అందుకే రెండో సింగల్ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టు అంతర్గతంగా వినిపిస్తున్న మాట

మరోపక్క పుష్ప హడావిడి మాములుగా లేదు. 13న వచ్చే లిరికల్ వీడియోకి ఓ రేంజ్ లో హంగామా చేశారు. వాళ్ళు ఆశించిన బజ్ కంటే ఎక్కువ వచ్చింది. కానీ దీని రిలీజ్ డిసెంబర్ ఎప్పుడో క్రిస్మస్ పండక్కు. అక్టోబర్ 13నే రాబోతున్న ఆర్ఆర్ఆర్ టీమ్ ఇండియాకు తిరిగి వచ్చాక స్ట్రాటజీ ప్లాన్ ని మార్చాలి. ముఖ్యంగా ట్రైలర్ తో అందరిని కట్టి పడేయాలి. అప్పుడే ఎగ్జైట్ మెంట్ రెట్టింపవుతుంది. దేశవ్యాప్తంగా ఓపెనింగ్స్ తో పాటు లాంగ్ రన్ రావాలంటే ఆర్ఆర్ఆర్ గేర్ మార్చక తప్పదు. మేకింగ్ వీడియోలు, పాటలు అన్నింటిలోనూ టీమ్ మెంబెర్స్ ఉంటే సరిపోదు. అసలైన హీరోలను హైలైట్ చేయాలి. అది జరిగేది ట్రైలర్ తోనే.

Also Read : చిరంజీవి, భానుచందర్ ఇప్పుడు బెల్లం హీరో

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి