iDreamPost

ఆదిపురుష్ సినిమాపై హైకోర్టు సీరియస్! అసలు సెన్సార్ బోర్డు ఈ సినిమా చూసిందా? అంటూ ఆగ్రహం..

  • Author Soma Sekhar Published - 11:04 AM, Wed - 28 June 23
  • Author Soma Sekhar Published - 11:04 AM, Wed - 28 June 23
ఆదిపురుష్ సినిమాపై హైకోర్టు సీరియస్! అసలు సెన్సార్ బోర్డు ఈ సినిమా చూసిందా? అంటూ ఆగ్రహం..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్-కృతి సనన్ జంటగా నటించిన ఆదిపురుష్ సినిమా జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఇక ఈ సినిమా విడుదల అయిన దగ్గర నుంచి సర్వత్రా విమర్శలను ఎదుర్కొంటూనే ఉంది. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీని తొలి రోజు నుంచే వివాదాలు చుట్టు ముట్టాయి. మరీ ముఖ్యంగా ఈ సినిమాలోని డైలాగ్స్ పై, డైలాగ్ రైటర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు అభిమానులు. ఇక కొన్ని చోట్ల ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ.. పోరాటాలు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా హైకోర్టు ఆదిపురుష్ టీమ్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆదిపురుష్ చిత్రంలోని రాముడు, హనుమంతుడు పాత్రలతో సహా రామాయణంలోని మరికొన్ని పాత్రలను అభ్యంతరకరమైన రీతిలో ఈ సినిమాలో చిత్రీకరించారని పేర్కొంటూ.. రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు అలహాబాద్ హైకోర్టులో దాఖలయ్యాయి. వీటిని విచారిస్తూ.. హైకోర్టు ఆదిపురుష్ మేకర్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రామాయణం చాలా మందికి ఆదర్శమని, ఆదిపురుష్ లోని డైలాగులు ఆందోళన కలిగించేలా ఉన్నాయని కోర్టు సీరియస్ అయ్యింది. దీనితో పాటు డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషీర్ ను ప్రతివాదిగా చేర్చి నోటీసులు పంపించింది. వారంలోగా ఈ నోటీసులపై ఆయన సమాధానం ఇవ్వాలని తీర్పులో పేర్కొంది.

కాగా.. విచారణ సందర్భంగా సెన్సార్ బోర్డ్ అసలు సినిమా చూసిందా? లేదా? అన్న సందేహం కలుగుతుందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఆదిపురుష్ సినిమా చూసి కూడా ప్రజలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించలేదు అంటే.. వారిని మెచ్చుకోవాలని చెప్పుకొచ్చింది. ఇక విమర్శలకు దారితీసిన సీన్లను తొలగించినట్లు డిప్యూటీ సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. కాగా.. సినిమా విడుదలకు ముందు ఆ డైలాగ్స్ ను ఎందుకు తొలగించలేదో సెన్సార్ బోర్డ్ ను అడగాలని కోరింది. అయితే సినిమాపై ఎలాంటి చర్యలు తీసుకున్నట్లు కోర్టు చెప్పలేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి