iDreamPost

2024 7 Seaters: కొత్త సంవత్సరంలో రాబోతున్న సరికొత్త 7 సీటర్ కార్లు ఇవే!

కారు అనేది కొందరికి అవసరం అయితే.. ఇంకొందరికి విలావ వస్తువు. అందుకే లక్షలతో మొదలు పెట్టి కోట్లు పెట్టి కార్లు కొంటూ ఉంటారు. 2024లో సరికొత్త 7 సీటర్ కార్లు వస్తున్నాయి. వాటి వివరాలో ఏంటో చూద్దాం.

కారు అనేది కొందరికి అవసరం అయితే.. ఇంకొందరికి విలావ వస్తువు. అందుకే లక్షలతో మొదలు పెట్టి కోట్లు పెట్టి కార్లు కొంటూ ఉంటారు. 2024లో సరికొత్త 7 సీటర్ కార్లు వస్తున్నాయి. వాటి వివరాలో ఏంటో చూద్దాం.

2024 7 Seaters: కొత్త సంవత్సరంలో రాబోతున్న సరికొత్త 7 సీటర్ కార్లు ఇవే!

కారు అనేది కొందరికి అవసరం అయితే ఇంకొందరికి విలాస వస్తువు. కొంతమంది మాత్రం తమ సౌకర్యం, లగ్జరీ కోసమే కార్లను కొంటూ ఉంటారు. అలాంటి వారు కాస్ట్ గురించి అస్సలు పట్టించుకోరు. లక్షలతో మొదలు పెట్టి కోట్ల వరకు కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం మార్కెట్ లో చాలానే లగ్జరీ కార్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే 7 సీటర్ కార్లను కూడా ధర ఎక్కువగా ఉన్నా ఎంతోమంది కొనుగోలు చేస్తూ ఉంటారు. అందుకే కొన్ని కంపెనీలు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే తరుణంలో కొన్ని కొన్ని 7 సీటర్ కార్లను విడుదల చేస్తున్నాయి. వాటి ధర సామాన్యులకు కాస్త భారంగా ఉన్నా కూడా కొందరు మాత్రం సౌకర్యవంతంగా ఉండేందుకు కొనుగోలు చేస్తున్నారు. మరి.. 2024లో వస్తున్న 7 సీటర్ కార్లు ఏవో చూద్దాం.

టయోటా ఫార్చునర్:

టయోటా పార్చునర్ కు మార్కెట్లో ఎంతో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఎక్కవగా ఈ కారును కొనుగోలు చేస్తారు. ఇప్పుడు 2024 సంవత్సరంలో సరికొత్త ఫార్చునర్ మార్కెట్ లోకి రాబోతోంది. ఈ కారుకు సంబంధించిన ఇంటీరియర్, ఎక్స్ టీరియర్ లో కూడా పలు రకాల మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఇందుకు సంబందించిన చాలా అంశాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. టెక్నాలజీ అప్ గ్రేడ్స్ కూడా ఉంటాయి అంటున్నారు. బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, 360 డిగ్రీ వ్యూయ్, రేర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, వైర్ లెస్ ఛార్జింగ్, టైర్ ప్రజర్ మానిటరింగ్, కొన్ని వేరియంట్స్ లో 9 ఇంచెస్ లార్జ్ టచ్ స్క్రీన్ కూడా ఉంటుందని చెబుతున్నారు. అయితే ఇంజిన్ లో మాత్రం పెద్దగా మార్పులు ఏమీ ఉండవని తెలుస్తోంది.

New 7 seaters coming in 2024

న్యూ జనరేషన్ కియా కార్నివాల్:

కియా నుంచి అందుబాటులో ఉన్న కార్నివాల్ లగ్జీరియస్ 7 సీటర్ కారు అని చెప్పాలి. దీనిలో 9 సీటర్ ఆప్షన్ కూడా ఉన్నా.. 7 సీటర్ గా ఎంతో విలాసవంతంగా ఉంటుంది. అలాగే ఇన్నోవా, మరాజో వంటి మోడల్స్ కి మంచి పోటీగా కూడా ఉంటుంది. ఈ కారుకు సంబంధించి 2024 మోడల్ లో ఎక్స్ టీరియర్ డిజైన్ లో మార్పులు తీసుకొచ్చారు. కియా ఈవీ9, తాజాగా విడుదలైన కియా సెల్టోస్ ని పోలినట్లు ఈ ఎక్స్ టీరియర్ డిజైన్ ఉంది. అయితే ఇంటీరియర్ కి సంబంధించి మాత్రం ఎలాంటి సమాచారం లేదు. వాటిలో కూడా మార్పులు ఉండే అవకాశం లేకపోలేదు. లార్జ్ టచ్ స్క్రీన్ తో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుందని చెబుతున్నారు. అలాగే డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, 3 జోన్ క్లయిమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్ లాంటి ప్రీమియం ఆప్షన్స్ కూడా ఉండచ్చు. ఇంజిన్ లో మాత్రం పెద్దగా మార్పులు ఉండవని చెబుతున్నారు. 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ తోనే వస్తుంది.

New 7 seaters coming in 2024

టాటా సఫారీ:

టాటా నుంచి ఉన్న 7 సీటర్ కార్లలో టాటా సఫారీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సఫారీ స్టార్మ్ మోడల్ కి అయితే మార్కెట్ లో మంచి డిమాండ్ ఉండేది. ఇప్పుడు సఫారీ, హారియర్ మోడల్స్ లుక్స్ మొత్తం మార్చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మోడల్స్ ఫేస్ లిఫ్ట్స్ కూడా చేశారు. ఎక్స్ టీరియర్ అప్డేట్ చేశారు. ఫ్రంట్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ ని స్లీకర్ డిజైన్ లో తీసుకొచ్చారు. ఫ్రంట్ అండ్ రేర్ కనెక్టెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ లో వెల్కమ్, గుడ్ బాయ్ యానిమేషన్ తీసుకొచ్చారు. ఫ్రంట్ గ్రిల్ ని కూడా మార్చేశారు. కొత్త డిజైన్ చాలా బాగుందనే రెస్పాన్స్ వస్తోంది. బై-ఎల్ఈడా ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ తీసుకొస్తున్నారు. 360 డిగ్రీ కెమెరా వ్యూయ్, గెస్చర్ కంట్రోల్ తో ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ ని కూడా తీసుకొచ్చారు.

New 7 seaters coming in 2024

న్యూ అలాయ్ వీల్ డిజైన్ ని కూడా తీసుకొచ్చారు. అలాగే ఇంటీరియర్ లో కూడా బాగానే అప్డేట్స్ చేశారు. ట్రిపుల్ టోన్ డ్యాష్ బోర్డ్, మల్టీ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, మల్టీ ఫంక్షన్ సెంట్రల్ కంట్రోల్ ప్యానల్, రేర్ విండో సన్ షేడ్స్, మల్టీ కలర్ యాంబియంట్ లైటింగ్, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లయిమెట్ కంట్రోల్ వంటి ఇంటీరియర్ అప్ డేట్స్ కూడా జరిగాయి. పెడల్ షిఫ్టర్స్ తో న్యూ స్టీరింగ్ వీల్, ఇ-షిఫ్టర్, న్యూ అలోయ్ వీల్స్ డిజైన్స్ కూడా వస్తున్నాయి. కలర్ ఆప్షన్స్ కూడా ఇప్పుడు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. 2024 టాటా సఫారీ మొత్తం 7 కలర్ ఆప్షన్స్ తో రాబోతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి