iDreamPost

ఆడియన్స్ థియేటర్ కి రావట్లేదు.. ఇది మాకు గుణపాఠం.. అల్లు అరవింద్ సంచలన కామెంట్స్..

ఆడియన్స్ థియేటర్ కి రావట్లేదు.. ఇది మాకు గుణపాఠం.. అల్లు అరవింద్ సంచలన కామెంట్స్..

ఇటీవల సినిమా కలెక్షన్స్ పెంచాలని, పెట్టిన బడ్జెట్ ని ఎలాగైనా వసూలు చేయాలని చాలా సినిమాలకి టికెట్ రేట్లు పెంచారు. ఆఖరికి డబ్బింగ్ సినిమాల టికెట్ రేట్లు కూడా పెంచారు. దీంతో సామాన్య, మధ్య తరగతి వాళ్ళు థియేటర్ కి వెళ్లడం మానేశారు. అలాగే సినిమా రిలీజ్ అవ్వగానే నెల రోజులకే ఓటీటీలోకి వస్తుండటంతో కొంతమంది అందులో వచ్చాక చూసుకోవచ్చు అని థియేటర్ కి వెళ్లడం లేదు. దీంతో హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలకి కూడా కలెక్షన్స్ లేకుండా పోయాయి. ఇక ఫ్లాప్ సినిమా సంగతి చెప్పక్కర్లేదు. టాలీవుడ్ ఒకటి అనుకుంటే ప్రేక్షకులు మరో తీర్పు ఇచ్చారు.

ఈ విషయం ఇప్పుడిప్పుడే టాలీవుడ్ వర్గాలకి అర్ధమవుతుంది. దీంతో టికెట్ రేట్లు పెంచము అని కొత్త రకంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇటీవల దిల్ రాజు టికెట్ల రేట్లు పెంచి తప్పు చేశాము అని వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ దీనిపై వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రాత్రి జరిగిన పక్కా కమర్షియల్ సినిమా ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ సినిమా టికెట్ రేట్ల గురించి మాట్లాడారు.

నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీ ఇప్పుడు నేర్చుకున్న పాఠం ఏంటంటే టికెట్ రేట్లు తగ్గించాలి, ఓటిటిలలో సినిమాలని ఆలస్యంగా వేయాలని. సినిమాలు ధియేటర్లలోనే చూడాలి. ఈ మధ్య ఆడియన్స్ థియేటర్స్ కు రావడం లేదు. సినిమా ప్రమోషన్స్ కోసం హీరో, హీరోయిన్స్ కూడా రావాలి. ఈ మధ్య స్టేజ్ మీద ఓ పెద్ద హిరో డాన్స్ కూడా చేశాడు. ఆడియన్స్ థియేటర్స్ కు రప్పించడానికి హీరో, హీరోయిన్స్ ప్రమోషన్ చేయాలి. టికెట్ రేట్లు కూడా తగ్గించాలి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఒకప్పుడు వీళ్ళే టికెట్ రేట్లు పెంచాలని ప్రభుత్వాలని కలిసి, ఇప్పుడు వీళ్ళే తగ్గించాలి అంటుంటే ప్రేక్షకులు గట్టిగానే గుణపాఠం చెప్పినట్టు అర్ధమవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి