iDreamPost

All Of Us Are Dead : ఆల్ అఫ్ అజ్ ఆర్ డెడ్ రిపోర్ట్

All Of Us Are Dead : ఆల్ అఫ్ అజ్ ఆర్ డెడ్ రిపోర్ట్

ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన కొరియన్ వెబ్ సిరీస్ ఆల్ అఫ్ అజ్ ఆర్ డెడ్ (All Of Us Are Dead) ఓటిటి ప్రపంచంలో సంచలనం రేపుతోంది. స్క్విడ్ గేమ్స్ తాలూకు ప్రభంజనం ఇంకా ఫ్రెష్ గా ఉండగానే ఇప్పుడీ కంటెంట్ కూడా ఆకట్టుకోవడంతో వరల్డ్ వైడ్ గా దీన్ని చూసే ప్రేక్షకుల సంఖ్యలో అమాంతం కోట్లలో పెరిగిపోతోంది. ట్రైన్ టు బుసాన్ స్ఫూర్తితో రాసుకున్న సబ్జెక్టు అయినప్పటికీ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో బాగా ఎంగేజ్ చేయడం దీని ప్రత్యేకత. దశాబ్దాలుగా హాలీవుడ్ లో మొదలుపెట్టి మన తెలుగులో జాంబీరెడ్డితో కలుపుకుని కొన్ని వేల జాంబీ సినిమాలు వచ్చినప్పటికీ ఈ ట్రెండ్ లోనూ ఈ జానర్ హాట్ కేక్ కావడం గమనార్హం. రిపోర్ట్ మీద ఓ లుక్ వేద్దాం.

అది ఒక పెద్ద స్కూల్ కం కాలేజీ. వందల విద్యార్థులు అందులో చదువుతూ ఉంటారు. ఓ సైన్స్ టీచర్ కొడుకు పిరికితనం వల్ల తోటి క్లాస్ మేట్స్ ర్యాగింగ్ కారణంగా చనిపోతాడు. దీన్ని మనసులో పెట్టుకున్న ఆ ఉపాధ్యాయుడు కసికొద్ది ఓ మందును కనిపెడతాడు. దాన్ని ఓ అమ్మాయి మీద ప్రయోగిస్తాడు. కానీ అది వికటించి ఆమె జాంబీగా మారిపోతుంది. అక్కడ మొదలు కళాశాలలో ఉన్న ఒక్కొక్కరికి ఈ వైరస్ గొంతు మీద కొరకడం వల్ల పాకిపోయి అందరూ జాంబీలు అయిపోతారు. నగరం మొత్తం విధ్వంసంతో అట్టుడికిపోతుంది. పోలీసులు ప్రభుత్వం రంగంలోకి దిగుతుంది. చివరికి ఈ అరాచకం ఎక్కడ ఆగిందనేది సిరీస్ చూస్తేనే అర్థమవుతుంది.

పన్నెండు ఎపిసోడ్లకు గాను మొత్తం కలిపి 13 గంటల దాకా ఈ సిరీస్ ఉంది. ఇంత సుదీర్ఘంగా ఉన్నప్పటికీ ఎక్కడా విపరీతమైన ల్యాగ్ ఉండదు. ఇలాంటి జాంబీ కథలు గతంలో చాలానే చూసినప్పటికీ ఆసక్తిని కొనసాగించడంలో దర్శకులు లీ జే క్యో – కిమ్ నామ్ సూలు విజయవంతమయ్యారు. నౌ అట్ అవర్ స్కూల్ నవల ఆధారంగా రూపొందిన ఈ థ్రిల్లర్ లో బోలెడంత సస్పెన్స్ తో పాటు మంచి ఎమోషన్లను దట్టించారు. స్నేహం, కుటుంబం ఇలాంటి అంశాలకు చోటిచ్చారు. రోజులో కొంత తీరిక సమయం చేసుకుని హ్యాపీగా చూసేయొచ్చు. కాకపోతే ఒకేసారి చూసేద్దామా అనిపించే హారర్ ఉండటమే ఇందులో ప్రత్యేకత. ట్రై చేయండి

Also Read : Sree Leela : పెళ్లి సందడి భామకు భారీ అవకాశం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి