iDreamPost

సింగం 1…2…3..@ఏపీ సిట్

సింగం 1…2…3..@ఏపీ సిట్

ఎక్కడికైనా వెళ్లొచ్చు..ఎవరినైనా ప్రశ్నించొచ్చు !!

రాష్ట్రం మొత్తం సిట్ పరిధిలోకే !!!

రాష్ట్రంలో పెచ్చుమీరుతున్న అరాచకాలు అక్రమాలు అంటూ తేల్చేందుకు ఆఫీసర్ నరసింహకు ముఖ్యమంత్రి బాధ్యతలు ఇస్తాడు. నాకు ఒట్టి బాధ్యతలలే కాదు..అధికారాలు కావాలి .ఎక్కడికైనా వెళ్లేందుకు, ఎవరినైనా ప్రశ్నించేందుకు అవకాశం ఇవ్వాలి..ఎందుకు ? ఏమిటి?? అని అడగొద్దు అని ఏసీపీ నరసింహ కండిషన్ పెడతాడు…”సరే లెవయ్యా నీకు ఏం కావాలంటే అదిస్తాను. దుమ్మురేపేయ్ అంటాడు సీఎం..ఇక నరసింహ టీమ్ రంగంలోకి దిగి ఒకొక్కడికి తుప్పు రేగ్గొడుతుంది…ఇదంతా సూర్య సినిమా సింగం సిరీస్ గుర్తొచ్చింది కదా ..ఇప్పుడు ఏపీ లో కూడా అలాంటి బృందాన్నే రంగంలోకి దించింది..

మీకు అడ్డు , అదుపు, అధికార పరిధి లేదు..ఏపీ మొత్తం మీ పోలీస్ స్టేషన్ అనుకోండి..మీరే ఎస్సైలు అనుకోండి..ఉరకండి అంటూ ఉసిగొల్పింది… అవును..నిజమే…

అమరావతి భూ అక్రమాల మీద దర్యాప్తు చేసేందుకు కె.రఘురామి రెడ్డి (డిఐజి)సారధ్యంలో సిట్ వేసిన ఏపీ సర్కారు అందులో ఇద్దరు ఎస్పీలు , డీఎస్పీలు , సీఐలు మరో తొమ్మిది మందిని నియమించింది.అయితే కేవలం అమరావతి భూ లావాదేవీలు తవ్వితీయడమే దాని లక్ష్యం అని మొదట్లో ఇచ్చిన జీవోల్ పేర్కొన్నప్పటికి తాజాగా ఆ సిట్ కు మరిన్ని అధికారాలు దఖలుపరిచారు..

ఏపీ మొత్తం సిట్ పరిధిలోకి

ఎపిలో గత సర్కారు హయాంలో ఎక్కడ ఏ అవినీతి జరిగినట్లు, అక్రమం చోటుచేసుకున్నట్లు అనుమానం వచ్చిన సిట్ అధికారులు దాన్ని దర్యాప్తు చేయవచ్చు. దాని విచారణ నిమిత్తం ఏ శాఖ అధికారిని అయినా ఏ ప్రజాప్రతినిధిని అయినా పిలిపించి ప్రశ్నించొచ్చు.. వారి వాంగ్మూలం రికార్డ్ చేయవచ్చు.. ఏపీలోని అన్ని జిల్లాలు, అన్ని శాఖలూ సిట్ పరిధిలోకి తెస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతోబాటు సిట్ బృందం కేసు నమోదు చేయొచ్చు, తానే దర్యాప్తు చేయొచ్చు .అవసరం అనుకుంటే రాష్ట్రంలోని మరే ఇతర దర్యాప్తు సంస్థను అంటే ఎసిబి,విజిలెన్స్, సీబీసీఐడి అధికారులతో సమన్వయం చేయొచ్చు.. ఇంకా కావాలంటే ఎన్ ఐఏ,సీబీఐ వంటి వారి సహకారం తీసుకునే అధికారం సైతం ఈ సిట్ కు అప్పగించారు. అంటే సిట్ అనేది ఓ పోలీస్ స్టేషన్ అనుకుంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం దాని పరిధిలోకి తెస్తూ ఆ బృందానికి దర్యాప్తు, విచారణకు సంబంధించి పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్రం అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. టీమ్ సభ్యులంతా మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నవాళ్లు కావడంతో ఈ సంస్థ మంచి ఫలితాలు సాధిస్తుందని అంటున్నారు…

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి